Rohit Sharma-vada pav: టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు ( Rohit Sharma) వడపావ్ ( Vada pav) అంటే బాగా ఇష్టమన్న సంగతి తెలిసిందే. అయితే 2027 వన్డే వరల్డ్ కప్ లో జట్టులో దూకుడుగా ఆడేందుకుగాను తనకు ఇష్టమైన వడపావ్ పూర్తిగా మానేశాడు రోహిత్ శర్మ. వడపావ్ మానేయడమే కాకుండా 20 కేజీల వరకు బరువు కూడా తగ్గిపోయాడు. అందుకే ఈ మధ్యకాలంలో రోహిత్ శర్మ స్లిమ్ గా కనిపిస్తున్నాడు. అయితే అలాంటి రోహిత్ శర్మకు తాజాగా అతని అభిమానులు వడపావ్ ఆఫర్ చేశారు. టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఈ నెల 11వ తేదీ నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్ కోసం రోహిత్ శర్మ నెట్స్ లో చెమటోడ్చుతున్నాడు.
అయితే అక్కడికి వచ్చిన కొంత మంది అభిమానులు, రోహిత్ శర్మకు ఆఫర్ ఇచ్చారు. వడపావ్ తింటావా ? తీసుకువస్తామని పదేపదే రోహిత్ భాయ్ అంటూ పిలిచారు ఫ్యాన్స్. అయితే వెంటనే నాకు వద్దురా బాబు.. అంటూ వాళ్లకు సైగలు చేశాడు రోహిత్ శర్మ. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది చూసిన ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. 2027 వన్డే వరల్డ్ కప్ కోసం రోహిత్ శర్మ తనకు ఇష్టమైన వడపావ్ కూడా వదిలి హనుమంతుడిలా విశ్వ ప్రయత్నం చేస్తున్నాడని కామెంట్ చేస్తున్నారు.
టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య వన్డే సిరీస్ షెడ్యూల్ ఇదే
టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ ( India vs New Zealand, 1st ODI ) మధ్య 2026 కొత్త సంవత్సరంలో వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. టీమిండియా కూడా ఈ కొత్త సంవత్సరంలో తొలిసారిగా న్యూజిలాండ్ తో ఆడుతోంది. జనవరి 11వ తేదీ అంటే ఆదివారం రోజు నుంచి టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. మొదటి వన్డే మ్యాచ్ వడోదర వేదికగా జరుగుతుంది. ఇక రెండవ వన్డే జనవరి 14వ తేదీన రాజ్ కోట్ వేదికగా జరగనుంది. ఇక టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య చివరి వన్డే మ్యాచ్ జనవరి 18వ తేదీన ఇండోర్ స్టేడియంలో జరగనుంది. ఈ మేరకు షెడ్యూల్ ఖరారు అయింది. టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగే వన్డే సిరీస్ కోసం రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ సన్నద్ధం అవుతున్నారు. ఈ టోర్నమెంట్ నేపథ్యంలో శుభ్ మన్ గిల్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య వన్డే సిరీస్ పూర్తయిన వెంటనే ఈ రెండు జట్ల మధ్య 5 t20 ల సిరీస్ ప్రారంభమవుతుంది. ఈ సిరీస్ పూర్తికాగానే ఫిబ్రవరిలో టి20 ప్రపంచ కప్ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి మార్చి 8వ తేదీ వరకు ఈ టోర్నమెంట్ జరుగనుంది.
Also Read: Sara Tendulkar: సచిన్ ఘోర అవమానం..కూతురు సారా ఫోటోలు అసభ్యకరంగా తీసి, వేధింపులు ?
After the practice session ended, when Rohit Sharma came out, the fans jokingly said, "Rohit bhaiya, vadapav pahije ka" and
Rohit just waved his hand and replied, "No" 😂❤️bRO always enjoy with his fans❤️ pic.twitter.com/euco1nvMqs
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) January 6, 2026