E-Paper
Advertisement

ఏసీ రిమోట్ వాడకంపై కన్‌ఫ్యూజన్ ఉందా? ఏ బటన్ ఏం చేస్తుందో ఓ లుక్కేయండి!

ఏసీ రిమోట్ వాడకంపై కన్‌ఫ్యూజన్ ఉందా? ఏ బటన్ ఏం చేస్తుందో ఓ లుక్కేయండి!
Advertisement

AC Remote: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. దీంతో చాలా మంది ఏసీలు ఆన్ చేస్తూ ఉపశమనం పొందుతున్నారు. అయితే ఏసీ ఆన్ చేయడం సులభమే అయినా.. రిమోట్ వాడకంలో మాత్రం చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. పవర్ బటన్, టెంపరేచర్ పెంచేవి, తగ్గించేవి తప్ప.. మిగతా బటన్స్ ఎందుకు ఉన్నాయో, వాటిని ఎలా వాడాలో చాలామందికి తెలియదు. ఆ బటన్ల వెనుక ఉన్న అసలు సీక్రెట్స్ ఏంటి? ఏ బటన్ నొక్కితే ఏమౌతుందో చాలా సింపుల్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఆన్ అండ్ ఆఫ్ (Power Button)

ఇది అందరికీ బాగా తెలిసిన బటన్. సాధారణంగా రిమోట్ లో అందరి కంటికీ వెంటనే కనిపించేలా ఇది ఎరుపు రంగులో లేదా మిగతా బటన్స్ కంటే కాస్త భిన్నంగా ఉంటుంది. దీనిపై ON/OFF లేదా ఒక చిన్న పవర్ సింబల్ ఉంటుంది. ఏసీని స్టార్ట్ చేయడానికి అలాగే ఆపేయడానికి ఈ ఒక్క బటన్ వాడితే సరిపోతుంది.

కూల్ మోడ్ (Cool Mode)

Advertisement

రిమోట్‌లో Mode అనే బటన్ ఉంటుంది. దాన్ని నొక్కుతూ వెళ్తే మంచు ముక్క సింబల్ కనిపిస్తుంది. దాన్నే కూల్ మోడ్ అంటారు. మీ గదిని త్వరగా, చక్కగా చల్లబరచడానికి ఈ మోడ్ ఉపయోగపడుతుంది. ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు మనం వాడాల్సింది ఈ మోడ్ మాత్రమే.

డ్రై మోడ్ (Dry Mode)

వర్షాకాలంలో లేదా వాతావరణంలో ఉక్కపోత ఎక్కువగా ఉన్నప్పుడు రూమ్ టెంపరేచర్ నార్మల్‌గా ఉన్నా చెమటలు పడుతుంటాయి. అలాంటప్పుడు రిమోట్‌లో వాటర్ డ్రాప్ (నీటి చుక్క) సింబల్ ఉండే డ్రై మోడ్‌ను ఆన్ చేయాలి. ఇది గదిలో ఉండే తేమను లాగేసి వాతావరణం పొడిగా, హాయిగా ఉండేలా చేస్తుంది. దీనివల్ల కరెంట్ కూడా ఆదా అవుతుంది.

ఫ్యాన్ మోడ్ (Fan Mode)

Advertisement

గదిలో పెద్దగా వేడి లేదు కానీ కాస్త గాలి కావాలి అనుకున్నప్పుడు ఈ మోడ్ పనికొస్తుంది. ఇందులో ఏసీ కంప్రెసర్ ఆఫ్ అయిపోయి.. కేవలం లోపల ఉండే ఫ్యాన్ మాత్రమే తిరుగుతుంది. ఇది నార్మల్ సీలింగ్ ఫ్యాన్ లాగే పనిచేస్తుంది కాబట్టి కరెంట్ బిల్లు చాలా తక్కువ వస్తుంది.

టెంపరేచర్ కంట్రోల్ (Arrow Buttons)

రిమోట్ మధ్యలో పైకి, కిందికి చూపిస్తూ రెండు బాణం గుర్తులు లేదా ప్లస్, మైనస్ గుర్తులు ఉంటాయి. గదిలో చల్లదనం పెంచాలి అంటే కింది బటన్ నొక్కి టెంపరేచర్ నంబర్ తగ్గించాలి. చల్లదనం తగ్గాలి అనుకుంటే పై బటన్ నొక్కి నంబర్ పెంచాలి. సాధారణంగా ఏసీని 24°C లో ఉంచితే ఆరోగ్యంతో పాటు కరెంట్ బిల్లు రెండూ బ్యాలెన్స్ అవుతాయి.

