E-Paper
Advertisement

Trump Effect: ట్రంప్ నిర్ణయాలు ప్రభావం.. దేశం వీడుతున్న అమెరికన్లు, 1935 నాటి పరిస్థితులు రిపీట్?

Trump Effect: ట్రంప్ నిర్ణయాలు ప్రభావం.. దేశం వీడుతున్న అమెరికన్లు, 1935 నాటి పరిస్థితులు రిపీట్?
Advertisement

Trump Effect: ట్రంప్ వచ్చిన తర్వాత అమెరికాలో సీన్ రివర్స్ అయ్యిందా? ఆయన నిర్ణయాలు ఆ దేశంపై పెను ప్రభావాన్ని చూపుతున్నాయా? స్వదేశాన్ని విడిచి పెట్టేందుకు సగటు అమెరికన్లు సిద్ధమయ్యారా? ఇంటర్నేషనల్ మీడియాలో రకరకాలుగా కథనాలు ఎందుకు వెలువడుతున్నాయి? అందులోని అంశాలు అమెరికాను భయపెట్టేవిగా ఉన్నాయా?

ట్రంప్ నిర్ణయాలు..  స్వదేశాన్ని వీడుతున్న అమెరికన్లు?

Advertisement

యువకులు స్వర్గధామంగా అమెరికా ఉండేది. ప్రస్తుతం అక్కడ ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆదేశ చరిత్రలో ఎప్పుడూ లేనంతగా అమెరికన్లు సొంత దేశాన్ని విడిచిపెడుతున్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు వలసలకు కేరాఫ్‌గా మారిన అమెరికా, ఇప్పుడు ఆ దేశ ప్రజలు ఇతర దేశాలకు వలస వెళ్తున్నట్లు పలు నివేదికల ద్వారా తెలుస్తోంది.

250 వ సంవత్సరాన్ని జరుపుకోవాలని భావిస్తున్న ట్రంప్ సర్కార్‌కి బయటకు వచ్చిన నివేదికలు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికా తిరోగమనాన్ని చూస్తోందనే కథనాలు లేకపోలేదు.  90 ఏళ్ల కిందట వచ్చిన మహామాంద్యంలో కనిపించిన పరిస్థితి ఇప్పుడు రిపీట్ అవుతున్నట్లు కొన్ని మీడియా సంస్థలు ప్రత్యేకంగా చెబుతున్నాయి.

Advertisement

1935 నాటి రోజులు అమెరికాలో రిపీట్

బ్రూకింగ్స్ ఇన్‌స్టిట్యూషన్ అంచనాల మేరకు.. 2025లో అమెరికా నుంచి వెళ్లిన వారి సంఖ్య ఎక్కువగా ఉందని ప్రస్తావించింది. వలసల నేపథ్యంలో సుమారు 1,50,000 మందిని కోల్పోయిందని ఓ అంచనా. 2023 లో దాదాపు  60 లక్షల మంది అమెరికాకు వలస వచ్చారు. 2025 నాటికి ఆ సంఖ్య 27 లక్షలకు పడిపోయింది.

15 దేశాల పాక్షిక సమాచారం ఆధారంగా గతేడాది 1,80,000 మంది అమెరికన్లు వివిధ దేశాలకు వలస వెళ్లినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఈ సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశముందని పేర్కొన్నాయి. 2022లో మెక్సికోలో 1.6 మిలియన్ల మంది ఉంటున్నారని ఆ దేశ విదేశాంగ శాఖ అంచనా. కెనడాలో 2.5 లక్షల మంది, యూకెలో 3.25 లక్షల మంది నివాసం ఉన్నట్లు అందులో ప్రస్తావించింది.

వలసల వెనుక రకరకాల కారణాలు లేకపోలేదు. అమెరికాలో పెరిగిన జీవన వ్యయం కారణంగా యూరప్ వంటి దేశాల్లో మెరుగైన జీవన ప్రమాణాలు, భద్రత వంటివి ప్రధాన కారణాలుగా పేర్కొంది. ఒకప్పుడు సాహసవంతులు, ఉన్నత విద్యావంతులు దేశం విడిచి వెళ్లేవారని అంటున్నారు. తాజాగా సాధారణ మధ్యతరగతి ప్రజలు, కుటుంబాలు సైతం వలస బాటలో కొన్ని సంస్థలు చెబుతున్నాయి.

ALSO READ: ఉగ్రపోరులో అండగా ఉంటాం- ఇజ్రాయెల్ పార్లమెంట్ లో ప్రధాని మోదీ

కొవిడ్ తర్వాత పోర్చుగల్‌కు వెళ్లిన అమెరికన్ల సంఖ్య 500 శాతం పెరిగిందట. 2024 కంటే ఇది 36 శాతం పెరిగిందని అంటున్నారు. ఐర్లాండ్‌కు గతేడాదిలో 10 వేల మంది వలస పోయారు. అమెరికా పౌరసత్వం వదులు కోవడానికి దరఖాస్తులు క్రమంగా పెరుగుతున్నట్లు చెబుతున్నాయి. ఒకప్పుడు అమెరికాకు వచ్చే విదేశీ విద్యార్థులు 17 శాతం తగ్గినట్టు వెల్లడించాయి. ఇది మరింత తగ్గే అవకాశముందని అంటున్నాయి.

అదే సమయంలో ఐరోపా యూనివర్సిటీల్లో చదివేందుకు అమెరికన్లు మొగ్గు చూపుతున్నారట. 2025 నాటికి బ్రిటీష్ పౌరసత్వం కోసం 6,600 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. మీడియా బయటపెట్టిన గణాంకాలపై వైట్ హౌస్ భిన్నంగా స్పందించింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ ఇతర దేశాల కంటే మెరుగ్గా ఉందని చెబుతోంది. అక్రమ వలసదారులను వెనక్కి పంపుతున్నామని, అదే సమయంలో సంపన్నులను గోల్డ్ కార్డ్ వంటి పథకాలతో ఆకర్షిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. 1935లో ఉపాధి కోసం సోవియట్ యూనియన్‌కు వెళ్లారు అమెరికన్లు. ఆ స్థాయిలో వలసలు ఇప్పుడు నమోదు అయినట్టు ఫైనాన్సియల్ డైరీ పేర్కొంది.

Related News

పెరులో వరుస భూకంపాలు.. ఆరుగురు మృతి, వందలాది మంది నిరాశ్రయులు

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

సముద్రంలో పెను విషాదం.. రోహింగ్యా శరణార్థుల పడవలు బోల్తా.. 500 మందికి పైగా మృతి!

Big Stories

Advertisement
×