Delhi shocking: యువతను సోషల్‌మీడియా మింగేస్తుందా? రీల్స్ పిచ్చిలో ప్రాణాలు పొగొట్టుకుంటున్నారా? ఈ తరహా ఘటనలు దేశంలో ఎక్కడో దగ్గర జరుగుతున్నాయా? తాజాగా ఓ యువకుడు అదే పని చేశాడా? తుపాకీతో తనను తాను కాల్చుకున్నాడా? ఈ తతంగాన్ని ఆ యువకుడి ఫ్రెండ్ వీడియో షూట్ చేశాడా? అవుననే అంటున్నారు పోలీసులు.
ఢిల్లీలో షాకింగ్ ఘటన.. రీల్స్ పిచ్చిలో ఊహించని దారుణం
ఢిల్లీలోని న్యూఅశోక్‌నగర్‌లో దారుణమైన ఘటన జరిగింది. ఫ్రెండ్ మొబైల్‌తో వీడియో రికార్డ్ చేస్తుండగా పవన్ అనే యువకుడు పిస్టల్‌తో తనను కాల్చుకుని ప్రాణాలు కోల్పోయాడు. స్పాట్‌లో పవన్ కుప్పకూలాడు. తీవ్ర గాయాల పాలైన పవన్‌ని వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ మృతి చెందాడు.
తూర్పు ఢిల్లీలోని దల్లుపురాలో ప్రాంతానికి చెందినవాడు పవన్. సోషల్ మీడియాలో తన వీడియో వైరల్ కావాలనే ఆలోచనతో సరదాగా చేసిన ప్రయత్నం ప్రాణాల మీదకు తెచ్చింది. పవన్‌కు పిస్టల్ అంటే మహా పిచ్చి. దాంతో రీల్స్ చేయాలని ఆలోచన చేశాడు. అందుకు తన ఫ్రెండ్ ని పిలిచాడు. స్నేహితుడు వీడియో తీస్తున్న సమయంలో పవన్ తన పిస్టల్‌ని లోడ్ చేశాడు.
సడన్ గా గన్ పేల్చుకున్న ఓ యువకుడు, స్పాట్‌లో మృతి
ఆ తర్వాత అపోజిట్‌లో ఉన్నదానికి షూట్ చేశాడు. కొన్ని క్షణాల తర్వాత పిస్టల్‌ని తన ఛాతీపై గురి పెట్టాడు. ఈలోగా స్నేహితుడు అరే వద్దని రెండుసార్లు హెచ్చరించాడు. ఏ మాత్రం వినలేదు. ట్రిగర్ నొక్కేసరికి బుల్లెట్ పవన్ ఛాతీలోకి దూసుకెళ్లింది. స్పాట్‌లో కుప్పకూలిపోయాడు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వచ్చారు. వెంటనే పవన్‌ని ఆసుపత్రికి తరలించారు.
రికార్డు చేస్తున్న వ్యక్తి పేరు హిమాంశు. పవన్‌కు దగ్గర బంధువు కూడా. కానీ పవన్ ఉద్దేశాలు ఏంటో హిమాంశుకు తెలీదని చెప్పారు. ప్రాథమిక విచారణలో ఆ పిస్టల్ హిమాంశుకి చెందనది తేలింది. పిస్టల్ తోపాటు 10 తూటాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే వీడియో రికార్డు చేయడానికి ఉపయోగించిన మొబైల్ ని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శాస్త్రి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు పోలీసులు.
ALSO READ: వరంగల్‌లో ఆకతాయిల వీరంగం.. బైక్‌పై వెళ్తున్న వారిపై బీరు సీసాలతో దాడి, సీసీ ఫుటేజ్
రీల్స్ పిచ్చిలో ప్రాణాలు తీసుకుంటున్న యువత
బుల్లెట్స్ లోడ్ చేసి తుపాకీతో కాల్చుకున్న యువకుడు
ఢిల్లీలోని దల్లుపురా ప్రాంతంలో జరిగిన ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ పవన్ మృతి
A young man named Pawan in the Dallupura area of Delhi shot himself while making a reel and died pic.twitter.com/KBQS1iI4Ck
— BIG TV Breaking News (@bigtvtelugu) March 17, 2026