E-Paper
Advertisement

ఐకేపీ కేంద్రాల్లో నిలిచిన ధాన్యం కొనుగోళ్లు.. అకాల వర్షంతో తడిసి మొలకెత్తుతున్న వరి కుప్పలు!

ఐకేపీ కేంద్రాల్లో నిలిచిన ధాన్యం కొనుగోళ్లు.. అకాల వర్షంతో తడిసి మొలకెత్తుతున్న వరి కుప్పలు!
Advertisement

Paddy Procurement: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఉద్దమర్రి గ్రామం పరిసర ప్రాంతాల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం మూడుచింతలపల్లి మండల పరిధిలో కురిసిన అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన ధాన్యం తడిసి బూజు, మొలకలు వచ్చి నష్టపోతున్నట్లు తెలిపారు.

దాదాపు 20 రోజులుగా ఐకేపీ కేంద్రాల్లో ధాన్యాన్ని కుప్పలుగా పోసి కొనుగోలు కోసం ఎదురుచూస్తున్నామని, వర్షం పడితే తడిసిన ధాన్యాన్ని మళ్లీ ఆరబెట్టడమే తమ పనిగా మారిందని రైతులు వాపోయారు. మరోవైపు పాఠశాలలు ప్రారంభమయ్యే సమయం దగ్గరపడుతున్నప్పటికీ పాఠశాల ఆవరణల్లో పోసిన ధాన్యం కుప్పలు అలాగే ఉండిపోయాయని పేర్కొన్నారు.

Advertisement

అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో ఒక్కో అధికారి ఒక్కో విధంగా సమాధానం చెబుతూ కాలయాపన చేస్తున్నారని రైతులు ఆరోపించారు. తడిసిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని, లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని రైతులు హెచ్చరించారు.

Also Read: కేటీఆర్‌పై వ్యాఖ్యలా? ఒళ్ళు దగ్గర పెట్టుకో కడియం.. డాక్టర్ రాజయ్య హెచ్చరిక

Related News

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

Big Stories

Advertisement
×