E-Paper
Advertisement

Samsung Flip Discount: గెలాక్సీ Z ఫ్లిప్ ఫోల్డెబుల్ ఫోన్‌పై భారీ తగ్గింపు.. ఏకంగా రూ.50000 డిస్కౌంట్

Samsung Flip Discount: గెలాక్సీ Z ఫ్లిప్ ఫోల్డెబుల్ ఫోన్‌పై భారీ తగ్గింపు.. ఏకంగా రూ.50000 డిస్కౌంట్
Advertisement

Samsung Flip Discount| 2026 కొత్త సంవత్సరం సందర్భంగా ప్రముఖ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో స్మార్ట్‌ఫోన్స్ పై మంచి డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. శాంసంగ్ పాపులర్ ఫ్లిప్ ఫోన్ గెలాక్సీ Z ఫ్లిప్ 4 ఇప్పుడు భారీ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. ఒరిజినల్ లాంచ్ ధరతో పోల్చితే దాదాపు రూ.50,000 వరకు పొదుపు చేయవచ్చు. అమెజాన్ ఇండియాలో ఈ ప్రీమియం ఫోల్డబుల్ ఫోన్ చాలా తక్కువ ధరకు లభిస్తోంది. ఈ ఆఫర్ వల్ల ఖరీదైన ఫోల్డబుల్ ఫోన్ సులభంగా కొనుగోలు చేయవచ్చు.

గెలాక్సీ Z ఫ్లిప్ 4 ధర, ఆఫర్లు

శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 4 ఆగస్టు 2022లో లాంచ్ అయింది. ఆ సమయంలో ప్రారంభ ధర రూ.94,999. ఇప్పుడు అమెజాన్‌లో 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ కేవలం రూ.44,999కే లభిస్తోంది. ఇది దాదాపు రూ.50,000 డైరెక్ట్ డిస్కౌంట్. బ్యాంక్ ఆఫర్లతో మరింత పొదుపు చేయవచ్చు. అమెజాన్ పే ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూజర్లకు 5 శాతం అన్‌లిమిటెడ్ క్యాష్‌బ్యాక్ ఉంది. ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌తో రూ.42,100 వరకు సేవింగ్స్ పొందవచ్చు. ఎక్స్‌ఛేంజ్ వాల్యూ ఫోన్ కండిషన్, మోడల్‌పై ఆధారపడి ఉంటుంది. అన్ని ఆఫర్లు కలిపి ఈ ఫ్లిప్ ఫోన్ బెస్ట్ వాల్యూ డీల్‌గా మారింది.

ప్రీమియం ఫోల్డబుల్ డిస్‌ప్లే ఎక్స్‌పీరియన్స్

Advertisement

గెలాక్సీ Z ఫ్లిప్ 4లో 6.7 అంగుళాల డైనమిక్ AMOLED 2X మెయిన్ డిస్‌ప్లే ఉంది. ఫుల్ HD+ రిజల్యూషన్ (1080 x 2640 పిక్సెల్స్)తో వస్తుంది. 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ స్మూత్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. ఈ ఫోన్‌లో 22:9 ఆస్పెక్ట్ రేషియో ఉంది. అదనంగా 1.9 అంగుళాల సూపర్ AMOLED అవుటర్ డిస్‌ప్లే ఉంది. నోటిఫికేషన్లు, విడ్జెట్స్, క్విక్ కంట్రోల్స్ చూడవచ్చు. రిజల్యూషన్ 260 x 512 పిక్సెల్స్.

పర్‌ఫామెన్స్, సాఫ్ట్‌వేర్

ఫోన్‌లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్ ఉంది. 4nm టెక్నాలజీతో బలమైన పర్‌ఫామెన్స్, మంచి పవర్ ఎఫిషియెన్సీ ఇస్తుంది. మల్టీటాస్కింగ్, గేమింగ్, రోజువారీ పనులు స్మూత్‌గా నడుస్తాయి. ఈ డివైజ్ లో ఫోల్డబుల్ పర్‌ఫామెన్స్‌ని ఆప్టిమైజ్ చేశారు.

బ్యాటరీ, ఛార్జింగ్ సపోర్ట్

Advertisement

ఫోన్‌లో 3,700mAh బ్యాటరీ ఉంది. 25W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. వైర్‌లెస్ ఛార్జింగ్, రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ కూడా ఉంది. మోడరేట్ యూసేజ్‌కు రోజంతా సరిపోతుంది.

కెమెరా సెటప్, ఫోటోగ్రఫీ

డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 12MP వైడ్-యాంగిల్ కెమెరా OIS సపోర్ట్‌తో వస్తుంది. 12MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉంది. క్లియర్ ఫోటోలు, స్టెబుల్ వీడియోలు వస్తాయి. సెల్ఫీలకు 10MP ఫ్రంట్ కెమెరా. ఫ్లెక్స్ మోడ్‌తో హ్యాండ్స్-ఫ్రీ ఫోటోగ్రఫీ, వీడియో రికార్డింగ్ చేయవచ్చు.

కనెక్టివిటీ, సెక్యూరిటీ ఫీచర్లు

5G, 4G LTE సపోర్ట్ ఉంది. Wi-Fi, బ్లూటూత్ 5.2, GPS, NFC ఆప్షన్లు ఉన్నాయి. USB టైప్-C పోర్ట్ ఉంది. సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ త్వరగా అన్‌లాక్ చేస్తుంది.

Also Read: చలికాలంలో రూం హీటర్లతో అగ్నిప్రమాదాలు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

ఫోల్డెబుల్ ఫోన్‌ పై బెస్ట్ డీల్ ఇదే

ఈ డీల్ వల్ల ప్రీమియం ఫోల్డబుల్ ఫోన్ సరసమైన ధరలో లభిస్తుంది. ఫ్లాగ్‌షిప్ ఫర్‌ఫామెన్స్, స్టైలిష్ డిజైన్, ఫోల్డబుల్ ఇన్నోవేషన్ లభిస్తాయి. భారీ డిస్కౌంట్ వల్ల తక్కువ ధరలో మంచి వాల్యూ లభిస్తుంది.

Related News

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

జియో, విఐ బెటర్ అంటున్న యూజర్లు.. ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ బ్యాన్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం!

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

Big Stories

Advertisement
×