ఫ్యాన్ స్పీడ్ (Fan Speed)

ఏసీ లోపలి నుంచి వచ్చే గాలి ఎంత వేగంగా రావాలో డిసైడ్ చేసే బటన్ ఇది. దీనిపై ఫ్యాన్ స్పీడ్ అని రాసి ఉంటుంది లేదా గీతల సింబల్స్ ఉంటాయి. దీని ద్వారా ఫ్యాన్ స్పీడ్‌ను.. లో, మీడియం, హై లేదా ఆటో మోడ్‌లో పెట్టుకోవచ్చు.

స్వింగ్ బటన్ (Swing)

ఏసీ నుంచి వచ్చే చల్లటి గాలి రూమ్ అంతా సమానంగా విస్తరించాలంటే ఈ బటన్ నొక్కాలి. దీన్ని ప్రెస్ చేయగానే ఏసీ ముందుండే రెక్కలు (Louvers) పైకి, కిందికి ఊగుతూ గాలిని అన్ని వైపులకూ పంపుతాయి. గాలి ఒకే చోట పడకుండా ఉండాలంటే స్వింగ్ ఆన్ చేసుకోవాలి.

టర్బో మోడ్ (Turbo / Super Cool)

బయట ఎండ నుంచి రాగానే ఇల్లు వెంటనే కూల్ అయిపోవాలనిపిస్తుంది కదా? అలాంటప్పుడు రిమోట్‌లో టర్బో లేదా జెట్ అని రాసి ఉన్న బటన్ నొక్కాలి. ఇది ఆన్ చేయగానే కంప్రెసర్, ఫ్యాన్ ఫుల్ స్పీడ్‌తో పనిచేసి కేవలం కొద్ది నిమిషాల్లోనే గదిని ఐస్ ముక్కలా మార్చేస్తాయి.

స్లీప్ మోడ్ (Sleep Mode)

రాత్రిపూట చాలా మంది ఏసీని ఆన్ చేసి పడుకుండిపోతారు. తిరిగి అర్ధరాత్రి దాటాక చలి ఎక్కువై నిద్ర లేచి ఏసీ కట్టేస్తుంటారు. అలా కాకుండా హాయిగా పడుకోవాలంటే స్లీప్ బటన్ నొక్కాలి. ఇది ఆన్ చేస్తే ఏసీ ప్రతి గంటకు ఒక డిగ్రీ చొప్పున టెంపరేచర్‌ను పెంచుతూ పోతుంది. దీనివల్ల తెల్లవారుజామున చలి పెట్టదు, నిద్ర పాడవదు. పైగా కరెంట్ కూడా చాలా పొదుపు అవుతుంది.

Also Read: Blue Star vs Voltas vs Carrier: ఫీచర్లు, ధర, కరెంటు ఆదా.. మధ్యతరగతి ఇంటికి.. మూడింట్లో ఏది బెస్ట్?

టైమర్ (Timer)

మీరు ఏసీని ఒక రెండు గంటలు మాత్రమే నడిపి ఆ తర్వాత ఆటోమేటిక్‌గా ఆగిపోయేలా చేయాలనుకుంటే ఈ టైమర్ ఆన్/ఆఫ్ బటన్ ఉపయోగపడుతుంది. ఇందులో మనకు కావాల్సిన టైమ్ సెట్ చేసుకుంటే ఆ సమయానికి ఏసీ అదే ఆగిపోతుంది.

Also Read: ఎవరికీ తెలియని 5 బెస్ట్ కూలర్ బ్రాండ్లు.. ధర తక్కువ, కూలింగ్ ఎక్కువ!

Related News

ఛార్జర్‌ను ఎప్పుడూ ప్లగ్‌లోనే ఉంచుతున్నారా? కొంపలు అంటుకుంటాయ్ భయ్యా!

ఏసీ గదిలో స్టాండ్ ఫ్యాన్.. తర్వాత జరిగే మ్యాజిక్కే వేరు.. నిజంగా ఆశ్చర్యపోతారు!

ప్రీపెయిడ్ vs పోస్ట్‌పెయిడ్ సిమ్.. రెండింటికి తేడా ఏంటి? సామాన్యులకు ఏది బెస్ట్?

BSNL కస్టమర్లకు షాక్.. రూ. 107 ప్లాన్ వ్యాలిడిటీ మళ్లీ కట్!

ఉక్కపోతతో నిద్ర పట్టట్లేదా? ఏసీ ఉన్నా, లేకున్నా.. ఈ ట్రిక్స్‌తో హాయిగా పడుకోవచ్చు!

‘సెన్‌హైజర్ మొమెంటం 5 వైర్‌లెస్’.. అద్భుతమైన ఫీచర్లతో సరికొత్త ప్రీమియం హెడ్‌ఫోన్స్

బడ్జెట్‌లో అదిరిపోయే ఫీచర్లు.. ‘లూమియో విజన్9 4K’ గూగుల్ టీవీ మామూలుగా లేదుగా..

పనుల్లో పడి నీళ్లు తాగడం మర్చిపోతున్నారా? గుర్తు చేసే.. బాటిల్స్ ఇవిగో!

Big Stories

Advertisement
×