E-Paper
Advertisement

Herbicide Ban: ఈ గడ్డి మందుతో మనుషుల ప్రాణాలు పోతున్నాయ్..?

Herbicide Ban: ఈ గడ్డి మందుతో మనుషుల ప్రాణాలు పోతున్నాయ్..?
Advertisement

Herbicide Ban: స్వేచ్ఛ బ్యూరో: గడ్డి మందు వలన మనుషులు ప్రాణాలు పోతున్నాయ్ అని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. పారాక్వాట్ (గడ్డిమందు) రహిత భారత్ అంశంపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళారం కోఠి లోని ఐఎంఏ హల్‌లో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా కోదండరెడ్డి మాట్లాడుతూ.. రైతులు అమాయకులు వీటి పైన అంత అవగాహన ఉండదన్నారు. మన పూర్వికులు ఇలాంటి మందులు వాడలేదన్నారు.

నిషేదించేలా కేంద్ర చర్యలు

ఇప్పుడు రసాయనలతో కూడిన వ్యవసాయం అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మల్టీ నేషనల్ కంపెనీ వాళ్ళ కోసం ఇలాంటి మందులను తీసుకొస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కల్తీ ఎరువులు, మందులు వ్యవసాయ రంగం పైన తీవ్రమైన ప్రభావం చూపిస్తుందన్నారు. దీనిని నిషేదించేలా కేంద్ర చర్యలు తీసుకోవాలన్నారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) , స్పీకర్ లను కలిసి వినతిపత్రం అందజేస్తామని వెల్లడించారు. ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ ప్రజలు ప్రాణాలకు ముప్పుగా మారిన ఈ గడ్డి మందుని నిషేదించాలని డిమాండ్ చేశారు.

Advertisement

Also Read: Stree Nidhi MD: శ్రీనిధిలో సిత్రాలు.. 14 ఏళ్ల నుండి ఓకే వ్యక్తి ఎండీగా విధులు..?

ఈ మందు వల్ల..

దీని పైన పార్లమెంట్‌లో కూడా ప్రస్తావిస్తాం అన్నారు. ఇలాంటి ప్రమాదకరమైన మందులు అమెజాన్ వంటి కంపెనీలు ఆన్లైన్ లలో విక్రయించడం బాధాకరం అన్నారు. ఈ మందు వల్ల క్షణికవేశంలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, దీనిని పూర్తిగా నిషేదించేలా తన వంతు కృషి చేస్తానన్నారు. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ.. గడ్డిమందును కేంద్రం నిషేధించాలని డిమాండ్ చేశారు. ఈ మందుతో రైతు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Also Read: Gajwel District Hospital: గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స.. శభాష్..!

Related News

తెలంగాణ రాజకీయాల్లో డిజిటల్ వార్.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏఐ పోస్టర్లు, ఇవే రాజకీయాలంటూ ప్రజల చర్చ

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

ప్రపంచ స్థాయి చదువులంటే ఇదేనా? ఫీజు బకాయిల పెండింగ్‌పై హరీశ్ రావు నిలదీత

1000 రోజుల పాలన కాదు.. 1000 అబద్ధాల పాలన.. కాంగ్రెస్‌పై రాంచందర్ రావు ఫైర్

సత్తుపల్లిలో భూవివాదం కలకలం.. కోర్టు ఉత్తర్వులు ఉన్నా తహసీల్దార్ నివేదిక రైతుల ఆగ్రహం!

మెదక్ జిల్లాలో వింత ఘటన.. కుక్క పిల్లలకు పాలిస్తున్న వరాహం

పార్టీలో నుండి కవితను అందుకే తొలగించారు: ప్రశాంత్ రెడ్డి క్లారిటీ!

మహబూబాబాద్ జిల్లాలో షాకింగ్ సీన్.. లగ్జరీ కారులో వచ్చి మేకల దొంగతనం కలకలం

Big Stories

Advertisement
×