E-Paper
Advertisement

అద్భుత ఆవిష్కరణ.. 97% ఎండను తిప్పికొట్టే ‘స్మార్ట్ పెయింట్’.. ఇక ఏసీ అవసరం లేనట్టే!

అద్భుత ఆవిష్కరణ.. 97% ఎండను తిప్పికొట్టే ‘స్మార్ట్ పెయింట్’.. ఇక ఏసీ అవసరం లేనట్టే!
Advertisement

Smart Paint: ఈ సారి వేసవి పుణ్యమా అని.. ప్రపంచవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. వేసవి వస్తే చాలు ఏసీలు, కూలర్లు వాడకం పెరిగిపోయి కరెంట్ బిల్లులు మోత మోగుతున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా సిడ్నీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ‘డ్యూపాయింట్ ఇన్నోవేషన్స్’ అనే స్టార్టప్‌తో కలిసి ఒక అద్భుతమైన ‘స్మార్ట్ పెయింట్’ను తయారు చేశారు. ఇది భవనాలపై పడే ఎండను తిప్పికొట్టి, ఇళ్లను సహజంగానే చల్లబరుస్తుంది.

సూర్య కిరణాలకు గుడ్ బై:

ఈ స్మార్ట్ పెయింట్ ప్రత్యేకత ఏమిటంటే.. ఇది తనపై పడే సూర్యరశ్మిని ఏకంగా 97 శాతానికి పైగా వెనక్కి పంపేస్తుంది. సాధారణ రంగులు ఎండను పీల్చుకుని ఇళ్లను వేడెక్కిస్తాయి. కానీ, ఈ పెయింట్‌లో ఉండే ప్రత్యేకమైన నానో టెక్నాలజీ (PVDF-HFP పాలిమర్) ఎండను అస్సలు లోపలికి రానివ్వదు. పగటిపూట కూడా ఇది భవనాల ఉష్ణోగ్రతను పెరగకుండా చూస్తుంది.

ఏసీల వాడకానికి బ్రేక్:

Advertisement

సాధారణ ఇళ్ల పైకప్పులతో పోలిస్తే.. ఈ పెయింట్ వేసిన Roofs దాదాపు 25 డిగ్రీల సెల్సియస్ తక్కువ వేడిని కలిగి ఉన్నట్లు ప్రయోగాల్లో తేలింది. అంతేకాదు.. చుట్టుపక్కల ఉండే గాలి కంటే కూడా ఇది 6 డిగ్రీలు చల్లగా ఉంటుంది. దీనివల్ల గదుల్లో ఉష్ణోగ్రత తగ్గి, ఏసీలు, ఫ్యాన్ల అవసరం చాలా వరకు తగ్గుతుంది. ఫలితంగా కరెంట్ బిల్లులు కూడా భారీగా ఆదా అవుతాయి.

Also Read: సౌండ్‌బార్ కొనాలో.. హోమ్ థియేటర్ కొనాలో అర్థం కావట్లేదా? ఈ ఒక్క సీక్రెట్ తెలిస్తే ఈజీగా డిసైడవుతారు!

గాలి నుండి తాగునీరు:

Advertisement

ఈ పెయింట్‌లో ఉన్న మరో అద్భుతమైన ఫీచర్.. గాలిలోని తేమను నీటి చుక్కలుగా మారుస్తుంది. దీనికోసం ఎలాంటి కరెంట్ అవసరం లేదు. ఉదయం పూట గడ్డిపై మంచు బిందువులు ఎలా ఏర్పడతాయో, అలాగే ఈ చల్లని ఉపరితలంపై నీరు చేరుతుంది. సిడ్నీలో చేసిన ఆరు నెలల ట్రయల్స్‌లో.. ఒక చదరపు మీటర్ విస్తీర్ణంలో రోజుకు దాదాపు 390 మిల్లీలీటర్ల నీటిని ఇది సేకరించగలిగింది.

మన దేశానికి ఎంతో మేలు:

పెరిగిపోతున్న ఎండలు, నీటి కొరతతో ఇబ్బంది పడే భారతదేశం లాంటి దేశాలకు ఈ సాంకేతికత ఒక వరం లాంటిది. ఇళ్లు, కమర్షియల్ బిల్డింగులు, గోదాములతో పాటు మారుమూల గ్రామాల్లో కూడా దీనిని ఉపయోగించవచ్చు. నగరాల్లో కాంక్రీట్ భవనాల వల్ల పెరిగే వేడిని (హీట్-ఐలాండ్ ఎఫెక్ట్) తగ్గించడానికి ఇది బాగా పనికొస్తుంది.

మార్కెట్లోకి ఎప్పుడు వస్తుంది?

ప్రస్తుతానికైతే ఈ పెయింట్ ఇంకా పరిశోధనల దశలోనే ఉంది. సాధారణ రోలర్లు లేదా స్ప్రేల ద్వారా గోడలకు సులువుగా వేసుకునేలా దీనిని కమర్షియల్ వెర్షన్‌గా మార్చేందుకు కంపెనీ ప్రయత్నిస్తోంది. అన్ని పరీక్షలు పూర్తయ్యాక ఇది త్వరలోనే మార్కెట్లోకి రానుంది. భవిష్యత్తులో పర్యావరణాన్ని కాపాడుకుంటూ, వేడి నుంచి తట్టుకోవడానికి ఈ స్మార్ట్ పెయింట్ ఎంతగానో ఉపయోగపడనుంది.

Also Read: GST రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయాలా? ఆఫీసుల చుట్టూ తిరగకుండా ఇంట్లోనే ఇలా చేసుకోండి!

Related News

స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు భూకంప హెచ్చరికల సాధనంగా.. గూగుల్ బిగ్ అప్‌డేట్!

యూట్యూబ్ ఛానెల్ పెడుతున్నారా? ఈ కంటెంట్‌తో వీడియోలు చేస్తే మీరే కింగ్.. కనక వర్షం కురవాల్సిందే!

యాపిల్ ప్రియులకు ఊహించని షాక్.. ఆన్‌లైన్ స్టోర్ బంద్, కారణం ఏమిటంటే?

యూట్యూబ్‌లో ఏఐ పాటలకు ప్రత్యేక లేబుల్స్.. అసలు ఇవి ఎలా పనిచేస్తాయంటే?

మెమరీ చిప్‌ల కొరత.. 14 ఏళ్ల కనిష్టానికి పడిపోయిన గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్!

iPhone 16 తక్కువ ధరకే వస్తోందని కొంటున్నారా? ఈ విషయం తెలిస్తే ప్లాన్ మార్చుకుంటారు!

యాపిల్ వాచ్ సిరీస్ 11పై ఊహించని డిస్కౌంట్.. అమెజాన్ పండుగ సేల్‌లో టాప్-5 డీల్స్ ఇవే!

శీతాకాలం అలర్ట్.. ఏసీ అవుట్ డోర్ యూనిట్‌కు కవర్.. కేవలం రూ.200తో రూ.20 వేల నష్టానికి చెక్!

Big Stories

Advertisement
×