E-Paper
Advertisement

త్వరలోనే Samsung Galaxy Tab S12 Ultra లాంచ్.. ముందే లీకైన ఆ సీక్రెట్ ఫీచర్స్ ఇవే!

త్వరలోనే Samsung Galaxy Tab S12 Ultra లాంచ్.. ముందే లీకైన ఆ సీక్రెట్ ఫీచర్స్ ఇవే!
Advertisement

Galaxy Tab S12 Ultra: ప్రముఖ టెక్ దిగ్గజం శాంసంగ్ నుంచి త్వరలోనే సరికొత్త గెలాక్సీ ట్యాబ్ S12 సిరీస్ విడుదల కానుంది. గతేడాది మార్కెట్లోకి వచ్చిన గెలాక్సీ ట్యాబ్ S11 సిరీస్‌కు కొనసాగింపుగా ఈ కొత్త మోడళ్లను సంస్థ తీసుకురాబోతోంది. అయితే ఈ సిరీస్ లాంచ్‌కు ముందే, ఇందులో అత్యంత ప్రీమియం మోడల్ అయిన ‘గెలాక్సీ ట్యాబ్ S12 అల్ట్రా’కు సంబంధించిన డిజైన్ వివరాలు, కొన్ని కీలక ఫీచర్లు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యి నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.

పాత మోడల్‌ను పోలిన లుక్:

ప్రముఖ టిప్‌స్టర్ లీక్ చేసిన ఫొటోల ప్రకారం.. రాబోయే గెలాక్సీ ట్యాబ్ S12 అల్ట్రా డిజైన్ దాదాపు పాత మోడల్ అయిన ట్యాబ్ S11 అల్ట్రాలాగే ఉండబోతోంది. గ్రే కలర్ వేరియంట్‌లో కనిపించిన ఈ ట్యాబ్ వెనుక భాగంలో విడివిడిగా ఉన్న రెండు కెమెరాలు, వాటి కింద ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. అలాగే ఎస్-పెన్ అమర్చుకోవడానికి వీలుగా వెనుక వైపు ప్రత్యేకమైన మాగ్నెటిక్ చార్జింగ్ స్ట్రిప్ కూడా అందించారు.

Advertisement

Also Read: చెవులకు క్లిప్‌లా తగిలించుకోవడమే.. నథింగ్ CMF నుంచి క్రేజీ ఇయర్‌బడ్స్ వచ్చేస్తున్నాయ్!

ఆకట్టుకునే డిస్‌ప్లే పరిమాణం:

ఈ సరికొత్త ట్యాబ్ పరిమాణంలో ఎలాంటి మార్పులు చేయడం లేదని తెలుస్తోంది. గతేడాది మోడల్ లాగే ఇది కూడా 326.34 x 208.46 x 5.12 మిమీ కొలతలతో చాలా స్లిమ్‌గా ఉండనుంది. ఇందులో 14.6 అంగుళాల భారీ డైనమిక్ అమోలెడ్ 2X డిస్‌ప్లేను శాంసంగ్ కొనసాగించబోతోంది. స్క్రీన్ పైభాగంలో చిన్న నాచ్ ఉంటుంది. అందులోనే ముందు వైపు కెమెరాను అమర్చారు.

భారీ బ్యాటరీ సామర్థ్యం:

Advertisement

గెలాక్సీ ట్యాబ్ S12 అల్ట్రాలో పవర్‌ఫుల్ మీడియాటెక్ డైమెన్సిటీ 9500 ప్రాసెసర్‌ను వాడినట్లు సమాచారం. ఇది ఆండ్రాయిడ్ 17 ఆధారిత వన్ యూఐ 9.0 సాఫ్ట్‌వేర్‌పై రన్ అవుతుంది. కనీసం 12GB RAM, 256GB స్టోరేజ్ వేరియంట్‌తో పాటు ఇందులో 11,600mah సామర్థ్యం గల భారీ బ్యాటరీని అందించనున్నారు. ఇది 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ సరికొత్త ట్యాబ్ ఈ ఏడాది సెప్టెంబరులో భారత మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది.

Also Read: OnePlus 15 యూజర్లకు గుడ్ న్యూస్.. ఆ ఒక్క అప్‌డేట్‌తో ఇక డబుల్ ధమాకా!

Related News

చెత్తలో పడేసే ప్లాస్టిక్ బాటిళ్లతో.. అద్భుతమైన ఇల్లు.. కెనడా బిల్డర్ల క్రేజీ ఆవిష్కరణ!

సాధారణ ఫ్యాన్ vs బీఎల్‌డీసీ.. రెండింటికి తేడా ఏంటి? పవర్ ఆదాకు ఏది పర్ఫెక్ట్?

రూ.2,390లకే డైమండ్ కట్ డిజైన్ స్మార్ట్‌వాచ్..పెబుల్ వియన్నా స్పెషల్ లుక్!

మ్యూజిక్ లవర్స్‌కు గుడ్ న్యూస్..4 మైక్ ENC ఫీచర్‌తో కొత్త బౌల్ట్ ఇయర్‌బడ్స్!

క్యాబేజీ, పండ్ల తొక్కలతో నివాసాలు.. ఉంటే నీడ, తింటే ఆహారం.. ఇదెక్కడి టెక్నాలజీ సామీ!

రూ.599లకే 45 గంటల బ్యాటరీ బ్యాకప్ ఇయర్ బడ్స్..

రూ.18 వేలకే.. స్టాండింగ్ డిష్‌వాషర్, వెంటనే కొనేయండి

రూ.60వేల రోబోటిక్ క్లీనర్ ఇప్పుడు రూ.23,999కే..సూపర్ డీల్!

Big Stories

Advertisement
×