E-Paper
Advertisement

హోమ్ థియేటర్ రేంజ్ సౌండ్.. బ్లౌపంక్ట్ కొత్త వైర్‌లెస్ స్పీకర్ల స్పెషాలిటీ ఇదే!

హోమ్ థియేటర్ రేంజ్ సౌండ్.. బ్లౌపంక్ట్ కొత్త వైర్‌లెస్ స్పీకర్ల స్పెషాలిటీ ఇదే!
Advertisement

Best Bookshelf Speakers: తక్కువ బడ్జెట్‌లో మంచి స్పీకర్లు కావాలనుకుంటున్న మ్యూజిక్ ప్రియులకు గుడ్ న్యూస్. ఇండియన్ ఆడియో మార్కెట్లోకి బ్లౌపంక్ట్ సరికొత్త Twinz బుక్‌షెల్ఫ్ స్పీకర్లను లాంచ్ చేసింది. వైర్‌లెస్ పోర్టబిలిటీ, అద్భుతమైన స్టీరియో సౌండ్, ఆకట్టుకునే RGB లైటింగ్‌తో వచ్చిన ఈ స్పీకర్లు మ్యూజిక్ అంటే ఇష్టపడే వాళ్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

అదిరిపోయే స్టీరియో సౌండ్:

ఈ స్పీకర్లలో 2.0 స్టీరియో TWS టెక్నాలజీని ఉపయోగించారు. ఇది లెఫ్ట్, రైట్ ఆడియో ఛానెల్స్ ద్వారా వినసొంపైన సౌండ్‌ను అందిస్తుంది. దీని 30W ఆర్‌ఎమ్‌ఎస్ (15W + 15W) అవుట్‌పుట్ వల్ల పాటలు విన్నా, సినిమాలు చూసినా, గేమింగ్ ఆడినా క్లియర్ వాయిస్, పవర్‌ఫుల్ బేస్ లభిస్తుంది. ముఖ్యంగా గేమర్ల కోసం దీని సౌండ్‌ను ప్రత్యేకంగా ట్యూన్ చేశారు.

Advertisement

Also Read: రూ.5 వేల బడ్జెట్‌లో బెస్ట్ ఇయర్‌బడ్స్.. 54 గంటల బ్యాటరీతో OPPO Enco Air 5 Pro లాంచ్!

కంటికి నచ్చేలా లైటింగ్:

ఆడియోతో పాటు విజువల్స్ పరంగానూ ఇవి సూపర్ అనిపిస్తాయి. దీనిలో ఆరు రకాల నియాన్ ఆర్‌జీబీ లైటింగ్ మోడ్స్ ఉన్నాయి. మనం ఉండే రూమ్ వాతావరణానికి తగినట్టుగా ఈ లైటింగ్‌ను మార్చుకోవచ్చు. దీని మోడరన్ డిజైన్, లైటింగ్ కలిసి మన ఇల్లు లేదా గేమింగ్ సెటప్‌కు ఒక కొత్త లుక్‌ను తీసుకొస్తాయి.

పవర్‌ఫుల్ బ్యాటరీ లైఫ్:

Advertisement

బ్లౌపంక్ట్ ట్వింజ్ స్పీకర్లలో రెండు 2000mAh బ్యాటరీలను అందించారు. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు.. సుమారు 8 గంటల కంటే ఎక్కువ సమయం వైర్‌లెస్‌గా పాటలు వినవచ్చు. ఈ స్పీకర్లను విడివిడిగా సింగిల్‌గా వాడుకోవచ్చు లేదా ఒకేసారి జత చేసి పూర్తి స్టీరియో సిస్టమ్‌లా కూడా ఉపయోగించుకోవచ్చు.

అన్ని డివైజ్‌లకు కనెక్ట్ చేయొచ్చు:

ఈ స్పీకర్లను పీసీలు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లకు సులభంగా కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ సందర్భంగా బ్లౌపంక్ట్ ఆడియో ఇండియా సీఈఓ సుఖేష్ మదన్ మాట్లాడుతూ.. నేటి తరం వినియోగదారులు కోరుకునే పర్ఫార్మెన్స్, స్టైల్, సౌకర్యాల కలయికతోనే ఈ ట్వింజ్ స్పీకర్లను రూపొందించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఇవి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వేదికగా అందుబాటులో ఉన్నాయి.

Also Read: సమ్మర్ ఎఫెక్ట్.. అమెజాన్‌లో హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న AI స్మార్ట్ ఏసీలు ఇవే, హాఫ్ రేటుకే ఇచ్చేస్తున్నారు!

Related News

ఇదేందయ్యా ఇది.. ఈ ఫ్రిడ్జ్‌లో మనుషులు కూర్చోవచ్చా? జపానోళ్లది బుర్రే బుర్ర!

లండన్ వేదికగా Galaxy Unpacked 2026 ఈవెంట్.. ఈసారి ఏమేం రాబోతున్నాయంటే?

9,720mAh భారీ బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్.. షావోమీ కొత్త టాబ్లెట్ లీక్స్ రివీల్!

రూ.6 వేలకే ఇలాంటి హోమ్ థియేటరా.. భారత్‌లోకి పోర్ట్రానిక్స్ సరికొత్త సౌండ్ సిస్టమ్!

అమెజాన్‌లో ప్రత్యక్షమైన గూగుల్ సీక్రెట్ డివైజ్.. ఇండియా లాంచ్ డేట్ లీక్?

గూగుల్ కంటే ఏఐ సెర్చ్ వేగంగా పనిచేస్తుందా? ఏ సమయంలో ఏది వాడటం బెటర్?

Airtel యూజర్లకు గుడ్‌న్యూస్.. ఆ ప్రచారంలో నిజం లేదు.. క్లారిటీ ఇచ్చిన టెలికాం దిగ్గజం

కొత్త Air Purifier కొనేముందు తప్పక చూడాల్సిన 5 ముఖ్యమైన ఫీచర్లు ఇవే!

Big Stories

Advertisement
×