E-Paper
Advertisement

BuffetGPT: పెళ్లి విందులో ఏం తినాలో తెలియక తికమక పడుతున్నారా? ఈ AI ఏజెంట్‌‌ను అడిగితే సరి!

BuffetGPT: పెళ్లి విందులో ఏం తినాలో తెలియక తికమక పడుతున్నారా? ఈ AI ఏజెంట్‌‌ను అడిగితే సరి!
Advertisement

From Food Confusion to Smart Choices: పెళ్లిళ్లు, పేరంటాలకు వెళ్తుంటాం. అక్కడ గెస్టులకు నోరూరించే ఫుడ్ ఐటెమ్స్ పెడతారు. అయితే, బోలెడు డిషెస్ ఉండటంతో చాలా మందికి ఏం తినాలో అర్థం కాదు. ఎన్నో తినాలని ఉన్నా, ఏం తినలేకపోతారు. నిజం చెప్పాలంటే పెళ్లి బఫేలో ఏం తినాలు అర్థంకాక చాలా మంది ఇబ్బంది పడుతారు. అలాంటి వారి కోసమే బెంగళూరుకు చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ క్రేజీ ఏఐని క్రియేట్ చేశారు.  పెళ్లి బఫేలో ఏం తినాలని అడిగితే, వెంటనే చెప్పేస్తుందట. ఇంతకీ ఈ AI ఏజెంట్ ఎలా పని చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..

BuffetGPTని క్రియేట్ చేసిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్

బెంగళూరుకు చెందిన పంకజ్ అనే AI ఇంజనీర్ తాజాగా BuffetGPTని క్రియేట్ చేశారు. ప్రస్తుతం బెంగళూరుతో ఈ AI ఏజెంట్ తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు పంజక్ క్రియేటివిటీని అందరూ మెచ్చుకుంటున్నారు. ఈ AI ఏజెంట్  పెళ్లి బఫేలో ఏం తినాలో, ఏం తినకూడదో ఈజీగా చెప్పేస్తుందంట. ఇంకా చెప్పాలంటే, ఈ AI ఏజెంట్ వినియోగదారులకు సూటయ్యే ఫుడ్ ను సెలెక్ట్ చేయడంతో సాయపడుతుందట. వినియోగదారులు ఇచ్చే ఇన్ ఫుట్స్ ను విశ్లేషించి.. రిజల్ట్ చెప్పేస్తుందట!

BuffetGPT ఎలా పని చేస్తుందటే?

Advertisement

ముందుగా BuffetGPTని ఓపెన్ చేసి, అక్కడ ఉన్న ఫుట్ ఐటెమ్స్ ను విజువల్ స్కానింగ్ చేస్తుంది. బఫే లే అవుట్‌ను పరిశీలించి బిర్యానీ, రోటీలు, రైస్, డెజర్ట్‌ లు లాంటి వంటకాలను గుర్తిస్తుంది. అక్కడ ఉన్న అన్ని వస్తువులను ఆహారంగా గుర్తించడానికి బదులుగా, రెండు విస్తృత సమూహాలుగా వర్గీకరిస్తుంది. ఎక్కువ విలువైన వంటకాలు అంటే ప్రత్యేక, అరుదైన వంటకాలుగా ఒక గ్రూప్, ఫిల్లర్ ఫుడ్స్ అంటే సాధారణంగా ఇంట్లో తినే ఫుడ్స్ ను మరో గ్రూప్ గా వర్గీకరిస్తుంది.

ఉదాహరణకు BuffetGPT అహ్మదాబాద్‌లో జరిగిన ఒక పెళ్లిలో 13 ఆహార పదార్థాలను విశ్లేషించి ఏ ఫుడ్ తినాలనేది వర్గీకరించింది. స్వీట్లు సాధారణంగా ప్రత్యేకమైనవి కావడంతో ప్రయారిటీలో వాటికి సగం కేటాయించింది. ఆ తర్వాత కూరలకు, 15% బ్రెడ్లు, 35% డెజర్ట్‌ ల కేటాయించింది. అదే సమయంలో ఆరోగ్యానికి ఏది మంచిది అనేది నిర్ణయించి, ఫుడ్ సెలెక్ట్ చేస్తుంది. ఆసక్తికరంగా, సిస్టమ్ డెజర్ట్‌ కు ముందు మజ్జిగ తాగమని సిఫార్సు చేస్తుంది. ఇంకా చెప్పాలంటే, బఫేలో ఉన్నఫుడ్స్ లో తప్పక తినాల్సినవి, కాస్త రుచి చూడాల్సినవి, తినకుండా వదిలేయాల్సి ఫుడ్స్ ను డివైడ్ చేస్తుంది.

సోషల్ మీడియాలో BuffetGPT ట్రెండింగ్

Advertisement

ప్రస్తుతం BuffetGPT  సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. కొంత మంది BuffetGPTని ప్రశంసిస్తుంటే, మరికొంత మంది విమర్శిస్తున్నారు. నచ్చింది తినేందుకు ఇంత తతంగం అవసరమా? అని కొంత మంది అంటుంటే, పెద్ద సమస్యను పరిష్కరించినందుకు థ్యాంక్స్ అని మరికొంత మంది చెప్తున్నారు.

Read Also: ఇక చికెన్, మటన్, ఫిష్ కూడా.. వందేభారత్ స్లీపర్ లో కొత్త మెను వచ్చేసింది!

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×