E-Paper
Advertisement

స్మార్ట్‌వాచ్‌తో షుగర్ టెస్ట్ సాధ్యమేనా? అసలు గుట్టు విప్పిన అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ!

స్మార్ట్‌వాచ్‌తో షుగర్ టెస్ట్ సాధ్యమేనా? అసలు గుట్టు విప్పిన అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ!
Advertisement

Blood Sugar Test: ప్రస్తుత టెక్ యుగంలో స్మార్ట్‌వాచ్ కేవలం సమయం చూసుకోవడానికే కాదు.. మన ఆరోగ్యాన్ని నిరంతరం కనిపెట్టుకుని ఉండే ఒక వైద్యుడిలా మారిపోయింది. గుండె వేగం, నిద్ర, రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు.. ఇలా ఎన్నో విషయాలను ఇవి ఇట్టే చెప్పేస్తున్నాయి. అయితే ఇప్పుడు కొత్తగా బ్లడ్ షుగర్ (రక్తంలో చక్కెర స్థాయి) ట్రాకింగ్‌ ఫీచర్‌ కూడిన స్మార్ట్‌వాచ్‌లు కూడా అందుబాటులోకి వచ్చాయి.

యాపిల్, శాంసంగ్ వంటి దిగ్గజ సంస్థలు దీనికోసం తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలోనే, మార్కెట్లో విక్రయిస్తున్న కొన్ని స్మార్ట్‌వాచ్‌ల బ్లడ్ షుగర్ రీడింగ్స్‌పై అమెరికా ఆరోగ్య నియంత్రణ సంస్థ (FDA) ఒక షాకింగ్ హెచ్చరిక జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మార్కెట్లో ఉన్న వాచ్‌లు నిజంగానే షుగర్ లెవల్స్‌ను కొలవగలవా? అసలు నిజాలేంటో ఇప్పుడు తెలుసుకుందామా..

ప్రస్తుత పరిస్థితి ఏంటి?

Advertisement

నిజానికి.. ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్న ఏ స్మార్ట్‌వాచ్ లేదా స్మార్ట్ రింగ్ కూడా నేరుగా రక్తంలోని చక్కెరను కొలవలేదు. ఇది వినడానికి కొంచెం నిరాశగా అనిపించినా ఇదే నిజం. ప్రస్తుతం షుగర్ లెవల్స్ తెలుసుకోవాలంటే మన చర్మం కింద ఒక చిన్న సెన్సార్ ఉండే సి.జి.ఎమ్ (CGM) పరికరాలను వాడాల్సిందే. ఈ పరికరాలు ఇచ్చే సమాచారాన్ని స్మార్ట్‌వాచ్‌లు కేవలం డిస్‌ప్లే చేస్తాయి తప్ప, సొంతంగా ఆ పనిని చేయలేవు.

అమెరికా ఆరోగ్య సంస్థల హెచ్చరిక:

స్మార్ట్‌వాచ్‌ల ద్వారా షుగర్ టెస్ట్ విషయంలో అమెరికాకు చెందిన ఎఫ్‌డీ‌ఏ (FDA) ఇప్పటికే వినియోగదారులను హెచ్చరించింది. ఎలాంటి సూది వాడకుండా, రక్తం తీయకుండా షుగర్ లెవల్స్ చెప్పేస్తామని క్లెయిమ్ చేసే వాచ్‌లను నమ్మవద్దని స్పష్టం చేసింది. ఎందుకంటే.. షుగర్ లెవల్స్ విషయంలో చిన్న తప్పు జరిగినా, అది ఇన్సులిన్ డోస్ లేదా మందుల వాడకంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే ప్రాణాలతో ముడిపడిన ఇలాంటి వైద్య పరీక్షల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

Advertisement

Also Read: తడిసిన ఫోన్‌ను బియ్యంలో పెడితే పాడవుతుందా? యాపిల్, శాంసంగ్ కంపెనీల షాకింగ్ హెచ్చరిక!

