E-Paper
Advertisement

BRS News: బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్.. కేటీఆర్ ఖమ్మం టూర్‌కి ముందే, రానున్న రోజుల్లో

BRS News: బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్.. కేటీఆర్ ఖమ్మం టూర్‌కి ముందే, రానున్న రోజుల్లో
Advertisement

BRS News: బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతోంది? తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను ఆ పార్టీ కేడర్ నిశితంగా గమనిస్తోందా? ఖమ్మం టూర్‌కి ముందు కేటీఆర్‌కు ఆ పార్టీ కార్పొరేటర్లు షాక్ ఇచ్చారా? బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి జంప్ కావడం మొదలుపెట్టారా? ఏం జరుగుతోందంటూ ఆరా తీయడం బీఆర్ఎస్ పెద్దల వంతు అయ్యిందా? 

ఖమ్మం టూర్‌కి ఉందే కేటీఆర్‌కు షాకులు

Advertisement

స్థానిక సంస్థల ఎన్నికలకు సంక్రాంతి తర్వాత నోటిఫికేషన్ వస్తుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఫిబ్రవరిలో ఎన్నికలు జరగడం ఖాయమని అంటున్నారు నేతలు. ఈ క్రమంలో బీఆర్ఎస్ అలర్ట్ అయ్యింది. పంచాయితీ ఎన్నికల్లో ఎన్నికైన సర్పంచ్‌లతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమానికి ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు.

Advertisement

ఖమ్మం జిల్లా పర్యటనకు ముందే బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. ముగ్గురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్‌లోకి జంప్ అయ్యారు. మొన్న ఐదుగురు మహిళా కార్పొరేటర్లు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తాజాగా బుధవారం మరో ముగ్గురు అధికార పార్టీ‌లో చేరేందుకు హైదరాబాద్ పయనమయయారు. ఖమ్మం నుంచి హైదరాబాద్‌కు బస్సులో ఆయా కార్పొరేటర్లు బయలు దేరినట్టు తెలుస్తోంది.

కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ కార్పొరేటర్ల జంప్

కొద్దిసేపట్లో వారంతా సీఎం రేవంత్‌‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్‌లను కలవనున్నారు. ఈ పరిణామంతో ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీ షాకైంది. ఉన్నట్లుండి పార్టీలో ఏం జరుగుతోందంటూ చర్చించుకోవడం మొదలైంది. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టూర్‌కు కొద్దిగంటల ముందు ఇలాంటి పరిణామం జరగడంతో కొందరు నేతలకు మింగుడు పడడం లేదు.

ఇప్పుడే ఈ విధంగా ఉంటే.. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ఆ తర్వాత పరిణామాలు ఇంకా ఎలా ఉంటాయోనని చర్చించుకుంటున్నారు ఆ పార్టీ నేతలు. ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నారు. వారిలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు.

ALSO READ: ఎమ్మార్వో ఆఫీసు ముందు ఓ వ్యక్తి నగ్న ప్రదర్శన, న్యాయం చేయాలంటూ డిమాండ్

ఈ ముగ్గురు నేతలు బలమైన సామాజికవర్గం నుంచి ఉన్నవారే. కేవలం కేటీఆర్ టూర్‌లో ఇలా జరిగితే, ఎన్నికల ఫలితాల తర్వాత నేతలు వలసపోవడం ఖాయమనే చర్చ లేకపోలేదు. వీటికి ఇప్పుడు అడ్డుకట్ట వేయాలని, లేకుంటే దీని పరిణామాలు దారుణంగా ఉంటాయని కొందరు నేతలు అప్పుడే గుసగుసలు పెట్టేసుకుంటున్నారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాపై ఏనాడూ బీఆర్ఎస్ ఆశలు పెట్టుకోలేదు. కేవలం అక్కడి నేతలను మాత్రమే నమ్ముకుని రాజకీయాలు కొనసాగిస్తోందని అంటున్నారు. ఈ లెక్కన కేడర్ వలస పోవడంలో పెద్దగా ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదని అనుకుంటున్నారు బీఆర్ఎస్ నేతలు. రానున్న రోజుల్లో ఇంకెన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి. 

Related News

హైదరాబాద్కు మంత్రి కొండా సురేఖ.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కీలక వ్యాఖ్యలు, ముగింపు ఎలా?

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

Big Stories

Advertisement
×