Manchu Vishnu: టాలీవుడ్ హీరోగా, మా(MAA) అధ్యక్షుడిగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న మంచు విష్ణు(Manchu Vishnu)కి బిగ్ షాక్ తగిలింది. చంద్రగిరి పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ(MBU)లో విద్యార్థి నేతల సంఘాలు ఈ నోటీసులు ఇవ్వడం సంచలనంగా మారింది. ఈ మేరకు విష్ణు విచారణకు రావాలి అంటూ నోటీసులు పంపుతూ ఆదేశాలు కూడా జారీ చేశారు చంద్రగిరి పోలీసులు.
ఇటీవల మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజుల దోపిడిపై విద్యార్థి సంఘాలు నిరసన చేసిన విషయం అందరికీ తెలిసిందే. దీంతో ఎస్ఎఫ్ఐ నేతలను యూనివర్సిటీ యాజమాన్యం కిడ్నాప్ చేసినట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న విషయం కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మంచు విష్ణుపై కేస్ ఫైల్ అవ్వగా.. ఇప్పుడు విచారణకు రావాలంటూ ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఇకపోతే ఈ కిడ్నాప్ కేసులో యూనివర్సిటీ పిఆర్ఓ సతీష్ ను A-1 గా పోలీసులు పరిగణించగా.. మంచు విష్ణుని A-2 గా, ఆయన తండ్రి, ప్రముఖ సీనియర్ హీరో మంచు మోహన్ బాబు (Manchu Mohan babu) ను A- 3 గా ఎఫ్ఐఆర్లో చేర్చారు. పోలీసులు ఇప్పటికే ఈ కేసులో పీఆర్ఓ సతీష్ తో పాటు కొంతమంది బాడీగార్డ్లను పోలీసులు అరెస్టు చేసి విచారిస్తుండగా.. బాధితుల వాంగ్మూలం అలాగే ప్రాథమిక ఆధారాల మేరకు.. యూనివర్సిటీ యాజమాన్యం చెప్పడంతోనే ఈ కిడ్నాప్ జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
అయితే మరోవైపు ఈ కేసులో తన పై నమోదైన ఎఫ్ఐఆర్ ను రద్దు చేయాలి అని అటు మంచు మోహన్ బాబు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ప్రస్తుతం ఆయన హైదరాబాదులో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కేసు వెనుక రాజకీయ కుట్ర ఉందని, ముఖ్యంగా తమ విద్యాసంస్థల ప్రతిష్టను దెబ్బతీసేందుకే కొంతమంది ఇలా కిడ్నాప్ కేసుల పేరిట పరువు తీసే ప్రయత్నం చేస్తున్నారని మంచు కుటుంబం ఆరోపిస్తోంది. ఇకపోతే ముందుగా ఫిక్స్ చేసుకున్న షెడ్యూల్డ్ కారణంగా వారంలో విచారణకు వస్తానని మంచు విష్ణు పోలీసులకు తెలిపారు. ఒకవేళ మంచు విష్ణు కిడ్నాప్ కేసులో కీలకంగా ఉన్న వ్యక్తి అని తెలిస్తే మాత్రం ఇక ఆయన అరెస్ట్ తప్పదా అనే కామెంట్లు కూడా వ్యక్తమౌతున్నాయి.
ALSO READ:Big TV Kissik Talks: బిగ్ బాస్ కి వెళ్లాలంటే డబ్బులు కట్టాల్సిందే.. గుట్టురట్టు చేసిన శ్రీజ!