E-Paper
Advertisement

Vi Plans: వీఐ సరికొత్త ప్లాన్స్.. అపరిమిత 5G డేటా, ఫ్రీ కాల్స్.. రోజుకు రూ.11 మాత్రమే!

Vi Plans: వీఐ సరికొత్త ప్లాన్స్.. అపరిమిత 5G డేటా, ఫ్రీ కాల్స్.. రోజుకు రూ.11 మాత్రమే!
Advertisement

Vi Plans: టెలికాం సంస్థలు తమ యూజర్లను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్స్ ను లాంచ్ చేస్తుంటాయి. ఈ క్రమంలోనే వోడాఫోన్ ఐడియా (Vi) తన వినియోగదారుల కోసం రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. రూ.670, రూ.1005 ధరలతో వచ్చిన ఈ ప్లాన్స్.. యూజర్లకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని వీఐ వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా డేటా అవసరం ఎక్కువగా ఉన్న వారికి ఈ ప్లాన్స్ ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నాయి. ఈ ప్లాన్స్ రీఛార్జ్ చేసుకోవడం వల్ల కలిగే లాభాలు ఏంటో ఈ కథనంలో పరిశీలిద్దాం.

రూ.670 రీఛార్జ్ ప్లాన్

ప్రతీ నెల అపరిమిత 5G డేటా ఇచ్చే ఉద్దేశంతో ఈ ప్లాన్ తీసుకొచ్చినట్లు వీఐ ప్రకటించింది. వాస్తవానికి అపరిమిత డేటా అని వీఐ చెప్పినప్పటికీ.. ప్రతీ నెల 300GB లిమిట్ విధించింది. అయితే ఇది చాలా ఎక్కువనే చెప్పాలి. రోజుకు 30 GB కంటే ఎక్కువే యూజర్ కు లభించనుంది. ప్లాన్ ఫీచర్ల విషయానికి వస్తే.. ఇది 56 రోజుల వ్యాలిడిటీతో వచ్చింది. 28 రోజుల కాలానికి 300GB హైస్పీడ్ డేటా చొప్పున 58 రోజుల్లో మెుత్తం 900GBని వినియోగదారుడు పొందవచ్చు. అలాగే అపరిమిత లోకల్, నేషనల్ కాల్స్.. రోజుకు 100 ఉచిత SMSలు ఈ ప్లాన్ కింద లభిస్తాయి. అయితే ఎలాంటి ఓటీటీ సబ్ స్క్రిప్షన్లను ఈ ప్లాన్ ఆఫర్ చేయడం లేదు.

రూ. 1005 ప్లాన్

Advertisement

రూ.670 రీఛార్జ్ ప్లాన్ నే మరిన్ని ఎక్కువ రోజులకు విస్తరిస్తూ.. వీఐ ఈ ప్లాన్ తీసుకొచ్చింది. ఇది 84 రోజుల వ్యాలిడిటీ కలిగి ఉంది. 28 రోజులకు 300GB చొప్పున నాలుగుసార్లు డేటాను పొందవచ్చు. అంటే ప్లాన్ పూర్తి కాలానికి ఏకంగా 1200GBని యూజర్ ఉపయోగించుకోవచ్చు. అదే విధంగా అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు ఈ ప్లాన్ లోనూ పొందవచ్చు. ఈ రెండు ప్లాన్ లకు రోజూవారి ఖర్చు చూస్తే సగటున రూ.11 మాత్రమే కావడం విశేషం. జియో, ఎయిర్ టెల్ తో పోలిస్తే.. ఇంత తక్కువకు అధిక డేటా ఇస్తున్న ప్లాన్స్ ఇవేనని వీఐ వర్గాలు చెబుతున్నాయి.

Also Read: BSNL CNAP Feature: BSNL సరికొత్త ఫీచర్.. Unknown కాల్స్.. ఎవరు చేశారో ఇట్టే తెలిసిపోద్ది!

ఎలా రీఛార్జ్ చేసుకోవాలి?

Advertisement

వోడాఫోన్ ఐడియా (Vi) విడుదల చేసిన ఈ కొత్త ప్లాన్‌లను చాలా సులభంగా రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇందుకోసం వివిధ మార్గాలు అందుబాటులో ఉన్నాయి. మీ ఫోన్ లో Vi App ఓపెన్ చేసి.. హోమ్ పేజీలో ‘Recharge’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. సెర్చ్ బార్‌లో 670 లేదా 1005 అని టైప్ చేయండి లేదా ‘Unlimited’ విభాగంలో వెతకండి. ప్లాన్ ఎంచుకున్న తర్వాత యూపీఐ, డెబిట్ లేదా క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్ చేయండి. లేదంటే వీఐ అధికారిక వెబ్ సైట్, Google Pay, PhonePe, Paytm యాప్స్ ద్వారా కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇది కానీ పక్షంలో దగ్గరలోని ఆఫ్ లైన్ స్టోర్లకు వెళ్లినా రీఛార్జ్ చేస్తారు.

Also Read: Dishwashers Under Rs 25,000: తక్కువ బడ్జెట్‌లో.. అద్భుతమైన కదిలే డిష్ వాషర్లు.. మిడిల్ క్లాస్‌కు పండుగే!

Related News

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

Big Stories

Advertisement
×