E-Paper
Advertisement

Price Hike Alert: ఏప్రిల్ 1 నుంచి.. మెుబైల్, టీవీ, ఏసీ ధరల పెంపు.. ఒక్కోదానిపై అదనంగా పడే భారమెంత?

Price Hike Alert: ఏప్రిల్ 1 నుంచి.. మెుబైల్, టీవీ, ఏసీ ధరల పెంపు.. ఒక్కోదానిపై అదనంగా పడే భారమెంత?

Price Hike Alert: సాధారణంగా ప్రతీఏటా ఏప్రిల్ 1 తేదీన ఆర్థికంగా కొన్ని మార్పులు జరుగుతుంటాయి. కొత్త నిబంధనలు అమల్లోకి రావడం, వస్తువుల ధరల పెరుగుదల సహజంగా చూస్తూనే ఉంటాం. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఏప్రిల్ నుంచి మెుబైల్, టీవీ, ఏసీల ధరలు భారీగా పెరగబోతున్నాయి. దీనిపై గత కొద్దిరోజుల నుంచి ప్రచారం జరుగుతున్న క్రమంలో.. బడ్జెట్ సర్దుబాటు అయినవారు ఈ అదనపు ఖర్చు నుంచి తప్పించుకునేందుకు ముందుగానే వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. అయితే సమయానికి బడ్జెట్ అడ్జస్ట్ కానీవారు మాత్రం.. ప్రస్తుతం ఆందోళనలో ఉన్నారు. ప్రస్తుతం ఉన్న వాటిపై అదనంగా ఎంత చెల్లించాల్సి వస్తుందోనని కంగారు పడుతున్నారు. కాబట్టి ఏసీ, టీవీ, మెుబైల్ పై అదనంగా పడే భారం ఎంతో ఇప్పుడు పరిశీలిద్దాం.

ధరల పెరుగుదలకు కారణాలేంటి?

ఏసీ, టీవీ, స్మార్ట్ ఫోన్ ధరల పెరుగుదలకు సంబంధించి ప్రధానంగా 3 రకాల కారణాలు కనిపిస్తున్నాయి. చిప్ కొరత ప్రస్తుతం.. కంపెనీలకు పెద్ద ఎత్తున వేధిస్తోంది. ఏఐ డేటా సెంటర్ల కోసం.. భారీగా మెమరీ చిప్స్ వాడకం పెరగడంతో స్మార్ట్‌ఫోన్‌లు, టీవీల్లో వాడే DRAM, NAND చిప్‌ల ధరలు విపరీతంగా పెరిగాయి. దీనికి తోడు డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ తగ్గడంతో విదేశాల నుంచి దిగుమతి చేసుకునే విడిభాగాలపై ఖర్చును మరింత పెంతుతోంది. మరోవైపు ఇరాన్ యుద్ధం నేపథ్యంలో చమురు సరఫరాలో అనిశ్చితి ఏర్పడి.. దేశంలో రవాణా ఖర్చు, తయారీ వ్యయం పెరిగిపోయింది. ఈ ఖర్చులను సొంతంగా భరించే పరిస్థితి లేనందున ఏప్రిల్ 1 నుంచి స్మార్ట్ ఫోన్, టీవీ, ఏసీల ధరలను పెంచాలని కంపెనీలు నిర్ణయించినట్లు తెలుస్తోంది.

స్మార్ట్ ఫోన్లపై భారం ఎంత?

జాతీయ మీడియా కథనాల ప్రకారం.. గత దీపావళి సమయంలో బేసిక్ బడ్జెట్ 5G ఫోన్ల ధరలు రూ.10000 లోపు ఉండేవి. ప్రస్తుతం అవి రూ.13,000-14,000లకు సేల్ అవుతున్నాయి. వచ్చే త్రైమాసికం నాటికి వాటి ధరలు మరింత పెరిగి.. రూ.17,000-18,000 చేరుకుంటాయన్న అంచనాలు ఉన్నాయి. రాబోయే 2-3 నెలల్ల రూ.20,000లకు కూడా పెరగొచ్చని మెుబైల్ కంపెనీల ప్రతినిధులు పేర్కొంటున్నారు.

