E-Paper
Advertisement

టీమిండియాకు ప్లాట్ పిచ్ లు..పాకిస్తాన్ కు క‌ఠిన‌మైన పిచ్ లా ? ఇంగ్లండ్ పై ఫైర్‌

టీమిండియాకు ప్లాట్ పిచ్ లు..పాకిస్తాన్ కు క‌ఠిన‌మైన పిచ్ లా ? ఇంగ్లండ్ పై ఫైర్‌
Advertisement

Mohammad Wasim On ENG VS PAK:  ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. మూడు టెస్టుల నేపథ్యంలో ఇప్పటికే రెండు మ్యాచ్ లు ఫినిష్ అయ్యాయి. ఇందులో పాకిస్తాన్ రెండింటిలో ఓడిపోయి.. టెస్ట్ సిరీస్ కోల్పోయింది. వైట్ వాష్ అయ్యే ప్రమాదాన్ని కొని తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ టెస్ట్ క్రికెట్ జట్టు పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. కనీసం పోటీ కూడా ఇవ్వలేదని ఒక్కో ప్లేయర్ ను సోషల్ మీడియాలో ఆడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ ఆటగాడు మహమ్మద్ వ‌సీం (Mohammad Wasim) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ క్రికెట్ జట్టును నాశనం చేసేందుకు ఇంగ్లాండ్ కుట్రలకు తెరలేపిందని.. బాంబు పేల్చారు. టీమిండియా పర్యటించినప్పుడు ఫ్లాట్ మైదానాలు తయారు చేసిన ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు.. పాకిస్తాన్ కు మాత్రం కఠినమైన పిచ్ లు ఇచ్చిందని ఆరోపణలు చేశారు. అందుకే పాకిస్తాన్ అత్యంత దారుణమైన ఓటమిని చవి చూసినట్లు ఈ మాజీ చీఫ్ సెలెక్టర్ మహమ్మద్ వసీం షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఇంగ్లండ్, జై షా క‌లిసి కుట్ర‌లు చేశారు..పాకిస్తాన్ క్రికెట్ ను ముంచేశారు

ఇంగ్లాండ్ గడ్డపై రెండు టెస్టులు ఓడిపోయిన పాకిస్తాన్ క్రికెట్ జట్టును ఉద్దేశించి మాజీ ఆటగాడు మహమ్మద్ వసీం కీలక వ్యాఖ్యలు చేశారు. వెస్టిండీస్ గడ్డపై అద్భుతంగా రాణించిన పాకిస్తాన్ క్రికెట్ జట్టును.. ఇంగ్లాండ్ దెబ్బ తీసిందని ఫైర్ అయ్యారు. టీమిండియాకు ఫ్లాట్ మైదానాలు ఇచ్చి… పాకిస్తాన్ కు మాత్రం కఠినమైన పిచ్ లు ఇచ్చి కొంపముంచిందని సీరియస్ అయ్యారు. దీని వల్ల పాకిస్తాన్ క్రికెటర్లు కకావికలం అయ్యారని వ్యాఖ్యానించారు. ఒక్కరు కూడా సరిగ్గా రాణించలేదని వివరించారు. ఐసీసీ బాస్ జై షా కుట్రల కారణంగానే పాకిస్తాన్ అత్యంత దారుణంగా ఓడిపోయిందని వ్యాఖ్యానించారు.

Advertisement

PCB confiscate mobile phones of Pakistan cricketers : పాకిస్తాన్ జ‌ట్టులో పెను ప్ర‌కంప‌న‌లు…ప్లేయ‌ర్ల మొబైల్ ఫోన్లను లాగేసుకున్న PCB

ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుతో కలిసి జై షా పాకిస్తాన్ క్రికెట్ ను దెబ్బతీశారని మండిపడ్డారు. పాకిస్తాన్ టెస్ట్ హోదాను రద్దు చేసేలా మైదానాలు ఉండాలని జై షా దిశా నిర్దేశం చేశాడని మహమ్మద్ వసీం షాకింగ్ ఆరోపణలు చేశారు. దీంతో దానికి తగ్గట్టుగానే ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కూడా కఠినమైన పిచ్ లు సిద్ధం చేసిందని ఫైర్ అయ్యారు. రేపటి నుంచి జరిగే మూడో టెస్టులో కూడా ఇదే పరిస్థితి ఉంటుందని… పాకిస్తాన్ వైట్ వాష్ కావడం గ్యారెంటీ అన్నారు. ఇన్ని కుట్రలు కుతంత్రాలు మధ్య పాకిస్తాన్ గెలవడం కష్టమేనని బాంబు పేల్చారు మహమ్మద్ వసీం. ఇది ఇలా ఉండ‌గా, పాకిస్తాన్ వ‌ర్సెస్ ఇంగ్లండ్ మ‌ధ్య రేప‌టి నుంచే మూడో టెస్ట్ జ‌రుగ‌నుంది. ఈ మ్యాచ్ ఎడ్జ్ బ‌స్ట‌న్ వేదిక‌గా జరుగ‌నుంది.

Advertisement

Tanveer Ahmed On IND VS PAK: అదరగొట్టిన ఇండియా, పాకిస్తాన్ మరో ఘోర ఓటమి…ఫిక్సింగ్ చేశారంటూ త‌న్వీర్ ఆరోప‌ణ‌లు

 

 

 

 

 

Related News

న‌న్ను కొనేందుకు ఫిక్స‌ర్ వ‌స్తే..హోట‌ల్ రూంలోనే చిత‌క‌బాదాను

పాకిస్తాన్ ప్లేయ‌ర్ కు బూట్లు అమ్ముకుంటోన్న విరాట్ కోహ్లీ?

షోయ‌బ్ అక్త‌ర్ ను ధోని స్లెడ్జింగ్ చేసి, పాకిస్తాన్ కొంప‌ముంచాడు

మొహ్సిన్ న‌ఖ్వీ నోట్లో మ‌ట్టి కొట్టిన బీసీసీఐ…ఆసియా క‌ప్ ఫైన‌ల్స్ కు జై షా !

2017లో విరాట్ కోహ్లీని చూసి ప్యాంట్ త‌డుపుకున్నా..అమీర్ సంచ‌ల‌నం !

ఒరేయ్ వాహాబ్ రియాజ్…మాకు ఆసియా క‌ప్ వ‌ద్దు రా, ద‌మ్ముంటే టీమిండియాను ఓడించండి

నేను రాజ‌కీయాల్లోకి వ‌స్తే, ఇమ్రాన్ ఖాన్ లాగా కుక్క చావు చ‌చ్చేవాడిని

Big Stories

Advertisement
×