Under Rs 10000 5g Mobiles: ప్రస్తుతం మార్కెట్‌లో 5జీ స్మార్ట్‌ఫోన్లకు విపరీతంగా డిమాండ్ పెరిగిపోయింది. ఈ కారణంగా ప్రముఖ మొబైల్ కంపెనీలు కొత్త కొత్త మోడళ్లను రిలీజ్ చేస్తున్నాయి. అయితే వీటి ధరలు అమాంతంగా పెరిగిపోవడంతో.. చాలామంది కొనేందుకు ఇష్టపెట్టుకోవడం లేదు. ఎప్పుడైనా డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటిస్తే అప్పుడు కొనుక్కోవచ్చులే అని చూస్తున్నారు. అలా ఎదురుచూసే వారికి ఓ గుడ్ న్యూస్. ఎందుకంటే ఇప్పుడు సామ్ సంగ్ నుంచి పోకో వరకు రూ.10 వేలలో లభించే 5జీ ఫోన్ల గురించి ఫుల్ లిస్ట్ ఇక్కడ ఇవ్వబడింది. అందువల్ల ఇందులో మీకు ఏది ఇష్టమో అది సెలెక్ట్ చేసి కొనుక్కోవచ్చు.
ప్రముఖ ఈ కామర్స్ సంస్థలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో పోకో ఎం6 ప్రో చాలా తక్కువ ధరలో అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ.15,999 ఉండగా.. ఇప్పుడు రూ.9,999లకే లిస్ట్ అయింది. అలాగే బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఈ ఆఫర్లతో మరింత తక్కువ ధరకే ఈ 5జీ మొబైల్‌ను కొనుక్కోవచ్చు.
ఇది 6.79-అంగుళాల 90Hz LCD స్క్రీన్‌తో FHD+ రిజల్యూషన్, 50MP డ్యూయల్ కెమెరాలు, స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 చిప్‌సెట్‌తో వస్తుంది. ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది.
Also Read: రూ.20 వేల బడ్జెట్‌లో టాప్ రేటింగ్ ఫోన్లు ఇవే!
ఫ్లిప్‌కార్ట్‌లో పోకో ఎం6 5జీ ఫోన్‌పై సూపర్ డూపర్ డిస్కౌంట్ ఉంది. దీని అసలు ధర రూ.12,999 ఉండగా ఇప్పుడు 28 శాతం తగ్గింపుతో కేవలం రూ.9,299లకే కొనుక్కోవచ్చు. ఇది 6.74 అంగుళాల హెచ్ డీ ప్లస్ డిస్ప్లేను కలిగి ఉంది. 50 ఎంపీ రియర్ కెమెరా.. 5ఎంపీ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది.
ఫ్లిప్‌కార్ట్‌లో మోటో జీ34 5జీ అసలు ధర రూ.13,999గా ఉంది. అయితే ఇప్పుడు ఇది 21 శాతం తగ్గింపుతో రూ.10,999కి లిస్ట్ అయింది. అయితే SBI క్రెడిట్ అండ్ డెబిట్ కార్డు ట్రాన్షక్షన్‌పై రూ.1000 వరకు తగ్గింపు పొందవచ్చు. అప్పుడు రూ.9,999లకే లభిస్తుంది. ఇది HD+ రిజల్యూషన్‌తో 6.5-అంగుళాల 120Hz స్క్రీన్‌ను కలిగి ఉంది. 50MP డ్యూయల్ కెమెరాను కలిగి ఉంది. Snapdragon 695 SoC ద్వారా శక్తిని పొందుతుంది. 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది.
ఫ్లిప్‌కార్ట్‌లో రెడ్ మి 13సి 5జీ ఫోన్ అసలు ధర రూ.13,999గా ఉంది. అయితే ఇప్పుడు 25 శాతం తగ్గింపుతో బ్లాక్ కలర్ ఫోన్ రూ.10,402లకే లభిస్తుంది. అదే సిల్వర్ కలర్ అయితే రూ.10,510 లకు లిస్ట్ అయింది. దీనిపై బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. వన్‌కార్డు క్రెడిట్ కార్డు ఈఎంఐ ట్రాన్షక్షన్‌పై రూ.750 వరకు తగ్గింపు పొందొచ్చు.
Also Read: క్రేజీ డీల్.. సామ్‌సంగ్ ఫోన్‌పై రూ. 14 వేల డిస్కౌంట్!
అయితే అమెజాన్‌లో దీని ధర రూ.10,999గా ఉంది. అయితే HDFC బ్యాంక్ కార్డు, SBI క్రెడిట్ కార్డు, ICICI బ్యాంక్ డెబిట్ కార్డు నాన్ ఈఎంఐ ట్రాన్షక్షన్‌పై రూ.1000 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. అప్పుడు రూ.9,999లకే ఈ మొబైల్ లభిస్తుంది.
ఐటెల్ పి 55 5జీ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో అతి తక్కువ ధరలో అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ.12,999 ఉండగా ఇప్పుడు కేవలం రూ.9,488లకు లిస్ట్ అయింది. ఇది HD+ రిజల్యూషన్, 50MP డ్యూయల్ కెమెరాలు, డైమెన్సిటీ 6080 చిప్‌సెట్‌తో 6.6-అంగుళాల 90Hz LCD స్క్రీన్‌తో వస్తుంది.
ఫ్లిప్‌కార్ట్‌లో సామ్ సంగ్ గెలాక్సీ ఎఫ్14 5జీ ఫోన్‌పై మంచి ఆఫర్ ఉంది. దీని అసలు ధర రూ.17,490 ఉండగా.. ఇప్పుడు 37 శాతం తగ్గింపుతో రూ.10,990కి లిస్ట్ అయింది. అయితే పలు బ్యాంక్ ఆఫర్లతో మరింత తక్కువ ధరకే దీన్ని కొనుక్కోవచ్చు.