Honor 600S 5G: ప్రముఖ హానర్ నుంచి మిడ్‌రేంజ్ విభాగంలో ఒక కొత్త పవర్ ప్యాక్డ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి వచ్చింది. భారీ బ్యాటరీ, అద్భుతమైన డ్యూరబిలిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు కోరుకునే వారి కోసం Honor 600S 5G మోడల్‌ను అధికారికంగా మార్కెట్‌లోకి తెచ్చారు. ఇప్పుడీ హ్యాండ్‌సెట్ పూర్తి వివరాలేంటో తెలుసుకుందాం.
ఈ ఫోన్‌లో 6.87 ఇంచుల TFT LCD డిస్‌ప్లే ఇచ్చారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 1020 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. వెలుతురులో కూడా స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కళ్లకు శ్రమ తగ్గించేందుకు డైనమిక్ డిమ్మింగ్, లో బ్లూ లైట్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.
Also Read: మార్కెట్లో ఎన్నో స్మార్ట్‌వాచ్‌లు ఉన్నా.. శాంసంగ్‌లో మాత్రమే ఉండే 3 ప్రత్యేక ఫీచర్లు!
ఈ డివైజ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 4 ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. దీనిలో 8GB RAM, 128GB స్టోరేజ్ ఉన్నాయి. హానర్ ర్యామ్ టర్బో టెక్నాలజీతో వర్చువల్‌గా 16GB వరకు మెమరీ అనుభూతిని పొందవచ్చు. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత MagicOS 10తో నడుస్తుంది. ఇక దీని ప్రధాన ఆకర్షణ 8,100mAh భారీ బ్యాటరీ. దీనికి 45W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఐదేళ్ల వాడకం తర్వాత కూడా బ్యాటరీ కేపాసిటీ 80% కంటే ఎక్కువగా ఉంటుందని కంపెనీ చెబుతోంది.
ఫోన్ వెనుక వైపు 50MP ప్రధాన కెమెరా, ముందు భాగంలో 5MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. రెండింటిలోనూ 1080p వీడియో రికార్డింగ్ చేయవచ్చు. ఈ ఫోన్‌లో ప్రత్యేకంగా AI Key ఇచ్చారు. దీని ద్వారా Circle to Search, AI Memory, AI Summaries వంటి ఫీచర్లను సులభంగా వాడవచ్చు. మన కమాండ్స్ ఆధారంగా చిన్న వీడియోలను క్రియేట్ చేసే AI Image-to-Video 2.0 ఫీచర్ కూడా ఉంది.
ఇది IP68, IP69, IP69K వాటర్/డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్‌లతో రావడం విశేషం. 2.5 మీటర్ల ఎత్తు నుంచి కింద పడినా తట్టుకునే డ్రాప్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్ కూడా ఉంది. హాంగ్‌కాంగ్‌లో దీని ప్రారంభ ధర రూ.24,300గా ఉంది. త్వరలోనే ఇతర ఆసియా మార్కెట్లలోకి అందుబాటులోకి రానుంది.
Also Read: ఆండ్రాయిడ్ ల్యాప్‌టాప్‌లో ఈ సీక్రెట్ ఫీచర్స్ తెలుసా? మీ పనులన్నీ చాలా ఈజీ అయిపోతాయి!