E-Paper
Advertisement

సీనియర్ ఎన్టీఆర్, చిరంజీవిపై పోస్టులా.. జనసైనికులకు పవన్ కళ్యాణ్ వార్నింగ్!

సీనియర్ ఎన్టీఆర్, చిరంజీవిపై పోస్టులా.. జనసైనికులకు పవన్ కళ్యాణ్ వార్నింగ్!
Advertisement

TDP Jana Sena: టీడీపీ పేరుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ని వారి కుటుంబ సభ్యులను, జనసైనికులను దూషిస్తూ, అనుచిత, అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నవారిని వారి కుటుంబ సభ్యులపై, టీడీపీ సానుభూతిపరులపై అనుచిత, అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నారని అలాగే వైసీపీ చేస్తున్న తప్పుడు వార్తలను, ప్రభుత్వ విధానాలపై, ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతినేలా పోస్టులు చేస్తున్న ఇరు పార్టీల కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. మీలో కొంతమంది వారి వారి వ్యక్తిగత కోపాలు, ఆవేశంతో సోషల్ మీడియాలో పోస్టులు వేస్తూ, పార్టీ ఆదేశాలు, పాటించకుండా కూటమి స్ఫూర్తిని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి అలాంటి పరిస్థితులకు అవకాశం ఇచ్చి, వైసీపీ కి అవకాశం ఇచ్చే పరిస్థితులు ఇవ్వకండి. ప్రభుత్వ పాలసీలు, అభివృద్ధి కార్యక్రమాలు, పరిపాలనపై సోషల్ మీడియాలో మీరు చేసే పోస్టులు ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్లే ప్రమాదం ఉందని అన్నారు.

కలిసి పనిచేయండి..

ప్రతీ రోజు ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పరం విమర్శలు, దూషణలకు దిగకుండా ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పనిచేయండి. ప్రస్తుతం మనం ఒక ఉమ్మడి కూటమిగా స్థానిక సంస్థల ఎన్నికల కోసం కలిసి పనిచేయాల్సిన సమయంలో ఉన్నామని, ఈ సమయంలో మన మధ్య మనమే పోరాడటం కాకుండా, మన ఉమ్మడి రాజకీయ ప్రత్యర్థి అయిన వైఎస్సార్‌సీపీపై పోరాడటంపైనే దృష్టి పెట్టాలన్నారు. కూటమి ఐక్యతను, పరస్పర గౌరవాన్ని కాపాడుకోవడం ప్రతి కార్యకర్త బాధ్యతని అన్నారు.

Advertisement

Also read: త్రిషకు అండగా కంగనా.. ఉదయ్ నిధి స్టాలిన్ కు గట్టి కౌంటర్!

సీనియర్ NTRని..

చిరంజీవిని కొంతమంది టీడీపీ కార్యకర్తలు తిట్టడం, దానికి ప్రతిగా సీనియర్ NTRని కొంతమంది జనసైనిక్స్ ట్రోల్ చేయడం, దానికి తోడుగా ఇరు పార్టీల నాయకులు ప్రాతినిధ్యం వహించే శాఖల్లో అవగాహన లేకుండా లోపాలు ఎంచి బురద చల్లడం మంచి పద్ధతి కాదని అన్నారు దయచేసి ఈ విషయంలో జనసేన సోషల్ మీడియా జనసైనికులు అందరూ పార్టీ నిర్ణయాన్ని గౌరవించి సోషల్ మీడియాలో అనవసర వ్యాఖ్యలు చేయవద్దని కోరుతున్నాను. ఏదైనా ఉంటే మీరు పార్టీ దృష్టికి, లేదా పార్టీ సోషల్ మీడియా విభాగంలో ఎవరో ఒకరి దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. జనసేన సోషల్ మీడియా జనసైనికుల నుండి ఇప్పటి వరకు వచ్చిన కొన్ని అంశాలు పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని పవన్ కళ్యాణ్ అన్నారు.

కూటమి ప్రభుత్వం..

Advertisement

అదేవిధంగా, జనసేన పార్టీ సానుభూతిపరులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఆయన కుటుంబ సభ్యులపై అవమానకరమైన, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన టీడీపీ కార్యకర్తలతో ఆ పార్టీ నాయకత్వం చర్చించి, తగిన విధంగా వ్యవహరించనున్నట్లు తెలియజేసింది. ఈ అంశాన్ని ఇరు పార్టీలు పరిష్కరించేలా కృషి చేస్తాయి. జనసేన పార్టీ, జనసైనికుల ఆత్మగౌరవం భంగం కలిగించే ఎటువంటి చర్యలనూ సహించదు. అదే సమయంలో, కూటమి ఐక్యతను కాపాడుకోవడం, పరస్పర గౌరవాన్ని పాటించడం, పార్టీ ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించడం ద్వారా మాత్రమే మనం త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించగలం అని గుర్తుంచుకోండని అన్నారు.

Also read: తెలంగాణ శాసన మండలిలో షాకింగ్ న్యూస్.. ఎమ్మెల్సీ తాతా మధు, నవీన్ కుమార్‌పై సస్పెన్షన్ వేటు!

Tags

Related News

ఏపీకి భారీ వర్ష గండం.. 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

ఆంధ్రప్రదేశ్ హస్తకళాకారులకు పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్!

మెగా డీఎస్సీ కాదు.. అది దగా డీఎస్సీ.. కూటమి ప్రభుత్వంపై బొత్స ఫైర్!

మెగాస్టార్ చిరంజీవి ఇంటికి మ‌రో ప‌ద‌వి.. ఈసారి కూతురు సుస్మిత‌ వంతు, దుర్గగుడి బోర్డులో ప్రత్యేక పదవి

పార్టీ కేడర్‌కు టీడీపీ-జనసేన పార్టీలు వార్నింగ్.. రిపీట్ చేస్తే ఊరుకునేది లేదు

DSC జూడో సర్టిఫికెట్ల వివాదంపై.. క్లారిటీ ఇచ్చిన ఎండీ భరణి!

కొత్త పార్టీపై క్లారిటీ, నేను సీఎం అభ్యర్థిని కాను-విజయసాయిరెడ్డి

Big Stories

Advertisement
×