E-Paper
Advertisement

Eating Disorders: రోజూ అదే పనిగా ఫోన్ చూస్తున్నారా? టీనేజర్లకు మూడినట్లే.. ఇక పైవాడే కాపాడాలి!

Eating Disorders: రోజూ అదే పనిగా ఫోన్ చూస్తున్నారా? టీనేజర్లకు మూడినట్లే.. ఇక పైవాడే కాపాడాలి!
Advertisement

Eating Disorders: నేటి యువత తీరు ఎలా ఉందంటే.. చుట్టూ ఉన్న మనుషులతో సంబంధం లేకుండా ఎంతసేపూ స్మార్ట్‌ఫోన్‌లో లీనమైపోతున్నారు. అసలు చేతిలో ఫోన్ లేనిదే క్షణం కూడా గడవదు అన్నట్టుగా ఉంటుంన్నారు. ముఖ్యంగా టీనేజ్ పిల్లలు అయితే ఫోనే తమ ప్రపంచంగా భావిస్తున్నారు. అయితే, గంటల తరబడి స్క్రీన్ వైపు చూస్తూ గడపడం కేవలం నిద్రను, ఏకాగ్రతను మాత్రమే కాదు.. వారి శరీర ఆకృతిపై వారికి ఉండే అభిప్రాయాన్ని, ఆహారపు అలవాట్లను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తోందని తాజా పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. కింగ్స్ కాలేజ్ లండన్ నిర్వహించిన ఒక అధ్యయనంలో స్మార్ట్‌ఫోన్ వాడకానికి, ఈటింగ్ డిజార్డర్స్‌కు మధ్య ఉన్న బలమైన సంబంధం వెల్లడైంది.

పరిశోధన ఏం చెబుతోంది?

సుమారు 52,000 మందిపై జరిపిన 35 అధ్యయనాలను విశ్లేషించిన నిపుణులు ఒక ఆసక్తికరమైన విషయాన్ని గమనించారు. స్మార్ట్‌ఫోన్ వాడకం పెరిగేకొద్దీ, యువతలో అతిగా తినడం లేదా ఆహారానికి బానిస అవ్వడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. కేవలం మానసిక అనారోగ్యం ఉన్నవారే కాకుండా, సాధారణ వ్యక్తుల్లో కూడా ఈ మార్పులు వస్తుండటం గమనార్హం. ముఖ్యంగా రోజుకు ఏడు గంటల కంటే ఎక్కువ సమయం ఫోన్ చూసేవారిలో ఈ సమస్యలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి.

Advertisement

Also Read: ఒంటరిగా ఉంటున్నారా? అయితే జాగ్రత్త.. మీకు షుగర్ వచ్చే ఛాన్స్ 50% ఎక్కువట!

ఆత్మవిశ్వాసంపై దెబ్బ:

టీనేజ్ అనేది శారీరకంగా, మానసికగా ఎదిగే కీలకమైన దశ. ఈ సమయంలో సోషల్ మీడియాలో నిరంతరం కనిపించే పర్ఫెక్ట్ బాడీ ఇమేజ్‌లు, ఫిల్టర్ చేసిన ఫొటోలు పిల్లల్లో అభద్రతా భావాన్ని పెంచుతున్నాయి. ఇతరులతో తమను తాము పోల్చుకోవడం వల్ల తమ శరీరం సరిగ్గా లేదనే అసంతృప్తి మొదలవుతుంది. ఈ ఒత్తిడి నుండి బయట పడటానికి కొందరు ఆహారం పట్ల అయిష్టత చూపుతున్నారు. సోషల్ మీడియాలో వచ్చే లైకులు, కామెంట్ల ద్వారా గుర్తింపు పొందాలని ఆరాటపడటం వారి ఆత్మవిశ్వాసాన్ని మరింత దిగజారుస్తోంది.

పరిష్కారం మన చేతుల్లోనే:

Advertisement

ఈ సమస్యపై భయాందోళన చెందడం కంటే.. అవగాహన పెంచుకోవడం ముఖ్యం. స్మార్ట్‌ఫోన్ వాడకాన్ని నియంత్రించుకోవడంతో పాటు, పిల్లలతో బాడీ ఇమేజ్, మానసిక ఆరోగ్యం గురించి స్వేచ్ఛగా మాట్లాడాలి. పోషకాహారం ఎంత ముఖ్యమో, డిజిటల్ అలవాట్లు కూడా అంతే ముఖ్యమని తల్లిదండ్రులు గుర్తించాలి. ఫోన్ చూసే సమయాన్ని తగ్గించి, వాస్తవ ప్రపంచంతో అనుబంధాన్ని పెంచడం ద్వారా ఈ ముప్పు నుంచి బయటపడవచ్చు.

Also Read: గ్యాస్ సిలిండర్ కొరత ఉన్నా చింత లేదు.. ఈ 5 పద్ధతులతో వంట చేయడం చాలా ఈజీ!

 

Related News

వయసు మీరుతున్నా ప్రేమలో మాత్రం ఫ్రెష్‌ ఫీలింగ్.. ఈ తేదీల్లో పుట్టినవారు గ్యారంటీ లవర్స్

రోజూ పకోడీలు తిని బోర్ కొడుతోందా? పచ్చి బొప్పాయితో క్రిస్పీ కట్లెట్స్ ట్రై చేయండి

కృష్ణాష్టమికి మీ పాపను రాధమ్మగా ముస్తాబు చేయాలా? ఫొటోషూట్ అందంగా చేయడానికి టిప్స్

మహిళల్లో ఎముకల బలహీనత సమస్య.. మెనోపాజ్‌కు ముందే బలమైన ఎముకల కోసం ఏం చేయాలి?

డైటింగ్ చేయాలంటే వెనుకడుగు వేస్తున్న పురుషులు.. తాజా అధ్యయనంలో తేలిన కారణాలివే

గణేశుడిని ఇంటికి తెచ్చేటప్పుడు..ఈ చిన్న విషయాలు మర్చిపోతే పూజ ఫలించదు ?

ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు? సరైన తేదీ, పూజా సమయం!

పెన్, డైరీ లాంటివి వద్దు.. టీచర్స్ డే రోజు రూ.500 లోపు బడ్జెట్‌లో స్పెషల్ గిఫ్ట్స్

Big Stories

Advertisement
×