E-Paper
Advertisement

Dishwashers March 2026: మార్చిలో రాబోయే మోస్ట్ వాంటెడ్ వాష్ డిషర్లు.. ఒకసారి ఆన్ చేస్తే.. గిన్నెలు ఫటా ఫట్ క్లీనింగ్!

Dishwashers March 2026: మార్చిలో రాబోయే మోస్ట్ వాంటెడ్ వాష్ డిషర్లు.. ఒకసారి ఆన్ చేస్తే.. గిన్నెలు ఫటా ఫట్ క్లీనింగ్!
Advertisement

Dishwashers March 2026: ఇళ్లలోని ఆడవారు అధికంగా శ్రమించే పనుల్లో అంట్లు తోమడం ఒకటి. ప్రతీ పూట వచ్చి పడే గిన్నెలను తోముతూ వారు పడే కష్టం అంతా ఇంతా కాదు. అయితే ఆ సమస్యకు చెక్ పెట్టేలా.. మార్కెట్ లో చాలా రకాల డిష్ వాషర్లు అందుబాటులో ఉన్నాయి. 2026 మార్చి నాటికి మార్కెట్లో అందుబాటులో ఉన్న టాప్ – 4 వాష్ డిషర్లు, వాటి ధర, ఫీచర్ల వివరాలను ఇక్కడ అందించడం జరుగుతోంది. వాటిలో మీ అభిరుచి, అవసరానికి అనుగుణంగా ఉన్న డిష్ వాషర్ ను ఎంచుకోండి.

Bosch Series 6 (2026 Edition)

వాష్ డిషర్ల నుంచి మెరుగైన పర్ఫార్మెన్స్ కోరుకునే వారికి బాష్ కంపెనీ తొలి ప్రాధాన్యంగా నిలుస్తుంటుంది. Bosch Series 6 వాష్ డిషర్ ఫీచర్ల విషయానికి వస్తే.. ఇది Intensive Kadhai Programతో పనిచేస్తుంది. 70 డిగ్రీల సెంటిగ్రేడ్ వేడి నీటితో అంట్లు తోమడం ద్వారా మొండి జిడ్డు, కఠినమైన మసాలా మరకలను సులభంగా తొలగిస్తుంది. దీనిలోని EcoSilence Drive చాలా తక్కువ శబ్దంతో (46 dB) వాష్ డిషర్ ను పనిచేసేలా చేస్తుంది. మీ స్మార్ట్ ఫోన్ ద్వారా ఎక్కడ నుంచైనా ఈ వాష్ డిషర్ ను ఆపరేట్ చేయవచ్చు. దీని ధర రూ.62,500-72,000 మధ్య ఉండనుంది.

LG QuadWash with TrueSteam

Advertisement

ఎల్జీ కంపెనీకి చెందిన ఈ డిష్ వాషర్ అధునాతన సాంకేతికతతో పనిచేయనుంది. ఇందులోని ట్రూ స్టీమ్ (TrueSteam) సాంకేతికత ఆవిరి ద్వారా పాత్రలను శుభ్రం చేస్తుంది. ఎండిపోయిన ఆహారపదార్థాల మరకలను సైతం త్వరగా వదిలించేస్తుంది. ఈ డిష్ వాషర్ లోని క్వాడ్ వాష్ ఫీచర్.. నాలుగు వైపుల నుండి నీటిని స్ప్రే చేసి.. గిన్నెల అన్ని మూలలను శుభ్రం చేస్తుంది. దీని ధర రూ.48,800 – 60,000 వరకూ ఉంది.

IFB Neptune VX16 (AI Enabled)

దేశీయ కంపెనీ IFB.. భారతీయ వంట పాత్రలకు తగినట్లుగా ఎక్కువ సామర్థ్యం కలిగిన డిష్ వాషర్లను విడుదల చేస్తుంటుంది. తన లేటెస్ట్ మోడల్ IFB Neptune VX16 వాష్ డిషర్.. అధిక సామర్థ్యాన్ని కలిగి ఉండి 6-8 మంది సభ్యులు ఉన్న కుటుంబానికి సరిగ్గా సరిపోతుంది. వాషింగ్ పూర్తి అయిన తర్వాత డోర్ దానంతట అదే కొంచెం తెరుచుకొని.. పాత్రలు తేలిగ్గా ఆరిపోయేలా చేస్తుంది. ఇందులోని హాట్ వాటర్ వాష్ కారణంగా 99 శాతం క్రిములు నశించిపోతాయని కంపెనీ వర్గాలు తెలిపాయి. మార్కెట్ లో దీని ధర రూ.53,400 – 63,000 వరకూ ఉంటుంది.

Advertisement

Also Read: Best Selling Fridges Feb 2026: గత నెల మార్కెట్‌ను షేక్ చేసిన ఫ్రిడ్జ్‌లు.. ఎగబడి కొన్న జనం!

Samsung Bespoke AI Dishwasher

శాంసంగ్ కంపెనీకి చెందిన ఈ డిష్ వాషర్.. స్టైలిష్ లుక్ తో పాటు, ఏఐ సాంకేతికతను కలిగి ఉంది. ఇందులోని AI Energy Mode మీ వాడుకను బట్టి కరెంట్, నీటి వినియోగాన్ని ఆదాచేస్తుంది. అలాగే StormWash+ ఫీచర్.. అత్యంత మొండిగా ఉన్న జిడ్డును వదిలించడానికి డ్యూయల్ స్ప్రే ఆర్మ్స్ ను వినియోగిస్తుంది. దీని ధర రూ.58,000 నుంచి 68,000 వరకూ ఉంటుంది.

Also Read: ACs Buying Tips: కొత్త ఏసీ కొనాలంటే.. ఈ నాలెడ్జ్ తప్పనిసరి.. లేదంటే ఈజీగా మోసపోతారు!

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ఏమైనట్టు.. ? మాలిని జైలుకు వెళ్తుందా..?            

సోని నుంచి మరో అద్భుతం..Sony WF-C510 ఇయర్ బడ్స్ లాంచ్

హైడ్రా రంగంలోకి వస్తోంది.. ప్రకటనలు ఇచ్చేముందు ఈ రూల్స్ తెలియాలోచ్!

రూమ్ ఏదైనా సరే..ఈ టాప్-7 ప్రొజెక్టర్లతో విజువల్స్ నెక్స్ట్ లెవెల్!

Ninnu kori Serial Today Episode October 6th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ కు నిజం తెలుస్తుందా..? జీవన్ పరిస్థితి ఏంటి..?  

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

Illu Illalu Pillalu Serial Today Episode October 2nd ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: నర్మదను మెచ్చుకున్న రామరాజు – శ్రీవల్లి ప్లాన్ సక్సెస్ అయ్యేనా..?             

Ninnu kori Serial Today Episode October 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను  శ్రీజ మర్చిపోతుందా..? – మదన్ ప్లాన్ సక్సెస్ అవుతుందా..?    

Big Stories

Advertisement
×