E-Paper
Advertisement

మేమేమన్నా ఓట్లేసే మిషన్లమా?.. కిషన్ రెడ్డిపై వీహెచ్ యుద్ధప్రకటన!

మేమేమన్నా ఓట్లేసే మిషన్లమా?.. కిషన్ రెడ్డిపై వీహెచ్ యుద్ధప్రకటన!
Advertisement

V Hanumantha Rao: ప్రభుత్వ సలహాదారు వి. హన్మంతరావు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ప్రధాని మోదీ లక్ష్యంగా చేసిన సంచలన వ్యాఖ్యల చేశారు. రాహుల్ గాంధీ ప్రధాని కాలేరంటూ కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై హన్మంతరావు తీవ్రంగా మండిపడ్డారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. కేవలం స్టేట్మెంట్లకే పరిమితమవుతున్న కిషన్ రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రిని మోదీ దగ్గరికి తీసుకెళ్లకుండా తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడుతున్నారని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో సికింద్రాబాద్‌లో కిషన్ రెడ్డికి బీసీల ఓట్లు పడవని, ఆయన ఓటమి ఖాయమని స్పష్టం చేశారు.

కులగణన – రాహుల్ గాంధీ విజయం

Advertisement

జనగణనలో భాగంగా కులగణన జరగాలని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ కూడా చెప్పారని ఆయన గుర్తుచేశారు. బీహార్‌లో 60 శాతం, తెలంగాణలో 55 శాతం ఉన్న బీసీలకు దేశవ్యాప్తంగా అన్యాయం జరుగుతోందని రాహుల్ గాంధీ గుర్తించారన్నారు. దేశంలో కులగణన జరిగితే రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ గెజిట్‌లో కొన్ని బీసీ కులాల పేర్లే లేకపోవడం శోచనీయమన్నారు.

బీజేపీకి బీసీల హెచ్చరిక

Advertisement

తాము కేవలం ఓట్లేసే మిషన్లమా అని హన్మంతరావు ప్రశ్నించారు. కేంద్రంలో బీజేపీ బిల్లులు పాస్ అవ్వాలన్నా బీసీల ఓట్లు కావాల్సిందేనన్నారు. ప్రధాని మోదీ మూడుసార్లు అధికారంలోకి వచ్చినా బీసీలకు చేసిందేమీ లేదని, ఆయనకు బీసీలపై ప్రేమ లేదని విమర్శించారు. మోదీ హిందూ కార్డుతో ఓట్లు అడుగుతున్నారని, హిందువుల్లోనూ బీసీలు ఉన్నారనే విషయాన్ని మరువరాదన్నారు. దేశవ్యాప్తంగా 60 శాతానికి పైగా ఉన్న బీసీలంతా తిరగబడితే బీజేపీ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని, తాను స్వయంగా దేశమంతా తిరిగి బీజేపీ బీసీ వ్యతిరేకి అని ప్రచారం చేస్తానని హెచ్చరించారు.

Also Read: చంద్రబాబు హామీలన్నీ మోసమే.. జగనన్న పథకాలను కాపీ కొట్టారు.. కన్నబాబు సంచలనం!

Related News

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ-తెలంగాణల్లో భారీ వర్షాలు, రాబోయే రెండురోజుల్లో..

తెలంగాణ ఇష్యూ ఢిల్లీకి.. BRS నేతల భారీ ప్లాన్!

తెలంగాణ రాష్ట్ర గ్రామ పంచాయతీలకు గుడ్ న్యూస్..?

హైదరాబాద్ వాసులకు అలర్ట్.. దుర్గం చెరువు 2 రోజులు క్లోజ్!

పోలీసుల ముందుకు కొండా సురేఖ మాజీ ఓఎస్డి సుమంత్… ఆ ముగ్గురితో లింకులపై ఆరా!

సీఎం రేవంత్ రెడ్డిపై.. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి షాకింగ్ కామెంట్స్..?

త్వరలో ఆర్టీసీ కార్మిక సంఘాల ఎన్నికలు.. మంత్రి పొన్నం క్లారిటీ!

తెలంగాణ SIR 2026 ఓటర్ల జాబితా పరిశీలన.. నాయకులపై టీపీసీసీ చీఫ్ ఫైర్..!

Big Stories

Advertisement
×