E-Paper
Advertisement

Sahibzada Farhan: ఐసీసీని కోర్టుకు ఈడ్చుతా..నాకు ద‌క్కాల్సిన అవార్డ్, సంజుకు ఎలా ఇస్తారు ?

Sahibzada Farhan: ఐసీసీని కోర్టుకు ఈడ్చుతా..నాకు ద‌క్కాల్సిన అవార్డ్, సంజుకు ఎలా ఇస్తారు ?
Advertisement

Sahibzada Farhan: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటు ( T20 World Cup 2026 tournament )  విశ్వ విజేతగా టీమిండియా ( Team India ) నిలిచిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం ( Narendra Modi Stadium, Ahmedabad ) వేదికగా టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ ( Team India vs New Zealand, Final) మధ్య ఆదివారం మ్యాచ్ జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన టీమ్ ఇండియా 96 పరుగుల తేడాతో విజయం సాధించి.. ముచ్చటగా మూడవ సారి ఛాంపియన్ అయింది. అయితే ఫైనల్ మ్యాచ్ లో 89 పరుగులు సాధించిన సంజూ శాంసన్ కు ( sanju samson ) ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ ఇచ్చింది ఐసీసీ ( icc ). దీంతో పాకిస్తాన్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్ ( Sahibzada Farhan ) సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనకు దక్కాల్సిన అవార్డును సంజు శాంసన్ కు ఇవ్వడం ఏంటని ప్రశ్నించాడు ఫర్హాన్. దీనిపై ఐసీసీని కోర్టుకు ఈడ్చుతానంటూ సాహిబ్‌జాదా ఫర్హాన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

Also Read: IND VS NZ Final: అహ్మ‌దాబాద్ మ‌ట్టిని నుదిటన రాసుకున్న సూర్య కుమార్, రోహిత్ శర్మను మించి సెల‌బ్రేష‌న్స్‌

ఐసీసీని కోర్టుకు ఈడ్చుతా..ఫ‌ర్హాన్ సంచ‌ల‌నం

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులో పాకిస్తాన్ ఓపెనర్ ఫర్హాన్ 383 పరుగులు సాధించినప్పటికీ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డు దక్కలేదు. కానీ ఐదు మ్యాచ్లలో 321 పరుగులు చేసిన సంజుకు మాత్రం ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కడం జరిగింది. ఇప్పుడు ఇదే అంశం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. రూల్స్ ప్రకారం ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడికి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కుతుంది. కానీ సంజు విషయంలో ఐసీసీ సరికొత్త నిర్ణయం తీసుకొని… అవార్డు మనోడికి ఇచ్చింది. ఇక్కడే ఫర్హాన్ కు బాగా మండింది. ఈ విషయంలో ఐసీసీ ని కోర్టుకు ఈడ్చుతానంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు ఫర్హాన్. బిసిసిఐ అలాగే ఐసీసీ రెండు కుమ్మక్కై.. తనకు అన్యాయం చేశాయని మండిపడ్డాడు. సంజు శాంసన్ తక్కువ పరుగులు చేసిన ఎందుకు ఆ అవార్డు ఇచ్చారని ఫైర్ అయ్యాడు.

టి20 ప్రపంచ కప్ లో ఫర్హాన్ ప్రదర్శన

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులో ఏడు మ్యాచ్ లు ఆడాడు పాకిస్తాన్ ఆటగాడు ఫర్హాన్. ఈ సందర్భంగా 383 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు రెండు అర్థ సెంచరీలు కూడా ఉన్నాయి. 160 రేటుతో మొత్తం 383 పరుగులు సాధించాడు. ఇందులో 18 సిక్సర్లు అలాగే 37 బౌండరీలు ఉన్నాయి. అటు ఇదే విషయంపై ఫైనల్ అయిపోయిన తర్వాత న్యూజిలాండ్ కెప్టెన్ శాంట్న‌ర్ ను, పాకిస్తాన్ జర్నలిస్టులు ప్రశ్నించారు. అత్యధిక పరుగులు చేసిన ఫర్హాన్ కు ప్లేయర్ ఆఫ్ ద అవార్డు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు జర్నలిస్టులు. అయితే దానికి వింత ఆన్సర్ ఇచ్చాడు న్యూజిలాండ్ కెప్టెన్ శాంట్న‌ర్‌. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, నమీబియా, శ్రీలంక, నెదర్లాండ్స్ లాంటి జ‌ట్ల పైన ఆడితే అవార్డ్స్ రావని ఆసక్తికర ఆన్సర్ ఇచ్చాడు శాంట్న‌ర్‌. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.

Advertisement

 

 

 

Related News

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

Big Stories

Advertisement
×