E-Paper
Advertisement

మీటర్ లో నెంబర్ జంప్ అవుతుందా? బంక్ లో ఫ్రాడ్ జరుగుతున్నట్టే!

మీటర్ లో నెంబర్ జంప్ అవుతుందా? బంక్ లో ఫ్రాడ్ జరుగుతున్నట్టే!
Advertisement

Fuel Fraud Awareness: పెట్రోల్ బంకుల్లో మోసాల గురించి తరచుగా వింటూనే ఉంటాం. పెట్రోల్ పోసే సమయంలో ఆపరేటర్లు రకరకాల జిమ్మిక్కులు చేస్తూ, వినియోగదారులను మోసం చేస్తున్న బోలెడు ఘటనలు వెలుగులోకి వచ్చాయి. తక్కువ ఇంధనం నింపి ఎక్కువ డబ్బులు తీసుకోవడం, కల్తీ పెట్రోల్ అమ్మడం లాంటివి కూడా చూశాం. అయితే, పెట్రోల్ కొట్టించుకునే సమయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే ఈ మోసాల నుంచి సులభంగా గుర్తించి తప్పించుకోవచ్చు.

పెట్రోల్ బంక్ లో మోసాలు ఎలా జరుగుతాయంటే?

బైక్ లో లేదంటే కారులో  పెట్రోల్ నింపే ముందు మీటర్  ‘జీరో’లో ఉందో లేదో తప్పనిసరిగా చెక్ చేయాలి. బంక్ లో చెక్ చేయాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం. చాలా సందర్భాల్లో బంక్ సిబ్బంది ముందుగా మీటర్‌ ను రీసెట్ చేయకుండా ఫ్యూయెల్ పోయడం మొదలుపెడతారు. ఇలా చేయడం వల్ల మీరు ఇచ్చే డబ్బులకు తగినంత ఇంధనం రాకపోవచ్చు. సో, ఎప్పుడూ జీరో చూసిన తర్వాతే ఫ్యూయల్ నింపించాలి. అవసరమైతే సిబ్బందిని రీసెట్ చేయమని అడగాలి.

డెన్సిటీని కచ్చితంగా గమనించాలి!

Advertisement

ఇంకో ముఖ్యమైన విషయం ఇంధన సాంద్రత. ప్రతి పెట్రోల్ బంక్‌ లో డెన్సిటీ వ్యాల్యూ డిస్ ప్లేలో కనిపిస్తాయి. ఇవి నిర్ణీత రేంజ్ లోనే ఉండాలి. పెట్రోల్ డెన్సిటీ 720 నుంచి 775 వరకు ఉంటుంది. డెన్సిటీ తక్కువగా ఉంటే, పెట్రోల్ నాణ్యతలో లోపం ఉన్నట్లు గుర్తించాలి. అలాగే, ఫ్యూయల్ ఫ్లో చాలా వేగంగా ఉన్నట్లు అనిపిస్తే కూడా అప్రమత్తంగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో మీటర్‌ ను మానిప్యులేట్ చేసి వేగంగా చూపిస్తూ తక్కువ ఇంధనం ఇస్తారు. అందుకే, పెట్రోల్ మీటర్ రిడింగ్ లో నెంబర్స్ వరుసగా వెళ్లాలి. జంప్ అవుతూ వెళ్తే, ట్యాంపర్ చేస్తున్నట్లు గుర్తించాలి.

చివరగా పెట్రోల్ నింపిన తర్వాత కూడా ఓసారి మీ వెహికల్ ట్యాంక్ ను గమనించాలి. సాధారణంగా మీరు ఎంత ఫ్యూయెల్ నింపుచుకున్నారు? ఇంచుమించు అంత ఉందా? లేదా? అని చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఏదైనా అనుమానం కలిగితే, వెంటనే బంక్ సిబ్బందిని ప్రశ్నంచాలి.

బంకులో మోసాలతో జాగ్రత్త

Advertisement

పెట్రోల్ బంకుల్లో మోసాల గురించి ముందుగానే ఓ అవగాహన కలిగి ఉండటం మంచిది. పెట్రోల్ బంకుల్లో సిబ్బంది చేసే జిమ్మిక్కులను తెలుసుకుంటే, వాటిని గుర్తించడం సులభమవుతుంది. సోషల్ మీడియా, వార్తల ద్వారా వచ్చిన సమాచారాన్ని గమనిస్తూ ఉండటం మంచిది. ఒకవేళ మీరు మోసాన్ని గుర్తిస్తే వెంటనే చర్యల కోసం పట్టుబట్టాలి. ప్రతి పెట్రోల్ బంక్‌లో కంప్లైంట్ బుక్ తప్పనిసరిగా ఉంటుంది. దానిని అడిగి మీ ఫిర్యాదును ఎంట్ చేయాలి. అవసరమైతే ఫోటోలు, వీడియోలు తీసి సాక్ష్యంగా ఉంచుకోవాలి. అదే సమయంలో ఆయిల్ కంపెనీల అధికారిక వెబ్‌ సైట్లలో కూడా కంప్లైంట్ చేసే అవకాశం ఉంటుంది. ఎప్పుడూ ఒకే బంక్ లో పెట్రోల్ కొట్టించుకోవడం మంచిది.

Read Also: E20 పెట్రోల్ తో పాత వాహనాలకు డేంజరా? అసలు నిజం ఏంటి?

Related News

సన్‌రూఫ్ +ADAS.. రూ.10 లక్షలకే హ్యుందాయ్ కొత్త SUV!

రూ.10 లక్షల లోపు కొత్త కార్లు.. త్వరలో రానున్న టాప్ మోడళ్లు ఇవే!

మహీంద్రా థార్ E To హ్యుందాయ్ ఇన్‌స్టర్.. నవంబర్ లో ఎంట్రీ ఇవ్వనున్నక్రేజీ ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

సింగిల్ ఛార్జ్ తో 250 కి.మీ రేంజ్.. నవంబర్‌ లో రానున్న 4 కొత్త ఎలక్ట్రిక్ టూ వీలర్లు ఇవే!

రాయల్ ఎన్‌ఫీల్డ్ To డుకాటి.. నవంబర్‌లో రాబోతున్న 9 కొత్త బైక్ లు ఇవే!

నింజా 300 ఆధారంగా కొత్త బైక్.. కవాసకి Z300 ప్రత్యేకతలు తెలిస్తే మతిపోవాల్సిందే!

హోండా To జావా.. 5 అదిరిపోయే పిలియన్ సీటు బైక్ లు ఇవే!

సింగిల్ ఛార్జ్ తో 650 కి.మీ రేంజ్.. 2026 ఎండింగ్ లో రానున్న కొత్త ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Big Stories

Advertisement
×