E-Paper
Advertisement

ఫ్యామిలీలో తలా ఒక రీఛార్జ్ ప్లాన్ వాడుతున్నారా? ఎందుకు భయ్యా డబ్బు వేస్ట్.. వీటిని ట్రై చేయండి!

ఫ్యామిలీలో తలా ఒక రీఛార్జ్ ప్లాన్ వాడుతున్నారా? ఎందుకు భయ్యా డబ్బు వేస్ట్.. వీటిని ట్రై చేయండి!
Advertisement

Jio vs Airtel Family Plans: ప్రస్తుత రోజుల్లో రీఛార్జ్ ప్లాన్స్ ఖర్చులు క్రమంగా పెరుగుతున్నాయి. ఫ్యామిలీలోని ప్రతీ సభ్యుడు వేర్వేరు ప్లాన్స్ వినియోగించడం వల్ల ఒక కుటుంబం నెలవారీ ఖర్చు ఈజీగా రూ.1500-2000 వరకూ అవుతుంది. ఒకవేళ ఈ మధ్యలో డేటా పరిమితి అయిపోతే.. యాడ్ ఆన్ ప్లాన్స్ ద్వారా మరింత అదనపు భారం యూజర్ పై పడుతుంది. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఎయిర్ టెల్, జియో వంటి ప్రముఖ టెలికాం సంస్థలు.. ఫ్యామిలీ పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఈ రెండు నెట్ వర్క్స్ ఎలాంటి ప్రయోజనాలు ఆఫర్ చేస్తున్నాయి? రెండింటిలో ఏ నెట్ వర్క్ బెస్ట్? ఈ కథనంలో పరిశీలిద్దాం.

జియో ఫ్యామిలీ ఫ్లాన్

జియో తన ఫ్యామిలీ ప్లాన్స్ లో తక్కువ ధరకు ఎక్కువ డేటాను అందించడంపై దృష్టి సారింది. ఈ ప్లాన్ ప్రారంభ ధరను రూ.449గా నిర్ణయించింది. ఇందులో ఒక మెయిన్ సిమ్ తో పాటు, మరో 3 అదనపు సిమ్ లను కలుపుకోవచ్చు. అయితే అదనపు సిమ్ కు నెలకు రూ.150 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. మీరు మెుత్తం 4 సిమ్‌లు వాడుతున్నారని భావిస్తే.. నెలకు సుమారు రూ.899 + GST అవుతుంది. అంటే ఒక్కొక్కరికి నెలకు రూ.265 లోపే ఖర్చవుతుంది. ఈ ఫ్యామిలీ ప్లాన్ కింద 75GB షేరబుల్ డేటా, 5GB అపరిమిత డేటా, జియో యాప్స్ సబ్ స్క్రిప్షన్, నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి ఓటీటీలను ఉచితంగా వీక్షించవచ్చు.

ఎయిర్‌టెల్ ఫ్యామిలీ ప్లాన్‌లు

Advertisement

ఎయిర్ టెల్ తన ఫ్యామిలీ ప్లాన్స్ లో నెట్ వర్క్ నాణ్యత, ఎంటర్ టైన్ మెంట్ బెనిఫిట్స్ కు ప్రాధాన్యత ఇచ్చింది. ఈ క్రమంలో ఈ ప్లాన్ ప్రారంభ ధరను రూ.549గా (2 సిమ్స్ వినియోగించుకోవచ్చు) నిర్ణయించింది. ఒకవేళ పెద్ద ఫ్యామిలీ అయితే రూ.999, రూ.1199 ప్లాన్లు సైతం అందుబాటులో ఉన్నాయి. రూ.999 ప్లాన్ తీసుకుంటే అందులో 4 సిమ్‌లు (1 మెయిన్ + 3 అదనపు) వస్తాయి. దీనిపై GST కలిపితే ఒక్కొక్కరికి సుమారు రూ.300 వరకు ఖర్చవుతుంది. ఈ ప్లాన్ కింద అపరిమిత డేటాతో పాటు హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్ వంటి ఓటీటీ సబ్ స్క్రిప్షన్లు లభిస్తాయి.

Also Read: బిర్యానీ ఆర్డర్ చేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త.. పాచి పోయినది వేడి వేడిగా డెలివరీ..!

రెండింటిలో ఏది బెస్ట్..?

Advertisement

నెలకు అయ్యే ఖర్చును వీలైనంత తగ్గించుకోవాలని భావిస్తే ఫ్యామిలీ ప్లాన్ లో జియో బెస్ట్. ఎందుకంటే జియోలో తక్కువ ధరకే ఎక్కువ మంది సభ్యులను (Add on SIMs) చేర్చుకునే అవకాశం ఉంది. పైగా 5G డేటా వాడకంపై ఎటువంటి పరిమితులు లేవు. అయితే ధరకు కాకుండా నెట్‌వర్క్ క్వాలిటీ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రయోజనాలకు ప్రాముఖ్యతనిస్తే ఎయిర్‌టెల్ (Airtel) బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తోంది. ఓవరాల్ గా చూస్తే బడ్జెట్, భారీ డేటా కోసం జియోను.. ప్రీమియం సర్వీసులు, మెరుగైన సిగ్నల్ కవరేజీ కోసం ఎయిర్‌టెల్‌ను ఎంచుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది.

Also Read: హైటెన్షన్.. హైదరాబాద్ జేఎన్‌టీయూలో బాంబు బెదిరింపు కాల్.. ఉలిక్కిపడ్డ విద్యార్థులు

Related News

ఖరీదైన గ్యాడ్జెట్లు అక్కర్లేదు.. 3D ప్రింటర్‌తో మీ హోమ్ థియేటర్‌ను ఇలా అప్‌గ్రేడ్ చేసుకోండి!

సుప్రీంకోర్టులో Vi కి భారీ ఊరట.. రూ.363 కోట్ల జీఎస్టీ వివాదంలో కేంద్రానికి షాక్!

ఐఫోన్ నీళ్లలో పడిందా? సర్వీస్ సెంటర్‌కు వెళ్లకుండా.. ఈ ఒక్క షార్ట్‌కట్‌తో నీటిని బయటకు పంపండి!

బడ్జెట్‌లో బిగ్ బ్యాటరీ స్మార్ట్‌ఫోన్.. ఫీచర్స్ చూస్తే వెంటనే కొనుక్కోవాలనిపిస్తుంది!

Sony vs Bose.. ఈ రెండింటిలో ఏ నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్‌ఫోన్స్ కొంటే మీ డబ్బులు వృధా కావు?

రూ.27,000కే ఇంత స్ట్రాంగ్ ఫోనా? 7200mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో అద్భుతమైన ఫీచర్లు!

మడతపెడితే క్రీజు కూడా కనిపించదు.. టెక్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న హువావే కొత్త ఫోన్!

ఎక్కువగా ప్రయాణాలు చేసేవారికి ఈ 5 గ్యాడ్జెట్స్ పక్కా ఉండాలి.. బ్యాగ్‌లో ఇట్టే పట్టేస్తాయి!

Big Stories

Advertisement
×