E-Paper
Advertisement

పాకిస్తాన్ తో జ‌రిగే మ్యాచ్ ల్లో టీమిండియాకే అనుకూలంగా అంపైర్ల‌ నిర్ణ‌యాలు !

పాకిస్తాన్ తో జ‌రిగే మ్యాచ్ ల్లో టీమిండియాకే అనుకూలంగా అంపైర్ల‌ నిర్ణ‌యాలు !
Advertisement

Khushdil Shah:  ఇండియా వర్సెస్ పాకిస్తాన్ (India vs Pakistan) మధ్య మ్యాచ్ అంటే జనాలు ఎంతో ఆత్రుతగా చూస్తారు అన్న సంగతి తెలిసిందే. దానికి తగ్గట్టుగానే వ్యూయర్ షిప్ కూడా వస్తుంది. ఏ స్టేడియంలో మ్యాచ్ జరిగినా టికెట్లు కూడా క్షణాల్లో సేల్ అవుతాయి. అంతలా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ చూస్తూ ఉంటారు. అయితే పాకిస్తాన్ పైన ఏ మ్యాచ్ జరిగినా ఇండియా అనే దాదాపు గెలుస్తుంది. 90% ఇండియా విజయాలు సాధిస్తుంటే.. పాకిస్తాన్ కేవలం 10% మాత్రమే సాధించడం గమనార్హం. అయితే దీనిపై తాజాగా పాకిస్తాన్ ఆల్ రౌండర్ ఖుష్దిల్ షా (Khushdil Shah) వాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఏ మ్యాచ్ జరిగినా, టీమిండియాకే అనుకూలంగా అంపైర్లు వ్యవహరిస్తారని ఆరోపణలు చేశారు. వేదికలు కూడా టీమిండియాకు అనుకూలంగా ఉన్న వాటిని మాత్రమే ఫైనల్ చేస్తారని అటు ఐసీసీపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఖుష్దిల్ షా చేసిన వ్యాఖ్యలు దుమారం వేపుతున్నాయి.

Also Read: Ambati Rayudu: బ‌ల‌హీనమైన గుజ‌రాత్ పై గెలిచి బిల్డ‌ప్ ఇస్తున్నారు..RCB ప‌రువు తీసిన అంబ‌టి Ambati Rayudu!

Advertisement

Also Read:  Tanveer Ahmed: బాబ‌ర్ ను ( babar azam) ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

పాకిస్తాన్ తో జ‌రిగే మ్యాచ్ ల్లో టీమిండియాకే అనుకూలంగా అంపైర్ల‌ నిర్ణ‌యాలు !

ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు పాకిస్తాన్ ఆల్ రౌండర్ ఖుష్దిల్ షా (Khushdil Shah). రెండు జట్ల మధ్య మ్యాచ్ అంటే ఎంతో ఉత్కంఠత నెలకొంటుందని వెల్లడించారు. రెండు దేశాల అభిమానులు ఎంతో ఆత్రుతగా ఈ మ్యాచ్ చూస్తారని వెల్లడించారు. దీంతో ప్లేయర్ లందరి పైన ఒత్తిడి పెరుగుతుందని కూడా వ్యాఖ్యానించారు. ఒక దేశం కోసం ఆడుతున్నాం కాబట్టి అందరం కష్టపడి ఆడాల్సిన అవసరం ఉంటుందని పేర్కొన్నారు. అయితే పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్ సందర్భంగా టీమిండియా కచ్చితంగా తొండాట‌ ఆడుతుందని ఫైర్ అయ్యారు. బీసీసీఐ చాలా బలమైనది కాబట్టి.. అంపైర్లను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించారు.

Advertisement

ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ లు జరిగితే.. తమ ప్రత్యర్థి టీమిండియా కే అంపైర్లు సానుకూలంగా నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపణలు చేశారు ఖుష్దిల్ షా. అలాంటి సంఘటనలు చాలానే ఉన్నాయని కూడా గుర్తు చేశారు. ఇంకా కొన్ని డ్రెస్సింగ్ రూముల్లో కొన్ని నిర్ణయాలు తీసుకొని.. వాటిని మ్యాచ్ సందర్భంగా అమలు చేస్తారని కూడా ఫైర్ అయ్యారు. మ్యాచ్ లో ఏదైనా వివాదం జరిగితే.. అప్పుడు కూడా ఇండియాకు అనుకూలంగానే పరిస్థితులు మారిపోతాయని బాంబు పేల్చారు. అందుకే ఇండియా ఎక్కువగా విజయాలు సాధిస్తుందని కుస్ దిల్ షా ఆరోపణలు చేశారు. ఇన్ని ఆటంకాలు ఎదుర్కొని పాకిస్తాన్ గెలిస్తే.. అప్పుడు వచ్చే మజా అంతా ఇంత కాదని కీల‌క విష‌యాలు పంచుకున్నారు ఖుష్దిల్ షా.

Also Read: Ambati Rayudu: బ‌ల‌హీనమైన గుజ‌రాత్ పై గెలిచి బిల్డ‌ప్ ఇస్తున్నారు..RCB ప‌రువు తీసిన అంబ‌టి Ambati Rayudu!

 

Related News

స్పెయిన్ ఆట‌గాడి నిర్ల‌క్ష్యం..కింద ప‌డి రెండు ముక్క‌లైన‌ ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ ట్రోఫీ?

కొంప‌ముంచిన ధర్మేంద్ర ప్రధాన్…గంభీర్ మెడ‌పైకి క‌త్తి? ఢిల్లీలో కొత్త టెన్ష‌న్‌

ఓరేయ్ వైభ‌వ్..నువ్వు మ‌గాడివైతే జింబాబ్వేపై సెంచ‌రీ కొట్టు !

బౌలింగ్ స‌రిగ్గా చేయ‌లేద‌ని ధోని ప‌చ్చిబూతులు తిట్టాడు, లైవ్ మ్యాచ్ లోనే అవ‌మానించాడు

AB డివీలియర్స్ లాగా ఆడి, టీమిండియాను చిత్తుగా ఓడిస్తా

టీమిండియా చేతిలో ఓడినందుకు మాపై కుళ్ళిన గుడ్లు, టమోటాలు విసిరారు

పాకిస్తానోడి సిక్స‌ర్లు..కావ్య పాప సంబ‌రాలు…మ‌ళ్లీ దేశ‌ద్రోహి అంటూ పోస్టులు

ర్యాంకింగ్స్ లో అట్ట‌డుగున ఉన్న పాకిస్తాన్‌..వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌డం అసాధ్యం

Big Stories

Advertisement
×