E-Paper
Advertisement

ఢిల్లీ విద్యార్థుల దాడి పై బీఆర్ఎస్ మౌనం.. వెలుగులోకి సంచలనాలు?

ఢిల్లీ విద్యార్థుల దాడి పై బీఆర్ఎస్ మౌనం.. వెలుగులోకి సంచలనాలు?
Advertisement

Balmuri Venkat: ఢిల్లీలో ధర్నా చేస్తున్న విద్యార్థులపై దాడిని ఇంత వరకు బీఆర్ఎస్ ఖండించలేదని బల్మూరి వెంకట్ తెలిపారు. కేటిఆర్ రేపు మహా ధర్నా చేస్తుండు అందుకు సిగ్గు ఉండాలని ఫైర్ అయ్యారు. CO-EMT సంస్థ అనేది తెలంగాణలో పుట్టిందని అన్నారు. CO-EMT సంస్థతో ఎంతో మంది విద్యార్థులు చనిపోయారని అన్నారు. CO-EMT సంస్థతో కేటిఆర్‌కు సంబంధం ఉందని బల్మూరి వెంకట్ అన్నారు. ఆ సంస్థ కట్టించిన పామ్ హౌస్‌లోనే కేటిఆర్ కూడా ఉంటున్నాడని అన్నారు.

2019 లో..

సంస్థ భూములు అన్నీ కేటిఆర్ దగ్గర ఉన్నవని, గ్లోబరినా సంస్థ 2019 లో ఇంటర్‌కు టెండర్లు పిలిచారని తెలిపారు. 2019 లో JNTU హైదరాబాద్, కాకినాడలో దానిపై కేసు అయిందని, గ్లోబరినా సంస్థకు అక్రమంగా కేటిఆర్ టెండర్లు అప్పజెప్పారని ఫైర్ అయ్యారు. 26మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న తర్వాత గ్లోబరినాను బ్లాక్ లిస్ట్‌లో పెట్టలేదని తెలిపారు.

Advertisement

Also Read: నీట్ పేపర్ లీక్ తీవ్ర దుమారం.. రంగంలోకి దిగిన సల్మాన్ ఖాన్, ప్రదీప్ రంగనాథన్!

క్షమాపణ చెప్పాలని డిమాండ్..

26మంది చావుకు కారణమైన కేటిఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలని బల్మూరి వెంకట్ డిమాండ్ చేశారు. CO-EMT కొత్త సంస్థను స్థాపించి CBSE ని తీసుకుందని, ఇప్పుడు విద్యార్థుల కోసం పోరాటం చేస్తా అంటే హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవ వేశారు. 10రోజుల క్రితం దుబాయ్‌లో ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది తో కలిసి పుట్టిన రోజు జరుపుకున్నారని అన్నారు. నీట్ పేపర్ లీక్‌లో కేటిఆర్ ప్రమేయం ఉందని, అందుకే BRS హయాంలోనే పేపర్ లీకేజ్‌లో రాష్ట్రం 4వ స్థానంలో ఉందని బల్మూరి వెంకట్ తెలిపారు.

Advertisement

Also Read: కేద్రంలో బీజేపీ పతనం మొదలైది.. మంత్రి ఉత్తమ్ సంచలన హెచ్చరిక!

Related News

స్పీకర్‌పై మాట్లాడిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాను: తాతా మధు!

జోగులాంబ గద్వాల్లో భూ బకాసురుల పంజా.. నకిలీ పట్టాలతో భూమి ఆక్రమణ!

ఈనెల 14 నుండి 25 వరకు తెలంగాణలో హై అలర్ట్!

దద్దరిల్లిన హన్మకొండ.. వేలాది మంది విద్యార్థులతో కవిత భారీ పాదయాత్ర!

ప్రతిపక్షాల గొంతు నొక్కే కుట్ర.. స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై కేటీఆర్ ఫైర్!

తెలంగాణ పోలీసులకు బిగ్ షాక్.. అసెంబ్లీ గొడవపై హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ!

కారులో మంటలు.. వ్యక్తి సజీవ దహనం, హత్య.. ఆత్యహత్య?

అసెంబ్లీలో మంత్రి సీతక్క భావోద్వేగ ప్రసంగం.. కన్నీళ్లు పెట్టుకున్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్!

Big Stories

Advertisement
×