E-Paper
Advertisement

Air Coolers Under Rs 6000: మధ్యతరగతి ఇళ్లకు.. సరిగ్గా సరిపోయే బడ్జెట్ కూలర్లు.. కళ్లుమూసుకొని కొనేయచ్చు!

Air Coolers Under Rs 6000: మధ్యతరగతి ఇళ్లకు.. సరిగ్గా సరిపోయే బడ్జెట్ కూలర్లు.. కళ్లుమూసుకొని కొనేయచ్చు!
Advertisement

Air Coolers Under Rs 6000: ప్రస్తుతం మార్కెట్ లో చాలా రకాల కూలర్లు అందుబాటులో ఉన్నాయి. రూ.5000 నుంచి రూ.30,000 వరకూ లభిస్తున్నాయి. అయితే సాధారణంగా మధ్యతరగతి ప్రజలు.. తక్కువ బడ్జెట్ లో మంచి కూలర్లను కోరుకుంటూ ఉంటారు. అటువంటి వారికోసం.. ఈ ప్రత్యేక కథనం అందించడం జరుగుతోంది. రూ.6000లోపు ఉన్న టాప్ – 5 అత్యుత్తమ కూలర్లు, వాటి ఫీచర్లపై ఓ లుక్కేయండి.

Bajaj 24 L Room Air Cooler

బజాజ్ కంపెనీకి చెందిన ఎయిర్ కూలర్లకు మార్కెట్ లో మంచి గుడ్ విల్ ఉంది. 24 లీటర్ల సామర్థ్యం కలిగిన ఈ కూలర్.. హెక్సాకూల్ (Hexacool) టెక్నాలజీతో వేగవంతమైన కూలింగ్‌ను అందిస్తుంది. ఇందులో ఉన్న పవర్‌ఫుల్ ఎయిర్ త్రో గాలిని గది అంతటా సమానంగా వ్యాపింపజేస్తుంది. తక్కువ విద్యుత్ వినియోగంతో సమర్థవంతంగా పనిచేస్తుంది. చిన్న గదులు ఉన్న ఇంటికి ఇది బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తోంది.

Usha 20 L Personal Air Cooler (Stellar)

Advertisement

ఉషా స్టెల్లార్ కూలర్.. స్టైలిష్ డిజైన్‌తో పాటు తక్కువ శబ్దంతో కూడిన పనితీరును కనబరుస్తుంది. దీనిలో ఉండే యాంటీ-బ్యాక్టీరియల్ ప్యాడ్స్ గాలిని శుభ్రంగా ఉంచడంలో సాయపడతాయి. ఇది తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుంది కాబట్టి ఆఫీస్ డెస్క్‌ల వద్ద లేదా చిన్న బెడ్‌రూమ్‌లలో వాడుకోవడానికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.

Symphony 9 L Personal Air Cooler

సింఫనీ సిల్వర్ పవర్ ఫుల్ కూలర్. దీనిలోని i-Pure టెక్నాలజీ గాలిలోని దుమ్ము, బ్యాక్టీరియాను తొలగించి స్వచ్ఛమైన గాలిని అందిస్తుంది. 9 లీటర్ల సామర్థ్యం ఉండటం వల్ల దీనిని సులభంగా ఒక చోట నుండి మరొక చోటకు తీసుకెళ్లవచ్చు. విద్యార్థులకు లేదా తక్కువ స్థలం ఉన్న వారికి ఇది చాలా అనుకూలం.

Voltas 15 L Personal Air Cooler

Advertisement

వోల్టాస్ ఏసీల తరహాలోనే ఈ కంపెనీ కూలర్లకు సైతం మార్కెట్ లో మంచి బ్రాండ్ ఉంది. ఈ కూలర్ తక్కువ నీటిని వాడుకుంటూ ఎక్కువ సేపు చల్లదనాన్ని అందిస్తుంది. ఇందులో ఉండే స్వింగ్ ఫంక్షన్ గాలిని గదిలోని అన్ని మూలలకు చేరేలా చేస్తుంది. దీని మెయింటెనెన్స్ సులభంగా ఉండటంతో పాటు ఖర్చు తక్కువ.

Crompton Greaves 20 L Personal Air Cooler

ఈ క్రాంప్టన్ కూలర్‌లోని హనీకోంబ్ ప్యాడ్స్ గాలిని వేగంగా చల్లబరుస్తాయి. బలమైన నిర్మాణంతో పాటు ‘ఎవపరేటివ్ కూలింగ్’ టెక్నాలజీని ఇది కలిగి ఉంది. ఇది ఇన్వర్టర్‌పై కూడా సమర్థవంతంగా పనిచేయగలదు. కాబట్టి పవర్ కట్ ఉన్న సమయాల్లో కూడా ఎలాంటి అంతరాయం లేకుండా చల్లని గాలిని ఆస్వాదించవచ్చు.

Also Read: Portable AC Offers: అమేజింగ్ సమ్మర్ సేల్.. అత్యంత చౌకగా పోర్టబుల్ ఏసీలు.. భలే ఛాన్సులే!

Orient 20 L Desert Air Cooler

ఈ ఓరియంట్ కూలర్ స్మార్ట్ ఫీచర్లను కలిగి ఉంది. ‘ఎలక్ట్రిక్ మైజర్’ (ElectricMiser) టెక్నాలజీని ఉపయోగించి.. తక్కువ విద్యుత్ ఖర్చుతో ఎక్కువ చల్లదనాన్ని అందిస్తుంది. ఇది డీజర్ట్ కూలర్ కావడం వల్ల గాలిని ఎక్కువ దూరం ప్రసారం చేయగలదు. పెద్ద గదుల్లోనూ ఈ కూలర్ సమర్థవంతంగా పనిచేస్తుంది.

Also Read: Most Selling Coolers Feb 2026: ఫిబ్రవరిలో హాట్ కేకుల్లా.. అమ్ముడుపోయిన కూలర్లు.. మార్చిలోనూ తగ్గేదేలే!

Related News

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×