E-Paper
Advertisement

ప్రియురాల్ని ఇంటికి పిలిచి చంపిన విశాఖ నేవి ఉద్యోగి.. వెలుగులోకి సంచలన విషయాలు, షాకైన పోలీసులు

ప్రియురాల్ని ఇంటికి పిలిచి చంపిన విశాఖ నేవి ఉద్యోగి.. వెలుగులోకి సంచలన విషయాలు, షాకైన పోలీసులు
Advertisement

Vizag Mounika Murder Case: విశాఖ సిటీలో ప్రియురాలు మౌనిక హత్య కేసులో పోలీసుల దర్యాప్తు వేగవంతమైంది. ఈ కేసులో తీగలాగితే డొంక కదులుతోంది. అరెస్టయిన నిందితుడు కేవలం తన వెర్షన్ మాత్రమే చెప్పాడు. మౌనిక గురించి కొత్త కొత్త విషయాలు బయటకు వచ్చాయి. దీంతో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

విశాఖలో ప్రియురాల్ని చంపిన నేవీ ఉద్యోగి

Advertisement

విశాఖ సిటీ గాజువాకలో ప్రేయురాల్ని హత్య చేసిన నేవీ ఉద్యోగీ రవీంద్ర గురించి కీలక విషయాలు బయటకు వచ్చాయి. ఎల్వీనగర్‌లో కీర్తి అపార్టుమెంట్‌లో ఏడాదిగా అద్దెకు ఉంటున్నాడు నిందితుడు రవీంద్ర. నేవీలో టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు విజయనగరం జిల్లా రాజాంకు చెందినవాడు 35 ఏళ్ల రవీంద్ర. డెలివరీ కోసం నెల కొందట భార్య పుట్టింటికి వెళ్లింది. భార్య లేకపోవడంతో మౌనికను ఇంటికి పిలిచాడు.

సిటీలోని సాలిగ్రామ్ ప్రాంతానికి చెందినది మౌనిక. ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు అపార్టుమెంటుకి వచ్చింది మౌనిక. ఆమె వచ్చిన కాసేపటికే మౌనిక-రవీంద్ర మధ్య ఘర్షణ జరిగినట్టు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. మౌనిక శరీరాన్ని మూడు భాగాలుగా చేశాడు. రెండు భాగాలు ఫ్రిజ్‌లో ఉంచారు. తలభాగం విశాఖలోని దారపాలెంలో పడేశాడు.

Advertisement

కీలక విషయాలు వెలుగులోకి..  ప్రియురాల్ని తలను తగలబెట్టాడు

ఆదివారం రాత్రి మౌనిక తల, ఆమె ఫోన్ దారపాలెం తోటలో తగులబెట్టాడు. హత్య తర్వాత రక్తపు మరకలు కడిగేశాడు నిందితుడు. వాసన రాకుండా సెంటు కొట్టుకున్నాడు. ఆ తర్వాత స్నేహితుడికి ఫోన్ చేసి జరిగినదంతా చెప్పాడు రవీంద్ర. ఫ్రెండ్ హెచ్చరించడంతో గాజువాక పోలీసుల ముందు లొంగిపోయాడు. డబ్బుల కోసం మౌనిక తనను వేధించిందని, అది భరించలేక హత్య చేసినట్లు అంగీకరించాడు.

ఇప్పటివరకు తాను 3.5 లక్షలు ఇచ్చినట్టు వెల్లడించాడు. తన ఐడీ కార్డు తీసుకుని డబ్బులు గుంజడం మొదలుపెట్టిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆ ఫ్లాట్‌లో ఉన్న మరికొందరు కీలక విషయాలు తెలిపారు. రవీంద్ర ఫ్యామిలీలో అపార్టుమెంటులోకి దిగి ఏడాది అయ్యిందన్నారు. రవీంద్ర భార్య రెండునెలలు మాత్రమే ఉన్నారని ఆ తర్వాత డెలివరీకి వెళ్లారని వివరించారు.

ALSO READ: లవర్‌ని చంపి ముక్కలు చేసిన ప్రియుడు.. ఆ తర్వాత ఫ్రిజ్‌లో పెట్టి, విశాఖలో నేవీ ఉద్యోగి ఘాతుకం

గతంలో మౌనిక అనే యువతిని తాము ఎప్పుడూ చూడలేదని అంటున్నారు. ఆదివారం ఏ సమయంలో వచ్చిందో తమకు తెలీదన్నారు. పోలీసుల విచారణలో మౌనిక హత్యకు ముందు గాజువాకలో కత్తులు కొనుగోలు చేశాడు రవీంద్ర. సేకరించిన ఆధారాలు, నిందితుడు చెప్పిన వివరాలను పోల్చి చూస్తున్నారు పోలీసులు. అంతేకాదు వారి కాల్ డేటాపై కూడా ఫోకస్ చేశారు. రవీంద్ర ఎవరో తమకు తెలీదని మౌనిక తండ్రి చెబుతున్నాడు. ఇది ఎలా జరిగిందో తమకు తెలీదన్నారు. ఇలాంటి వాడ్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

 

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×