టెలివిజన్ల సంగతేంటి?

మరోవైపు స్మార్ట్ టీవీల పరిస్థితి కూడా ఇంచుమించు మెుబైల్స్ తరహాలోనే ఉంది. గతేడాది 32 అంగుళాల టీవీ ధర రూ.6,500 ఉంటే.. ప్రస్తుతం సుమారు రూ.8,500కి దానిని విక్రయిస్తున్నారు. ఏప్రిల్ 1 తర్వాత నుంచి స్మార్ట్ టీవీల ధరలు.. సుమారు 10శాతం వరకూ పెరగొచ్చని సమాచారం. మే నాటికి 32 అంగుళాల స్మార్ట్ టీవీ.. రూ.10,000లకు చేరొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Also Read: New CCTV Rules 2026: చైనా సీసీటీవీలపై కేంద్రం నిషేధం.. ఏప్రిల్ 1 నుంచే అమలు.. కొత్త రూల్స్ ఇవే!

మరి ఏసీల పరిస్థితేంటి?

సాధారణంగా ప్రతీ వేసవిలో డిమాండ్ ను బట్టి ఏసీ ధరలు 8 – 12 శాతం వరకూ పెరుగుతాయి. ఏప్రిల్ తర్వాత నుంచి ఈ పెరుగుదల శాతం ఇంకాస్త పెరగొచ్చని సమాచారం. గత వేసవిలో రూ.32,000-34,000 వరకూ ఉన్న 3 స్టార్ 1.5 టన్నుల ఏసీ ధర.. ప్రస్తుతం రూ.37,000-రూ.40,000 మధ్య సేల్ అవుతుండటం.. ధరల పెరుగుదల ఏ స్థాయిలో ఉందో సూచిస్తోంది. ఎల్జీ, పానాసోనిక్, డైకిన్ వంటి ప్రముఖ ఏసీ బ్రాండ్స్.. ఇప్పటికే ధరల పెరుగుదల గురించి స్పష్టమైన సంకేతాలను వినియోగదారులకు అందించాయి.

Also Read: Strait of Hormuz: ఇరాన్ కోస్తల్ ఏరియా.. హోర్ముజ్ జలసంధి సమీపంలోని ప్రాంతం వీడియో ఇదిగో

Related News

ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లను హ్యాకర్లు ఎలా దొంగిలిస్తున్నారో తెలుసా?

ఫ్లిప్‌కార్ట్ అదిరిపోయే ఆఫర్.. రూపాయి ఖర్చు లేకుండా ‘నెట్‌ఫ్లిక్స్’ ఉచితం!

50MP కెమెరా, 6,500mAh బ్యాటరీతో Motorola Edge 70 Pro+ లాంచ్.. ధర వింటే షాకే!

డిజైన్ అదిరింది.. 5x పెరిస్కోప్ కెమెరాతో Xiaomi 17T లాంచ్, సేల్స్ ఎప్పటి నుంచంటే?

Physical SIM vs eSIM: ఆండ్రాయిడ్ ఫోన్లలో ఏ సిమ్ బెస్ట్? ఏది వాడితే ఎక్కువ లాభం?

గంటల తరబడి హెడ్‌ఫోన్స్ పెట్టుకుంటున్నారా? ఈ 60/60 రూల్ తెలియకపోతే డేంజర్లో పడ్డట్టే!

అమెజాన్ బంపరాఫర్.. మోటో ఎడ్జ్ 50పై రూ.5 వేలకు పైగా తగ్గింపు.. ఫోన్ ప్రత్యేకతలు ఇవే!

సరికొత్త లుమియో టీవీ.. డాల్బీ అట్మోస్, 4K డిస్‌ప్లే.. ఇక ఇంట్లోనే థియేటర్!

Big Stories

×