E-Paper
Advertisement

K P Vivekanand: రాజకీయ భిక్ష పెట్టిన కేసీఆర్‌ను మోసం చేస్తారా?.. కడియంపై వివేకానంద ధ్వజం

K P Vivekanand: రాజకీయ భిక్ష పెట్టిన కేసీఆర్‌ను మోసం చేస్తారా?.. కడియంపై వివేకానంద ధ్వజం
Advertisement

K P Vivekanand: కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఇటీవల చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా బిఆర్ఎస్ (BRS) నుండి కాంగ్రెస్‌లోకి వెళ్లిన కడియం శ్రీహరి లక్ష్యంగా ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు.

కేపీ వివేకానంద మాట్లాడుతూ.. కడియం శ్రీహరి రాజకీయ ప్రస్థానం కేసీఆర్ పెట్టిన రాజకీయ భిక్ష అని పేర్కొన్నారు. కేసీఆర్ కాళ్లు పట్టుకుని ఎంపీగా.. ఆపై ఉప ముఖ్యమంత్రిగా పదవులు అనుభవించిన కడియం.. ఇప్పుడు స్వార్థం కోసం కాంగ్రెస్‌లో చేరడం సిగ్గుచేటని విమర్శించారు. తన కూతురికి ఎంపీ టికెట్ ఇప్పించుకోవడమే పరమావధిగా కడియం వ్యవహరిస్తున్నారన.. నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న ఆయన తీరు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ‘రేవంత్ రెడ్డిని నమ్ముకోవడం అంటే కుక్క తోక పట్టుకుని గోదారి ఈదడమే’ అని కడియం శ్రీహరికి చురకలు అంటించారు.

Advertisement

పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేల పరిస్థితి ప్రస్తుతం అయోమయంగా ఉందని.. వారంతా అనర్హతకు గురికావడం ఖాయమని వివేకానంద జోస్యం చెప్పారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామని.. కోర్టుల ద్వారా వారికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. స్పీకర్ నిర్ణయం కోసం తాము వేచి చూస్తున్నామని.. తీర్పు కాపీలు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి న్యాయస్థానాలను సైతం మోసం చేస్తున్నారని ఆయన విమర్శించారు.

తెలంగాణ అంటేనే కేసీఆర్ అని.. ఆయనే తెలంగాణ జాతి పిత అని వివేకానంద కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం దౌర్జన్యంగా స్థానిక ఎన్నికల్లో గెలుస్తున్నా.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ గాలికి కొట్టుకుపోవడం ఖాయమన్నారు. దేశంలో రాహుల్ గాంధీని, రాష్ట్రంలో రేవంత్ రెడ్డిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని.. కారు గుర్తుపై గెలిచిన వారు దమ్ముంటే రాజీనామా చేసి మళ్ళీ గెలవాలని సవాల్ విసిరారు.

Advertisement

Also  Read: ఖర్గే నివాసంలో కాంగ్రెస్ హైకమాండ్ కీలక భేటీ.. రెండేళ్ల పాలనపై రాహుల్, ఖర్గే సమీక్ష!

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×