E-Paper
Advertisement

200MP కెమెరా, కేక పెట్టించే డిజైన్.. శాంసంగ్ సరికొత్త అల్ట్రా ఫోన్ ఫస్ట్ లుక్ చూశారా?

200MP కెమెరా, కేక పెట్టించే డిజైన్.. శాంసంగ్ సరికొత్త అల్ట్రా ఫోన్ ఫస్ట్ లుక్ చూశారా?
Advertisement

Galaxy Z Fold 8 Ultra: ప్రముఖ టెక్ దిగ్గజం శాంసంగ్ తమ తదుపరి తరం ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ Galaxy Z Fold 8 Ultraను వచ్చే నెలలో మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. అయితే లాంచ్‌కు ముందే ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌కు సంబంధించిన ఆసక్తికరమైన వివరాలు ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి. తాజాగా వెలువడిన కొన్ని ఫొటోలు, వీడియోలు ఈ ఫోన్ డిజైన్‌ను, అందులోని అఫీషియల్ వాల్‌పేపర్లను స్పష్టంగా చూపిస్తున్నాయి.

ఆకట్టుకుంటున్న కొత్త డిజైన్:

ప్రముఖ ఎక్స్ (ట్విట్టర్) యూజర్ ఫహద్ అలీ జావేద్ షేర్ చేసిన లీక్స్‌ ప్రకారం.. ఈ ఫోన్ ఫోల్డింగ్, అన్‌ఫోల్డింగ్ లుక్స్ చాలా ప్రీమియంగా ఉన్నాయి. ముఖ్యంగా స్క్రీన్‌పై కనిపించే సరికొత్త వాల్‌పేపర్లు యూజర్లను ఆకట్టుకుంటున్నాయి. వేవ్ (అలల) తరహా ప్యాటర్న్స్‌తో విభిన్న రంగుల్లో ఈ వాల్‌పేపర్లు డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. గత మోడల్ Galaxy Z Fold 7తో పోలిస్తే.. ఈ కొత్త ఆల్ట్రా మోడల్‌లో కవర్ డిస్‌ప్లే చుట్టూ బెజెల్స్ చాలా సన్నగా ఉండనున్నాయి.

Advertisement

Also Read: Oppo K15 స్పెసిఫికేషన్స్ లీక్.. అమోలెడ్ డిస్‌ప్లే, భారీ బ్యాటరీతో వచ్చేస్తోన్న క్రేజీ స్మార్ట్‌‌ఫోన్!

అదిరిపోయే డిస్‌ప్లే, కెమెరా ఫీచర్లు:

లీకైన సమాచారం ప్రకారం.. ఈ ఫోన్‌లో 6.5 ఇంచుల కవర్ స్క్రీన్, అలాగే 8.0 ఇంచుల మెయిన్ ఫోల్డబుల్ స్క్రీన్‌ను అందించనున్నారు. ఇవి రెండు కూడా 120Hz రీఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తాయి. ఇక కెమెరాల విషయానికొస్తే.. దీనిలో వెనుక వైపు ఏకంగా 200MP ప్రైమరీ కెమెరాతో పాటు 50MP అల్ట్రావైడ్, 10MP టెలిఫోటో కెమెరాలు ఉండే అవకాశం ఉంది. అలాగే సెల్ఫీల కోసం రెండు వైపులా 10MP కెమెరాలను అమర్చినట్లు సమాచారం.

పవర్‌ఫుల్ ప్రాసెసర్, బ్యాటరీ:

Advertisement

ఈ సూపర్ ఫోల్డబుల్ ఫోన్ సరికొత్త స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్‌తో పనిచేస్తుందని టాక్. ఫోన్ ఓపెన్ చేసినప్పుడు కేవలం 4.1 mm మందంతో చాలా స్లిమ్‌గా కనిపిస్తుంది. అలాగే దీనిలో 45W వైర్డ్ ఛార్జింగ్, 25W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన 5,000mAh బ్యాటరీని అందించనున్నట్లు తెలుస్తోంది.

లాంచ్ ఎప్పుడంటే?

ప్రస్తుతం ఈ ఫోన్ వివిధ నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు పొందుతోంది. దీనిని బట్టి చూస్తే లాంచ్ చాలా దగ్గర్లోనే ఉందని అర్థమవుతోంది. జులై 22న జరగబోయే గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో సాధారణ గెలాక్సీ Z ఫోల్డ్ 8తో పాటు ఈ అల్ట్రా మోడల్‌ను శాంసంగ్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

Also Read: షియోమీ షాకింగ్ నిర్ణయం.. ఒకేసారి Redmi K100, Xiaomi 18 సిరీస్ లాంచ్?!

Related News

ఇంటి పైకప్పుపై వాటర్ బాటిల్ ట్రిక్.. 30 దేశాల్లో సూపర్ సక్సెస్.. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే?

యాపిల్ నుంచి మొదటి ఫోల్డబుల్ ఫోన్ iPhone Duo.. ధర రూ.3 లక్షలా? ఫీచర్లు ఎలా ఉన్నాయంటే!

లాగ్ ప్రాబ్లం ఉండదు.. సూపర్‌ఫాస్ట్ రెస్పాన్స్ ఇచ్చే బెస్ట్ వైర్‌లెస్ కీబోర్డ్ కాంబోస్ ఇవే!

ఫోన్ మార్చాలనుకుంటున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో భారీగా ధర తగ్గిన Vivo V40e 5Gపై ఓ లుక్కేయండి!

బడ్జెట్ ధరలో సోనీ కొత్త హెడ్‌ఫోన్స్ లాంచ్.. బ్లూటూత్ 6.0, ఏఐ కాల్స్ ప్రత్యేకత!

నుదుటిపై ఈ డివైజ్‌ను పెట్టుకుంటే చాలు.. బ్రెయిన్ సీక్రెట్స్ అన్నీ బయటపడతాయట?!

ఏటీఎం కీప్యాడ్ ప్లాస్టిక్‌తో కాకుండా.. మెటల్‌‌ తోనే ఎందుకు? దీని వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటి?

రూ. 349 vs రూ. 379.. Airtel చౌకైన ప్లాన్ల మధ్య పోటీ.. బెనిఫిట్స్ పరంగా విజేత ఎవరంటే?

Big Stories

Advertisement
×