దిగ్గజ కంపెనీల ప్రయత్నాలు:

యాపిల్ వాచ్ ఈ విషయంలో అందరికంటే ముందు వరుసలో ఉంటుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు. యాపిల్ తమ వాచ్‌లలో ఈ టెక్నాలజీని తీసుకురావడానికి ఏళ్ల తరబడి కసరత్తు చేస్తోంది. మరోవైపు శాంసంగ్ కూడా గెలాక్సీ వాచ్ ద్వారా ఆరోగ్య ఫీచర్లను పెంచుకుంటూ పోతోంది. ఇప్పటికే శాంసంగ్ వాచ్‌లలో బీపీ చూసుకునే సౌకర్యం ఉన్నా.. అది కూడా అప్పుడప్పుడు సాధారణ మెషిన్లతో చెక్ చేసుకుంటేనే ఖచ్చితత్వం ఉంటుంది. ఈ కంపెనీలన్నీ భవిష్యత్తులో సూది అవసరం లేని సెన్సార్ల కోసం ప్రయత్నిస్తున్న మాట వాస్తవమే కానీ, అది ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు.

అథ్లెట్లు , హెల్త్ ఫ్రీక్స్ కోసం:

గార్మిన్, అవూరా (Oura) వంటి బ్రాండ్లు కూడా ఈ రేసులో ఉన్నాయి. ముఖ్యంగా క్రీడాకారులు తమ శరీర పనితీరును తెలుసుకోవడానికి వీటిని వాడుతుంటారు. ఇవి నేరుగా షుగర్ లెవల్స్ చెప్పకపోయినా, వేరే కంపెనీల సెన్సార్లతో అనుసంధానమై డేటాను చూపిస్తాయి. మనం తిన్న ఆహారం, చేసిన వ్యాయామం వల్ల మన రక్తంలో షుగర్ ఎలా మారుతుందో అర్థం చేసుకోవడానికి ఇవి ఒక మంచి ‘డేటా డిస్‌ప్లే’ లాగా ఉపయోగపడతాయి.

సాంకేతిక సవాలు ఎక్కడ ఉందంటే?

స్మార్ట్‌వాచ్ ద్వారా షుగర్ లెవల్స్ కొలవడం ఎందుకు కష్టం అంటే.. గుండె వేగం లేదా ఆక్సిజన్ లాగా ఇది పైపైన కనిపించే విషయం కాదు. రక్తంలోని కెమిస్ట్రీని కేవలం కాంతి కిరణాల ద్వారా ఖచ్చితంగా పసిగట్టడం ఒక పెద్ద సవాలు. ప్రస్తుతం పరిశోధకులు చెమట ద్వారా లేదా చర్మం పైపొరల సిగ్నల్స్ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సాంకేతికత పూర్తిస్థాయిలో మెరుగయ్యే వరకు స్మార్ట్‌వాచ్‌లు కేవలం మన షుగర్ మానిటర్లకు రిమోట్ లాగా మాత్రమే పనిచేస్తాయి. కాబట్టి.. ప్రస్తుతానికి షుగర్ పేషెంట్లు డాక్టర్లు సూచించిన పద్ధతులనే అనుసరించడం మేలు.

Also Read: రోజుకు కేవలం 5 రూపాయలే.. Airtel కస్టమర్లకు పండగే.. ఏడాది మొత్తం అన్‌లిమిటెడ్ కాల్స్!

Related News

వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు బిగ్ షాక్.. భారత్‌లో OxygenOS శకం ముగిసినట్లేనా?

బెడ్‌టైమ్ స్టోరీస్ కోసం మెటా కొత్త ప్రయత్నం.. ఈ StoryKit యాప్ ఎలా పనిచేస్తుందంటే?

బడ్జెట్ ధరలో బెస్ట్ ప్లాన్.. Vi రూ.479 రీఛార్జ్‌తో లభించే బెనిఫిట్స్ ఇవే!

వర్షాకాలంలో ACలో ఉన్న ఈ ఒక్క బటన్ ప్రెస్ చేస్తే.. ఉక్కపోత మాయం, కరెంట్ బిల్లు సగం!

ఆన్‌లైన్‌లో మీ డేటా సేఫ్ ఉండాలంటే.. ఈ 5 గోల్డెన్ రూల్స్ ఫాలో అవ్వండి!

ఓరి నాయనో.. నిజమా? కలా? Samsung Z Fold 7పై ఏకంగా రూ.75,000 దాకా తగ్గింపు!

టీవీ కొనాలనుకుంటున్నారా? Mini LED లేదా OLED.. ఏది బెస్ట్ ఆప్షన్?

మెటా యాప్స్‌లో మన డేటాను AI వాడకుండా ఎలా ఆపాలో తెలుసా?

Big Stories

Advertisement
×