E-Paper
Advertisement

Best Dishwasher Brands: కొత్త డిష్ వాషర్ కావాలా? ట్రెండింగ్ మోడల్స్ ఇవే.. క్రేజీ ఫీచర్లు భయ్యా!

Best Dishwasher Brands: కొత్త డిష్ వాషర్ కావాలా? ట్రెండింగ్ మోడల్స్ ఇవే.. క్రేజీ ఫీచర్లు భయ్యా!
Advertisement

Best Dishwasher Brands: ప్రస్తుతం మార్కెట్ లో అనేక కంపెనీలకు చెందిన డిష్ వాషర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిలో కొన్ని మాత్రమే వినియోగదారుల నుంచి సంతృప్తికరమైన స్పందనలు అందుకుంటున్నాయి. మీ వంటగది అవసరాలకు సరిపోయేలా ప్రస్తుతం మార్కెట్ లో అందుబాటులో ఉన్న 5 ఉత్తమ డిష్ వాషర్ బ్రాండ్ లు, వాటి ప్రధాన ఫీచర్లను ఈ కథనంలో పరిశీలిద్దాం.

Bosch SMS66GI01I

డిష్ వాషర్ల విభాగంలో బాష్ కంపెనీకి అత్యంత ప్రజాధారణ ఉంది. Bosch SMS66GI01I మోడల్ డిష్ వాషర్ ను ప్రధానంగా భారతీయ వంటగదిని టార్గెట్ చేస్తూ రూపొందించారు. ఇందులో Intensive Kadhai 70° ఫీచర్ ఉంది. Intensive Kadhai 70°డిగ్రీల ఉష్ణోగ్రత కలిగిన నీటితో గిన్నెలు కడకడం ద్వారా మెుండి జిడ్డు, మాడిపోయిన మరకలను తొలగిస్తుంది. VarioSpeed ఫీచర్ గిన్నెలు వేగంగా శుభ్రం కావడానికి సాయపడుతుంది. EcoSilence Drive కారణంగా గిన్నెలు తోమే సమయంలో తక్కువ శబ్దం వస్తుంది.

IFB Neptune VX

Advertisement

IFB బ్రాండ్.. దేశీయ వాతావరణం, నీటి నాణ్యతను దృష్టిలో ఉంచుకుని ఈ డిష్ వాషర్ ను తయారు చేసింది. దీనిలోని Water Softening Device నీటిలోని కఠినత్వాన్ని తగ్గించి.. గిన్నెలపై తెల్లటి మచ్చలు పడకుండా చేస్తుంది. Steam Drying ఫీచర్ గిన్నెలు కడిగిన తర్వాత వాటిపై తేమ లేకుండా ఆవిరి చేసేస్తుంది. Hygiene 70°C గిన్నెలపై దాగుండే క్రిములు, బ్యాక్టీరియాను నశించేలా చేసి.. కుటుంబ సభ్యులను ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.

LG DFB424FP

ఎల్జీ డిష్ వాషర్లు.. అత్యాధునిక ఫీచర్లను కలిగి ఉన్నాయి. LG DFB424FP మోడల్ లోని TrueSteam ఫీచర్.. ఆవిరి ద్వారా గిన్నెలపై ఉన్న ఎండిపోయిన ఆహార పదార్థాలను సులభంగా తొలగించేస్తుంది. దీనివల్ల గిన్నెలు కొత్తవాటిలా తళతళా మెరుస్తాయి. QuadWash ఫీచర్.. నాలుగు వైపుల నుండి నీటిని స్ప్రే చేస్తూ గిన్నెల ప్రతీ మూలన శుభ్రం చేస్తాయి. దీనిలోని ప్రత్యేకమైన ఇన్వర్టర్ డైరెక్ట్ డ్రైవ్ వ్యవస్థ.. విద్యుత్ ను ఆదా చేయడంతో పాటు తక్కువ శబ్దంతో డిష్ వాషర్ పనిచేసేలా చేస్తుంది.

Voltas Beko DT8S

Advertisement

వోల్టాస్ కంపెనీకి చెందిన ఈ డిష్ వాషర్ AquaIntense ఫీచర్ తో రూపొందింది. నీటి ఒత్తిడిని పెంచి అత్యంత జిడ్డుగా ఉన్న పాత్రలను శుభ్రం చేస్తుంది. అలాగే దీనిలోని Fast+ Function గిన్నెలు కడిగే సమయాన్ని ఇతర వాటితో పోలిస్తే 3 రెట్లు తగ్గిస్తుంది. ఈ డిష్ వాషర్ సైజ్ చిన్నగా ఉన్నందున 4-5 కుటుంబ సభ్యులు ఉండే ఫ్యామిలీకి, ఇరుకైన వంటగదులకు సరిగ్గా సరిపోతుంది.

Also Read: Dishwasher Benefits: అంట్లు తోమలేకపోతున్నారా? డిష్ వాషర్ కొనేయండి.. బోలెడన్ని ప్రయోజనాలు!

Samsung DW60M6043FS

శాంసంగ్ కంపెనీకి చెందిన డిష్ వాషర్లు మెరుగైన పనితీరుతో పాటు స్టైలిష్ లుక్ ను కలిగి ఉంటాయి. పెద్ద పెద్ద పాత్రలు, అతి జిడ్డుగా ఉన్న కడాయిలను సైతం ఈ డిష్ వాషర్ సమర్థవంతంగా శుభ్రం చేస్తుంది. దీని లోపల స్టీల్ బాడీ ఉండటం వల్ల తుప్పు పట్టదు. ఎక్కువ కాలం మన్నిక కలిగి ఉంటుంది. తక్కువ గిన్నెలు ఉన్నప్పుడు హాఫ్ లోడ్ ఆప్షన్ ను వినియోగించడం ద్వారా విద్యుత్, నీటిని ఆదా చేసుకోవచ్చు.

Also Read: Dishwashers March 2026: మార్చిలో రాబోయే మోస్ట్ వాంటెడ్ వాష్ డిషర్లు.. ఒకసారి ఆన్ చేస్తే.. గిన్నెలు ఫటా ఫట్ క్లీనింగ్!

Related News

బడ్జెట్ ధరలో.. బెస్ట్ వాషింగ్ మెషీన్ హయర్ 6.5 కేజీ టాప్ లోడ్ రివ్యూ?

రూ.20వేలలోపు శామ్‌సంగ్ గెలాక్సీ M36 5G.. ఫోన్ అంటే ఇలా ఉండాలి బాస్

స్టూడెంట్స్ అండ్ యూత్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు

వివో మాస్టర్ ప్లాన్ అదిరింది.. మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలతో Vivo X500 Ultra ఎంట్రీ!

ఐఫోన్, శాంసంగ్‌లకు దెబ్బ మీద దెబ్బ.. హువావే నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్, డిజైన్ లీక్!

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

అమెజాన్‌లో దుమ్ములేపుతున్న..రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్!

వార్నీ.. ఇన్నాళ్లూ స్మార్ట్‌ఫోన్ పవర్ బటన్‌ను వేస్ట్‌గా వాడామా? ఇందులో ఇంత మ్యాజిక్ ఉందా!

Big Stories

Advertisement
×