E-Paper
Advertisement

Dog Bite: కుక్క కాటుకు గురై 15 నెలల తర్వాత బాలుడు మృతి

Dog Bite: కుక్క కాటుకు గురై 15 నెలల తర్వాత బాలుడు మృతి
Advertisement

Dog Bite: కుక్క కాటుకు గురైన బాలుడు 15 నెలలపాటు మృత్యువుతో పోరాడి చివరకు తుదిశ్వాస వదిలాడు. కొడుకును కాపాడుకోవటానికి తల్లిదండ్రులు 50 లక్షలకు పైగా ఖర్చు చేసినా ప్రాణాన్ని దక్కించుకోలేక పోయారు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న బిడ్డ చనిపోవటంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. విషాదం వివరాలు ఇలా ఉన్నాయి. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం కోటిలింగాల గ్రామ వాస్తవ్యులు మాధవి, శ్రీనివాస్​ భార్యాభర్తలు. వీరి కుమారుడు మణితేజ (9). 2004, డిసెంబర్​ 26న మణితేజ ఇంటి ముందు ఆడుకుంటుండగా దాడి చేసిన వీధి కుక్కలు విచక్షణారహితంగా కరిచాయి.

Also Read: Sridhar Babu: నామినేటెడ్ పదవులపై కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు: మంత్రి శ్రీధర్ బాబు

మెదడుకు వెళ్లే నరం..

Advertisement

వెంటనే మణితేజను హాస్పిటల్​ కు తీసుకెళ్లిన తల్లిదండ్రులు టీకా వేయించారు. ఇంటికి వచ్చిన తరువాత జ్వరం రావటంతో జగిత్యాలలోని ఓ ప్రైవేట్​ ఆస్పత్రిలో చూపించారు. అక్కడి వైద్యుల సలహా మేరకు హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్​ హాస్పిటల్ లో చేర్పించారు. ఇక్కడ జరిపిన పరీక్షల్లో కుక్క కాటు కారణంగా వెన్నెముక నుంచి మెదడుకు వెళ్లే నరం దెబ్బ తిన్నదని నిర్ధారణ అయ్యింది. అప్పటి నుంచి వెంటిలేటర్​ పైనే ఉంచి మణితేజకు చికిత్స చేస్తూ వస్తున్నారు. అయినా, ఈ ప్రయత్నాలు ఫలించ లేదు. మంగళవారం మణితేజ చికిత్స పొందుతూ కన్నుమూయటంతో తల్లిదండ్రులు భోరున విలపిస్తున్నారు.

Also Read: CM Revanth Reddy: ఢిల్లీలో బిజీగా సీఎం రేవంత్.. కాసేపట్లో రాహుల్‌గాంధీతో భేటీ, పార్టీ ముఖ్యనేతలతో..

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×