E-Paper
Advertisement

జీహెచ్ఎంసీకి విభజన సెగ.. పుట్టినా.. చచ్చినా అది రావాలంటే కష్టమే..?

జీహెచ్ఎంసీకి విభజన సెగ.. పుట్టినా.. చచ్చినా అది రావాలంటే కష్టమే..?

GHMC: స్వేచ్ఛ బ్యూరో: జీహెచ్ఎంసీలోకి పట్టణ స్థానిక సంస్థల విలీనం, ఆ తర్వాత కోర్ అర్బన్ రీజియన్ ను మూడు కార్పొరేషన్లుగా విభజించటంతో ఎవరికెలాంటి ప్రయోజనం చేకూరిందో గానీ మూడు కార్పొరేషన్ల పరిధిలో బర్త్, డెత్ సర్టిఫికెట్ల కోసం సామాన్య పౌరులు అష్టకష్టాలు పడాల్సి వస్తుంది. గత సంవత్సరం నవంబర్ 25వ తేదీ వరకు సజావుగా సాగిన బర్త్, డెత్ సర్టిఫికెట్ల ఆన్ లైన్ జారీ ప్రక్రియకు ఆ తర్వాత ఒక్కసారిగా స్తంభించిపోయింది. దీనిపై అధికారులను ప్రశ్నించగా, విలీనమైన 27 పట్టణ స్థానిక సంస్థల్లో ఒక విధంగా, జీహెచ్ఎంసీ పరిధిలో మరో విధంగా సర్టిఫికెట్ల జారీ జరుగుతుందని, మొత్తం కోర్ అర్బన్ రీజియన్ లో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీకి సంబంధించిన విధానాన్ని రీ మ్యాపింగ్ చేస్తున్నామని చెప్పుకొచ్చారు.

బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ..

కానీ స్థానిక సంస్థల విలీనం, ఆ తర్వాత దేశంలోనే అతి పెద్ద మున్సిపల్ కార్పొరేషన్ గా జీహెచ్ఎంసీ ఏర్పడినప్పటికీ, ఏర్పడే నాటికి జీహెచ్ఎంసీలో పాలక మండలి అధికారంలో కొనసాగుతుండటంతో, అధికార గడువు ముగిసిన ఫిబ్రవరి 11వ తేదీ నుంచి జీహెచ్ఎంసీ పరిధిని మూడు కార్పొరేషన్లుగా విభజించినా, నేటికీ పౌర సేవల నిర్వహణ, బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ కొలిక్కి రాలేదని దరఖాస్తుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా విలీనమైన పట్టణ స్థానిక సంస్థల సరిహద్దులైన సర్కిళ్లు, జోనల్ సరిహద్దుల్లోని పలు సర్కిళ్లలో రీ మ్యాపింగ్ కారణంగా సర్టిఫికెట్ల జారీలో సాంకేతికంగా పలు ఇబ్బందులు తలెత్తినా, వీలైనంత త్వరగా మరింత మెరుగైన వేగవంతమైన సేవలు అందుబాటులోకి వస్తాయని అధికారులు చెబుతూ వచ్చారు. కానీ నేటికీ రీ మ్యాపింగ్ ప్రక్రియ కొనసాగుతుండటంతో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ సక్రమంగా జరగటం లేదని దరఖాస్తుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దరఖాస్తుల స్వీకరణ వరకే పరిమితం

కొన్ని సర్కళ్లలో ఆన్ లైన్ దరఖాస్తు స్వీకరణ వరకు ప్రక్రియ కొనసాగి, ఆ తర్వాత హఠాత్తుగా స్ట్రక్ అవుతుందని మరి కొందరు దరఖాస్తుదారులు వాపోతున్నారు. బర్త్, డెత్ జరిగిన తర్వాత నిర్ణీత రోజుల్లోనే సర్టిఫికెట్లకు దరఖాస్తు చేయాలన్న నిబంధన ఉంది. దరఖాస్తు చేసుకున్న తమకు సకాలంలో సర్టిఫికెట్లు రాకపోతే నిర్ణీత గడువు ముగుస్తుందని కదా అని అధికారులను ప్రశ్నిస్తే దానికి తామేం చేస్తామంటూ దురుసుగా సమాధానమిస్తున్నట్లు వాపోతున్నారు.

Also Read: టూరిజం శాఖకు బదిలీల గ్రహణం.. పట్టుచిక్కేలోపే పోస్టింగ్ ఔట్!

దరఖాస్తు రిజెక్ట్..

ఈ క్రమంలో దరఖాస్తుదారులు ఈ సేవా, మీ సేవా కేంద్రాలతో జీహెచ్ఎంసీ సర్కల్ ఆఫీసుల్లోనున్న సిటిజన్ సర్వీసు సెంటర్లను కూడా ఆశ్రయిస్తున్నా, సర్టిఫికెట్ల జారీ సజావుగా జరగటం లేదని దరఖాస్తుదారులు వాదిస్తున్నారు. ఇటీవలే ముషీరాబాద్ లో జీహెచ్ఎంసీ ఉద్యోగి ఒకరు తమ తండ్రి చనిపోవటంతో డెత్ సర్టిