E-Paper
Advertisement

Portable AC Offers: అమేజింగ్ సమ్మర్ సేల్.. అత్యంత చౌకగా పోర్టబుల్ ఏసీలు.. భలే ఛాన్సులే!

Portable AC Offers: అమేజింగ్ సమ్మర్ సేల్.. అత్యంత చౌకగా పోర్టబుల్ ఏసీలు.. భలే ఛాన్సులే!
Advertisement

Portable AC Offers: వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఏసీలు, కూలర్లు, రిఫ్రిజిరేటర్లపై పలు ఈ కామర్స్ సైట్స్ భారీ డిస్కౌంట్లు అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే పోర్టబుల్ ఏసీలపై సైతం రాయితీలను ప్రకటించాయి. వాటి మార్కెట్ ధర కంటే చాలా తక్కువగా వినియోగదారులకు అందిస్తున్నాయి. ప్రీమియం కూలర్ల ధరలతో పోలిస్తే.. ఇవి చాలా చౌకగా లభిస్తున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెజాన్ లో చౌకగా లభిస్తున్న టాప్ – 5 బ్రాండెడ్ పోర్టబుల్ ఏసీలు ఏవి? వాటి ఫీచర్లు ఏంటి? ఈ కథనంలో పరిశీలిద్దాం.

Blue Star 1 Ton Portable AC

పోర్టబుల్ ఏసీల విభాగంలో బ్లూ స్టార్ అత్యంత నమ్మకమైన బ్రాండ్ గా ఉంది. ఇది చిన్న గదులకు (సుమారు 100-120 చ.అడుగులు) సరిగ్గా సరిపోతుంది. దీని ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులోని హై ఎఫిషియన్సీ రోటరీ కంప్రెసర్ వేగంగా గదిని చల్లబరుస్తుంది. డస్ట్ ఫిల్టర్.. గాలిలోని ధూళి కణాలను తొలగిస్తుంది. రిమోట్ సాయంతో దూరం నుండే ఈ ఏసీని సులభంగా కంట్రోల్ చేయవచ్చు. దీని అసలు ధర రూ.35,000 కాగా రిలయన్స్ డిజిటల్ రూ.26,190 (35 శాతం డిస్కౌంట్) అందిస్తోంది.

Lloyd 1.0 Ton Portable AC

Advertisement

స్టైలిష్ డిజైన్, మెరుగైన పనితీరును కోరుకునేవారికి లాయిడ్ పోర్టబుల్ ఏసీ బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తోంది. దీనిలోని స్మార్ట్ ఎయిర్ స్వింగ్ ఫీచర్.. గది అంతటా చల్లని గాలి సమానంగా ప్రసరిస్తుంది. బ్లూ ఫిల్ కాయిల్స్.. తుప్పుపట్టకుండా ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. ఈ ఏసీ గాలిని నేరుగా పైకి విసురుతూ గదిని త్వరగా చల్లబరుస్తుంది. కింది భాగంలో వీల్స్ చక్రాలు ఉండటం వల్ల ఒక గది నుండి మరో గదికి సులభంగా దీనిని తరలించవచ్చు. దీని అసలు ధర రూ.39,990 కాగా క్రోమాలో 15 శాతం రాయితీతో రూ.33,690కి పొందవచ్చు.

3. Cruise 1 Ton Portable AC

ధర తక్కువలో మంచి ఫీచర్లు కావాలనుకునే వారికి క్రూజ్ ఒక మంచి ఆప్షన్. దీనిలోని 4-ఇన్-1 ఫిల్టర్.. గాలిని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది. టచ్ కంట్రోల్ ప్యానెల్.. సెట్టింగ్స్ మార్చడాన్ని సులభతరం చేస్తుంది. ఇది పనిచేస్తున్నప్పుడు ఇతర ఏసీల కంటే తక్కువ శబ్దం చేస్తుంది. దీనిలోని హై-డెన్సిటీ డస్ట్ ఫిల్టర్.. దుమ్ము – దూళిని తొలగించి శుభ్రమైన గాలిని అందిస్తుంది. దీని అసలు ధర రూ. 40,900. కానీ అమెజాన్ 25 శాతం డిస్కౌంట్ తో రూ.30,490కు దానిని అందిస్తోంది.

AmazonBasics 1 Ton Portable AC

Advertisement

తక్కువ బడ్జెట్‌లో అమెజాన్ స్వంత బ్రాండ్ పోర్టబుల్ ఏసీ కూడా అందుబాటులో ఉంది. ఇది కూలింగ్, ఫ్యాన్, డీహ్యూమిడిఫైయర్ (తేమ తగ్గించేది) అనే మూడు మోడ్స్ ను కలిగి ఉంది. దీనిలోని ఆటో రీస్టార్ట్ ఫీచర్ కారణంగా.. కరెంటు పోయి వచ్చాక పాత సెట్టింగ్స్‌తోనే తిరిగి స్టార్ట్ అవుతుంది. స్లీప్ మోడ్ ఫీచర్.. రాత్రిపూట విద్యుత్ ఆదా చేయడానికి, సౌకర్యవంతమైన నిద్రకు ఉపయోగపడుతుంది.

Also Read: CM Revanth Reddy: తల తాకట్టు పెట్టైనా నిధులు తెస్తా.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Media 1 Ton Portable AC

ప్రపంచవ్యాప్తంగా పోర్టబుల్ ఏసీల తయారీలో మీడియా (Midea) మంచి గుర్తింపు ఉంది. ఈ ఏసీ ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులోని సెల్ఫ్ ఎవాపరేటివ్ సిస్టమ్ నీటిని పదేపదే తీసే అవసరం లేకుండా తనే ఆవిరి చేస్తుంది. అలాగే దీనిలోని శక్తివంతమైన కూలింగ్ టెక్నాలజీ.. వేసవి ఎండల్లో కూడా వేగంగా చల్లదనాన్ని అందిస్తుంది.

Also Read: Road Accident: నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు లారీ ఢీ, స్పాట్‌లో నలుగురు..

Related News

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×