E-Paper
Advertisement

IPL 2026: ముంబై ఇండియ‌న్స్ కు షాక్‌..ఐపీఎల్ 2026 నుంచి బుమ్రా ఔట్, కొత్త కెప్టెన్ గా సూర్య భాయ్ ?

IPL 2026: ముంబై ఇండియ‌న్స్ కు షాక్‌..ఐపీఎల్ 2026 నుంచి బుమ్రా ఔట్, కొత్త కెప్టెన్ గా సూర్య భాయ్ ?
Advertisement

IPL 2026:   ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament ) మరో ఐదు రోజుల్లో ప్రారంభం కానుంది. మార్చి 28వ తేదీ నుంచి ఈ మెగా టోర్నమెంట్ షురూ అవుతుంది. దాదాపు రెండు నెలల పాటు కొనసాగనున్న ఈ మెగా టోర్నమెంట్ నేపథ్యంలో అన్ని జట్లు సంసిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ ( Mumbai Indians) జట్టులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా సూర్య కుమార్ యాదవ్ కు ( Suryakumar Yadav) అవకాశం ఇస్తారని చర్చ జరుగుతోంది. అలాగే జస్‌ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah ) కు గాయమైనట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతో ఐపీఎల్ 2026 టోర్నమెంట్ కు పూర్తిగా దూరం కాబోతున్నాడని పోస్టులు కూడా వైరల్ అవుతున్నాయి. దీంతో ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

Also Read:  Clash in SRH: కావ్య మారన్ కు మ‌రో త‌ల‌నొప్పి.. SRH లో ప్లేయ‌ర్ల మ‌ధ్య గొడ‌వ‌..కెప్టెన్ ఇషాన్ పైనే తిరుగుబాటు

ఐపీఎల్ 2026 నుంచి బుమ్రా ఔట్ ?

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ మరో ఐదు రోజుల్లో ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ముంబై ఇండియన్స్ జట్టుకు ఊహించని షాక్ తగిలినట్లు చెబుతున్నారు. ముంబై ఇండియన్స్ జట్టులో భయంకరమైన బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah ) ఈ టోర్నమెంట్ కు దూరమయే ఛాన్సులు కనిపిస్తున్నాయి. అతనికి గాయమైనట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటకలోని భారత క్రికెట్ నియంత్రణ మండలి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కు జస్‌ప్రీత్ బుమ్రా చేరుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

అయితే ఈ బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ( BCCI Centre of Excellence ) సెంటర్ కు జస్‌ప్రీత్ బుమ్రా వచ్చిన నేపథ్యంలో అతనికి గాయమైనట్లు చర్చ జరుగుతోంది. ఒకవేళ ఇదే నిజమైతే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నుంచి జస్‌ప్రీత్ బుమ్రా తప్పుకునే ప్రమాదం ఉంటుందని అంచనా వేస్తున్నారు. వచ్చే సంవత్సరం 2027లో వన్డే వరల్డ్ కప్ జరగనుంది. ఇలాంటి నేపథ్యంలో గాయాలతోనే ఐపీఎల్ ఆడితే టీమిండియాకు పెను ప్రమాదం ఉంటుంది. ఈ క్రమంలోనే జస్‌ప్రీత్ బుమ్రాను బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సెంటర్ కు త‌ర‌లించార‌ని చ‌ర్చ జ‌రుగుతోంది. మ‌రి దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.

కొత్త కెప్టెన్ గా సూర్య భాయ్ ?

Advertisement

ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ కు అవకాశం వస్తుందని చర్చ జరుగుతోంది. మాజీ క్రికెటర్లు క్రిష్ శ్రీకాంత్ ఇలాంటి వాళ్లు కూడా సూర్య కుమార్ యాదవ్ కు కెప్టెన్సీ ఇస్తే ముంబై ఇండియన్స్ కు లక్ కలిసి వచ్చి టైటిల్ గెల్చుకుంటుందని పేర్కొన్నారు. ఇప్పటికే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో టి20 ఆసియా కప్ 2025 టోర్నమెంట్ అలాగే టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ను టీమిండియా గెలిచిందని గుర్తు చేశారు. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా పై వేటు వేసి, సూర్య కుమార్ యాదవ్ కు కెప్టెన్సీ ఇవ్వాలని పేర్కొన్నారు. అలా చేస్తే కచ్చితంగా ఈసారి ముంబై ఇండియన్స్ ఛాంపియన్ అవుతుందని స్పష్టం చేస్తున్నారు.

Also Read: Tanveer Ahmed: ఐపీఎల్ జోలికి వెళ్లొద్దు రా..వెంట‌నే PSL షెడ్యూల్ మార్చండి, లేక‌పోతే సంక‌నాకి పోతాం

 

Related News

ఎవ‌రెంత గింజుకున్నా, నేను రాజీనామా చేయ‌ను..న‌ఖ్వీ సంచ‌ల‌నం

ఒరేయ్ న‌ఖ్వీ? పాకిస్తాన్ జ‌ట్టును 9వ స్థానానికి దిగ‌జార్చావ్ క‌ద‌రా !

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఇండియాను వైట్ వాష్ చేస్తాం…రికీ పాంటింగ్ హెచ్చరిక

రిజ్వాన్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…భ‌విష్య‌తుల్లో పాకిస్తాన్ తరఫున మళ్లీ ఆడ‌కుండా చేస్తా

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

మిస్ట‌ర్ భువీ..ఇక చాలు, అన్ని మూసుకుని రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చో

ఇలానే వదిలేస్తే, ఇమ్రాన్ ఖాన్ ఏ క్షణమైనా చావడం పక్కా..!

దున్న‌పోతుల్లా తిన‌డం త‌ప్ప‌…మా ద‌ద్ద‌మ్మ‌ల‌కు ఆడ‌టం చేత‌కాదు

Big Stories

Advertisement
×