Sony Wireless Headphones: సోనీ మళ్లీ తమ మ్యూజిక్ లవర్స్‌ను ఖుషి చేయడానికి సరికొత్తగా మూడు వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈసారి బడ్జెట్ నుంచి ప్రీమియం రేంజ్ వరకు అన్ని రకాల వినియోగదారులను టార్గెట్ చేస్తూ ప్రైసింగ్ పెట్టారు. ముఖ్యంగా లాంగ్ బ్యాటరీ లైఫ్, బ్లూటూత్ 6.0 కనెక్టివిటీ, ఏఐ కాల్ ఫీచర్లతో ఇవి వస్తుండటంతో మార్కెట్లో మంచి అంచనాలు ఉన్నాయి. Hello Kitty కలెక్షన్‌తో కూడిన స్పెషల్ బండిల్స్ కూడా ఉండటం విశేషం.
ఈ జాబితాలో టాప్‌లో ఉన్న ఈ మోడల్ సౌండ్ క్వాలిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. దీని ధర రూ.28,105 వరకు ఉంటుంది. 40mm డ్రైవర్లు, 10 బ్యాండ్ ఈక్వలైజర్, పర్సనల్ నాయిస్ క్యాన్సలేషన్ ఆప్టిమైజర్ దీనిలో ప్రత్యేకతలు. ఎన్సీ ఆన్ చేస్తే 27 గంటలు, ఆఫ్ చేస్తే 34 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది. బ్లాక్, లావెండర్, ప్లాటినం సిల్వర్ రంగుల్లో లభిస్తుంది.
Also Read: నుదుటిపై ఈ డివైజ్‌ను పెట్టుకుంటే చాలు.. బ్రెయిన్ సీక్రెట్స్ అన్నీ బయటపడతాయట?!
ఎక్కువ ధర పెట్టలేక, అలా అని సాధారణమైనవి కాకుండా బ్యాలెన్స్‌డ్ ఫీచర్లు కోరుకునే వారి కోసం ఇది పర్ఫెక్ట్. దీని ధర రూ.12,900 ఉంటుంది. దీనిలో ప్రెసిడెంట్ వాయిస్ పిక్ అప్ టెక్నాలజీతో ఏఐ కాల్ నాయిస్ రిడక్షన్ ఇచ్చారు. ముఖ్యంగా నాయిస్ క్యాన్సలేషన్ ఆన్ చేస్తే 50 గంటలు, ఆఫ్ చేస్తే ఏకంగా 75 గంటల వరకు బ్యాటరీ లైఫ్ వస్తుంది. మూడు నిమిషాల చార్జింగ్‌తో గంట పాటు వాడొచ్చు.
చాలా తక్కువ ధరలో మంచి ఫీచర్లు కావాలనుకునే వారి కోసమే ఈ ఎంట్రీ లెవల్ హెడ్‌ఫోన్. దీని ధర రూ.6,400 మాత్రమే. తక్కువ ధర అయినప్పటికీ.. ఇందులో మల్టీపాయింట్ కనెక్టివిటీ, ఏఐ నాయిస్ రిడక్షన్, వాయిస్ అసిస్టెంట్ ఉన్నాయి. ఇక బ్యాటరీ విషయానికి వస్తే.. ఇది ఏకంగా 55 గంటల పాటు నాన్‌స్టాప్ ప్లేబ్యాక్ ఇస్తుంది. మూడు నిమిషాలు ఛార్జ్ చేస్తే గంటన్నర పాటు పాటలు వినవచ్చు.
ఈ మూడు హెడ్‌ఫోన్స్‌లోనూ లేటెస్ట్ బ్లూటూత్ 6.0 టెక్నాలజీని అందించడం సోనీ చేసిన పెద్ద అప్‌డేట్. ప్రస్తుతం ఇవి యూకే మార్కెట్లో సెప్టెంబర్ 10 నుంచి అందుబాటులోకి వస్తున్నాయి. వీటితో పాటు హలో కిట్టి స్పెషల్ ఎడిషన్ టోట్ బ్యాగ్, క్యారీయింగ్ పౌచ్‌లు కూడా వస్తుండటంతో యువతను ఇవి విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. త్వరలోనే మన దేశంలో కూడా ఇవి లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
Also Read: మీ ఐఫోన్ స్పీడ్ పెంచే సూపర్ అప్‌డేట్ వచ్చేస్తోంది.. ఈ డేట్ గుర్తుపెట్టుకోండి!