E-Paper
Advertisement

Vi ధమాకా ఆఫర్లు.. రూ.599, రూ. 899 కొత్త ప్లాన్లు వచ్చేశాయ్.. రోజుకి రూ.10తో అపరిమిత బెనిఫిట్స్!

Vi ధమాకా ఆఫర్లు.. రూ.599, రూ. 899 కొత్త ప్లాన్లు వచ్చేశాయ్.. రోజుకి రూ.10తో అపరిమిత బెనిఫిట్స్!
Advertisement

Vi Recharge Plans: వోడాఫోన్ ఐడియా తన యూజర్ల కోసం సరికొత్తగా రెండు ప్రీపెయిడ్ ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. రూ. 599, రూ. 899 ధరలతో తీసుకొచ్చిన ఈ ప్లాన్లు.. ఎక్కువ రోజులు వ్యాలిడిటీ కోరుకునేవారికి పర్ఫెక్ట్ గా సరిపోతాయని వీఐ వర్గాలు చెబుతున్నాయి. గతంలో ఉన్న రూ. 859 ప్లాన్‌ను తొలగించి దాని స్థానంలోనే ఈ రెండు కొత్త ప్లాన్లను వీఐ తీసుకొచ్చినట్లు టెలికాం నిపుణులు భావిస్తున్నారు. ఈ కొత్త ప్లాన్ల వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటో ఈ కథనంలో చూద్దాం.

రూ. 899 ప్లాన్ ఆఫర్లు

ఈ రూ. 899 రీఛార్జ్ ప్లాన్ ను 84 రోజుల వ్యాలిడిటీతో వీఐ తీసుకొచ్చింది. ఈ ప్లాన్ కింద ప్రతీరోజూ 2GB డేటాతో పాటు అపరిమిత కాల్స్, రోజుకు 100 SMSలు యూజర్లకు లభించనున్నాయి. అంతేకాకుండా రాత్రి 12 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు ‘అపరిమిత నైట్ డేటా’ (Binge All Night) సదుపాయం కూడా ఇందులో ఉంది. వారంలో మిగిలిపోయిన డేటాను శని, ఆదివారాల్లో వాడుకునే ‘వీకెండ్ డేటా రోలోవర్’, నెలకు 2GB అదనపు ఫ్రీ డేటాను వీఐ ఆఫర్ చేస్తోంది.

Advertisement

Also Read: 12 ఏళ్ల ‘మన్ కీ బాత్’ ప్రయాణం.. దీన్ని ‘తీర్థయాత్ర’తో పోల్చిన ప్రధాని మోదీ!

రూ. 599 ప్రీపెయిడ్ ప్లాన్ ఆఫర్లు

పైన పేర్కొన్న బెనిఫిట్స్ నే తక్కువ రోజుల వ్యాలిడిటీతో కోరుకుంటే రూ. 599 ప్లాన్ రీఛార్జ్ చేసుకోవచ్చు. దీనిని 56 రోజుల వ్యాలిడిటీతో వీఐ తీసుకొచ్చింది. ఇందులో కూడా వినియోగదారులకు ప్రతిరోజూ 2GB డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ కింద 56 రోజుల పాటు అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు చేసుకోవచ్చు. ఇక అదనపు బెనిఫిట్స్ విషయానికి వస్తే పైన ప్లాన్‌లో ఉన్నట్టే ఇందులో కూడా వీకెండ్ డేటా రోలోవర్, బింజ్ ఆల్ నైట్, డేటా డిలైట్స్ బెనిఫిట్స్ యూజర్లకు లభిస్తాయి. కాగా వీఐ తెచ్చిన రెండు కొత్త ప్లాన్లు రోజుకయ్యే ఖర్చు సగటున రూ.10.70 కావడం గమనార్హం.

Advertisement

Also Read: రాజమౌళి నుంచి త్రివిక్రమ్ వరకు.. తనికెళ్ల భరణి చెప్పిన ఆసక్తికర విషయాలు!

Tags

Related News

రూ.630కే పోర్టబుల్ జ్యూసర్! క్షణాల్లోనే ఫ్రెష్ జ్యూస్ రెడీ

రూ.699కే అదిరిపోయే బేస్,లాంగ్ బ్యాటరీ బ్యాకప్‌తో హెడ్‌ఫోన్స్

రూ.9,990కే..మైక్రోవేవ్ ఓవెన్!బేకింగ్,గ్రిల్లింగ్,ఎయిర్ ఫ్రైయింగ్ అన్నీ ఒకే చోట

తక్కువ నెట్‌తో హై-క్లారిటీ వీడియోస్.. యూట్యూబ్ తీసుకొస్తున్న కొత్త టెక్నాలజీ ఇదే!

రూ. 2,000లకే ఎయిర్ ప్యూరిఫైయర్.. ఐఐటీ బాంబే రీసెర్చర్ అద్భుత ఆవిష్కరణ!

ఒప్పో నుంచి మరో మాస్టర్‌పీస్.. Find X10 సిరీస్ ఫీచర్లు, ధర వివరాలపై ఓ లుక్కేయండి!

అదుర్స్ అనిపించే సౌండ్..డాల్బీ ఆడియోతో అరిపించే మోడల్

Big Stories

Advertisement
×