200W 25000mAh PowerBank| భారీ కెపాసిటీతో కొత్త పవర్ బ్యాంక్ తాజాగా లాంచ్ అయింది. యుగ్రీన్ (Ugreen) అనే కంపెనీ తన కొత్త నెక్సోడ్ ప్రో (Nexode Pro) పవర్ బ్యాంక్‌ను విడుదల చేసింది. ఇది ల్యాప్‌టాప్‌లతో పాటు ఎక్కువ పవర్ అవసరమయ్యే డివైస్‌ల కోసం ప్రత్యేకంగా తయారు చేశారు. ఇందులో పెద్ద 25,000mAh బ్యాటరీ ఉంది. అడ్వాన్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. కంపెనీ ప్రకారం.. ఇది మొత్తం 200W వరకు అవుట్‌పుట్ ఇస్తుంది. నాలుగు డివైస్‌లను ఒకేసారి ఛార్జ్ చేయవచ్చు, పైగా స్పీడ్ తగ్గదు.
ఈ పవర్ బ్యాంక్‌లో 25,000mAh పెద్ద బ్యాటరీ ఉంది. ఇది చాలా గంటల పాటు బ్యాకప్ ఇస్తుంది. 13-ఇంచ్ MacBook Airను 1.3 సార్లు పూర్తిగా ఛార్జ్ చేయగలదు. iPhone 17 Proను ఐదు సార్లు ఛార్జ్ చేయవచ్చు. ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, స్మార్ట్‌ఫోన్‌లకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది.
ఇందులో రెండు బిల్ట్-ఇన్ ఛార్జింగ్ కేబుల్స్ ఉన్నాయి. ఒకటి 2.2 అడుగుల పొడవు ఉన్న రిట్రాక్టబుల్ USB-C కేబుల్. రెండవది 1.2 అడుగుల పొడవు ఉన్నది, లాన్యార్డ్‌గా కూడా ఉపయోగపడుతుంది. అదనంగా ఒక USB-C పోర్ట్, ఒక USB-A పోర్ట్ ఉన్నాయి. ఇలా నాలుగు డివైస్‌లను ఒకేసారి కనెక్ట్ చేసి ఛార్జ్ చేయవచ్చు.
మొత్తం 200W అవుట్‌పుట్ ఇస్తుంది. ఒకే డివైస్‌కు బిల్ట్-ఇన్ USB-C కేబుల్ ద్వారా 100W వరకు ఇవ్వగలదు. నాలుగు డివైస్‌లు ఛార్జ్ అవుతున్నప్పుడు కూడా ఒక పోర్ట్ 100W ఇస్తుంది. ల్యాప్‌టాప్‌ను ఫుల్ స్పీడ్‌లో ఛార్జ్ చేస్తూ మిగిలినవి ఛార్జ్ చేయవచ్చు. విద్యుత్ సరఫరాను డివైస్ అవసరాలకు తగినట్టు స్మార్ట్‌గా పంచుతుంది.
ముందు భాగంలో TFT స్మార్ట్ డిస్‌ప్లే ఉంది. బ్యాటరీ శాతం రియల్ టైమ్‌లో చూపిస్తుంది. ఛార్జింగ్ స్పీడ్, అవుట్‌పుట్ పవర్, బ్యాటరీ హెల్త్ వివరాలు కనిపిస్తాయి. ఇది వినియోగ విధానాన్ని సులభతరం చేస్తుంది.
Also Read: మనుషుల కంటే వేగంగా పరుగులు తీసే రోబో.. ఒక్క సెకనులో 10 మీటర్ల స్పీడ్
డిజైన్ కాంపాక్ట్‌గా, బలంగా ఉంది. రోజువారీ ట్రావెల్‌కు అనువుగా ఉంటుంది. కొలతలు 158 x 54 x 50 మిల్లీమీటర్లు. బరువు సుమారు 631 గ్రాములు. బ్యాగ్ లేదా ఆఫీస్‌లో తీసుకెళ్లడానికి సులభం. ట్రావెలర్లు, ప్రొఫెషనల్స్‌కు బాగా సరిపోతుంది.
UKలో (బ్రిటన్ దేశాల్లో) ధర 89.99 పౌండ్లు, జర్మనీలో 99.99 యూరోలకు (భారత కరెన్సీలో దాదాపు రూ.11000) అందుబాటులో ఉంది. Ugreen అధికారిక వెబ్‌సైట్, Amazonలో కొనుగోలు చేయవచ్చు. ఇతర దేశాల్లో కూడా త్వరలో అందుబాటులోకి రావొచ్చ.