E-Paper
Advertisement

భారీగా తగ్గిన ‘Samsung Galaxy Z Fold 7’ ధర.. ఎక్స్ఛేంజ్ ఆఫర్ వాడితే ఇంకా తక్కువకే!

భారీగా తగ్గిన ‘Samsung Galaxy Z Fold 7’ ధర.. ఎక్స్ఛేంజ్ ఆఫర్ వాడితే ఇంకా తక్కువకే!

Galaxy Z Fold 7 Price Drop: సాధారణంగా ప్రీమియం ఫోల్డబుల్ ఫోన్లు మార్కెట్లోకి వచ్చిన వెంటనే వాటి ధరలు తగ్గడం అనేది చాలా అరుదుగా జరుగుతుంటాయి. కానీ శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7 విషయంలో మాత్రం ఫ్లిప్‌కార్ట్ అనూహ్యమైన ఆఫర్‌ను ప్రకటించింది. కేవలం ధర తగ్గించడమే కాకుండా.. బ్యాంకు ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌ల రూపంలో అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తోంది. దీంతో కొత్త టెక్నాలజీని ఇష్టపడే వారికి ఈ డీల్ ఇప్పుడు చాలా ఆకర్షణీయంగా మారింది. ఇప్పుడీ శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7 ఫోన్‌పై ఉన్న డిస్కౌంట్ వివరాలు, బ్యాంకు ఆఫర్ల గురించి తెలుసుకుందాం.

ఎలాంటి షరతుల్లేవు:

భారతదేశంలో శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7 విడుదలైనప్పుడు దీని ప్రారంభ ధర రూ.1,74,999గా ఉండేది. అయితే ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ ఎలాంటి కూపన్లు, ప్రత్యేక షరతులు లేకుండానే నేరుగా రూ.10,000 తగ్గింపును ఇస్తోంది. ప్రస్తుతం ఈ ఫోన్ రూ.1,64,999 వద్ద అందుబాటులో ఉంది. సాధారణంగా ప్రీమియం స్మార్ట్‌ఫోన్లకు మార్కెట్‌లో పోటీ పెరుగుతుండటం వల్ల కంపెనీలు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Also Read: వేసవిలో చల్లని కబురు.. టాప్ బ్రాండ్ రిఫ్రిజిరేటర్ల‌పై ఏకంగా 50% తగ్గింపు, ఎగబడి కొంటున్న జనం!

బ్యాంకు ఆఫర్లతో మరింత లాభం:

కేవలం ధర తగ్గడమే కాకుండా,.. చెల్లింపుల సమయంలో మరిన్ని ఆదా చేసుకునే అవకాశం ఉంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఈ మొబైల్‌ను కొనుగోలు చేస్తే అదనంగా రూ.4,000 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అప్పుడీ ఫోన్ ధర రూ.1,60,000 వద్ద లిస్ట్ అవుతుంది. అంతే కాదు.. ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా పాత ఫోన్లను మార్చుకోవాలనుకుంటే.. భారీగా ఆదా చేసుకోవచ్చు. పాత ఫోన్ కండిషన్ బాగుంటే రూ.10,000 నుండి రూ.30,000 వరకు అదనంగా ధర తగ్గే అవకాశం ఉంటుంది.

గెలాక్సీ Z ఫోల్డ్ 7 ప్రత్యేకతలివే:

ఈ శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7ను ప్రధానంగా ట్యాబ్లెట్ లాంటి పెద్ద స్క్రీన్‌ను ఇష్టపడే వారిని దృష్టిలో ఉంచుకుని రూపొందించబడింది. లోపల ఉండే పెద్ద డిస్‌ప్లే, రిఫ్రెష్ రేట్, శక్తివంతమైన పెర్ఫార్మెన్స్ ఈ ఫోన్‌కు ప్లస్ పాయింట్. ఇది చూడటానికి స్మార్ట్‌ఫోన్ మాదిరిగానే కాదు.. చేతిలో ఇమిడిపోయే ఒక మినీ కంప్యూటర్ లాంటిది. ప్రీమియం ఫీచర్లు కావాలనుకునే వారికి ఈ ధర తగ్గింపు సువర్ణావకాశం అనే చెప్పాలి.

కొనాలా, వద్దా?

ఏదైనా పండగ సీజన్‌ సేల్స్‌ వరకు వేచి చూస్తే ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉన్నప్పటికీ.. ఇప్పుడే ఫోన్ అప్‌గ్రేడ్ అవ్వాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. లాంచ్ ధరతో పోలిస్తే ఇప్పుడున్న ధర కొంచెం ఫర్వాలేదనిపిస్తుంది. టెక్నాలజీ పరంగా అప్డేటెడ్ ఫీచర్లతో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌పై ఇంత త్వరగా ధర తగ్గించడం అంటే.. నిజంగా విశేషమనే చెప్పాలి.

Also Read: రిమోట్ పనిచేయనప్పుడు ఒక్కటి ఇస్తాం చూశారా.. దాని వెనుకున్న అసలు గుట్టు ఇదే!

ముఖ్య గమనిక:

ఈ కథనంలో మీకు పరిచయం చేసిన ప్రొడక్ట్ లేదా దాని ధరలు.. ఆయా కంపెనీల ఆఫర్లపై ఆధారపడి ఉంటాయి. వాటిని కొనుగోలు చేసేప్పుడు ఒకటికి రెండుసార్లు తప్పకుండా సరిచూసుకోగలరు. మీరు కొనుగోలు చేసే సమయానికి ఈ కథనంలో పేర్కొన్న ధరలు మారిపోయి ఉండవచ్చు. కాబట్టి.. అలాంటి విషయాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు. ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే.

Related News

నథింగ్ నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ఇయర్‌బడ్స్.. ఫీచర్లు తెలిస్తే వెంటనే బుక్ చేసుకుంటారు!

పాత ఫోన్ అమ్ముతున్నారా? ఈ 4 పనులు చెయ్యకుండా అమ్మితే.. మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ!

కేవలం రూ.1000 లోపు ఖర్చుతో ఇంటిని సూపర్ కూల్‌గా మార్చే సీక్రెట్స్ ఇవే!

రంగంలోకి దిగిన గూగుల్.. ఫేక్ కాల్స్ భరతం పట్టడం ఖాయం, వినియోగదారులు ఫుల్‌ హ్యాపీ

ఇంట్లోనే జిమ్.. తక్కువ బడ్జెట్‌లో ఫిట్‌నెస్ ఎక్విప్‌మెంట్స్

స్మార్ట్ ఫ్రిజ్ కొంటే.. నిజంగా కరెంట్ బిల్లు తగ్గుతుందా? అసలు నిజాలు ఇవే!

రూ.30వేలలోపు బెస్ట్ విండో ఏసీలు.. వీటితో ఎండలకు బైబై చెప్పేయండి!

బడ్జెట్ రేంజ్‌లో.. హల్‌చల్ చేస్తున్న హైసెన్స్ 100 ఇంచుల టీవీ..

Big Stories

×