E-Paper
Advertisement

Visakhapatnam: రూటు మార్చిన అంబటి రాంబాబు.. జిల్లాల పర్యటనలు అందుకోసమేనా?

Visakhapatnam: రూటు మార్చిన అంబటి రాంబాబు.. జిల్లాల పర్యటనలు అందుకోసమేనా?
Advertisement

Visakhapatnam: వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు రూటు మార్చారా? చంద్రబాబు ప్రభుత్వం తనను జైలుకి పంపిన విషయాన్ని అనుకూలంగా మార్చుకునే పనిలో పడ్డారా? రంగా హత్యకు.. తన అరెస్టుకు ఒకేలా జరిగిందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారా? వంగవీటి రంగాతో తనను తాను పోల్చుకునే పనిలో పడ్డారా? వివిధ జిల్లాల్లో పర్యటించి కాపులను కూడగట్టే పనిలో పడ్డారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.

ఏపీలో వైసీపీ కొత్త స్కెచ్.. రంగంలోకి అంబటి

Advertisement

ముఖ్యమంత్రి చంద్రబాబుపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఇటీవల జైలుకి వెళ్లి వచ్చారు వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనుల గురించి విమర్శలు చేయలేక, వ్యక్తిగతంగా తన ఇమేజ్‌ని పెంచుకునే పనిలో పడినట్టు కనిపిస్తోంది. ఇదే సమయంలో కాపు నేతలను ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారాయన.

తాజాగా విశాఖ వెళ్లిన ఆయన, చంద్రబాబు సర్కార్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. మా ఇంటిపై జరిగిన దాడి చరిత్రలో ఎప్పుడూ జరగలేదన్నారు. ముమ్మాటికీ పోలీసుల బలగాలు సమక్షంలో దాడులు జరిగాయని ఆరోపించారు. దీని వెనుక సీఎం చంద్రబాబు, ఆయన కొడుకు ప్రమేయముందని వ్యాఖ్యానించారు. మా ఇంటిపై జరిగిన దాడిని ప్రభుత్వ పెద్దలు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేశారంటూ దుమ్మెత్తిపోశారు.

Advertisement

జిల్లాల పర్యటనలకు అంబటి శ్రీకారం.. కాపు నేతలను ఏకం చేసేందుకు

తనను చంపినా దిక్కులేదని, అదే జరిగితే ఇప్పటికి 30 రోజుల గడిచేదని అన్నారు. తాను సీఎంను తిడితే 18 రోజులు జైలుకు పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ గవర్నెన్స్ అంటే ఇదేనా అంటూ ప్రశ్నించారు.  బాబు పతనం మొదలైందన్నారు. అధికారం శాశ్వతం కాదని, తనపై దాడి చేసిన వారిపై చర్య తీసుకోకపోతే మూల్యం చెల్లించక తప్పదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాను జైలుకి వెళ్లినప్పుడు మినిమం నెల.. లేకుంటే మూడు నెలలని అనుకున్నానని చెప్పారు. కేవలం 18 రోజులకు బయటకు వచ్చేశానని అన్నారు. జైలుకి వెళ్లినా తన పొగరు, వాయిస్ తగ్గలేదని టీడీపీ నేతలు భావిస్తున్నారని, రెడ్‌బుక్ దెబ్బకు వణికిపోవాలని అనుకున్నారా? అంటూ తనదైన శైలిలోలో చెప్పుకొచ్చారు.

ఏపీలో రెండేళ్లలో దారుణమైన ఘటనలు జరుగుతున్నాయని మెలిక పెట్టే ప్రయత్నం చేశారు అంబటి. కష్టకాలంలో తనకు అండగా నిలిచిన కాపు నేతలకు రుణ పడి ఉంటానని చెప్పుకొచ్చారు. రంగా హత్య పోలీసుల సహాయంతో జరిగిందని, తన ఇంటిపై దాడి అదే విధంగా జరిగిందంటూ సరి పోల్చే ప్రయత్నం చేశారాయన.

ALSO READ: కువైట్‌లో మిస్సైళ్ల దాడులు.. బాంబుల మోతకు తెలుగు వ్యక్తి బలి 

రంగా శిబిరంలో పోలీసుల తనిఖీలు చేసిన తర్వాత దాడి జరిగిందంటూ పాత విషయాలు తవ్వే ప్రయత్నం చేశారు. అదే సమయంలో మరొక కాపు నేత ముద్రగడ గురించి ప్రస్తావించారు. ఆయన ఉద్యమ బాట పట్టడానికి చంద్రబాబు కారణం కాదా? అంటూ ప్రశ్నించారు.

కాపులను బీసీల్లో చేస్తామని చంద్రబాబు చెప్పారని, ముద్రగడను హతమార్చడానికి కుట్ర చేస్తే అందరూ అడ్డుకున్నామంటూ ఆనాటి ఘటనను గుర్తు చేశారు. కేవలం విశాఖ మాత్రమే కాదు.. వివిధ జిల్లాల్లో కాపు నేతలను కలిసి వారిని ఏకతాటిపైకి తీసుకురావాలని వైసీపీ ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది.

 

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×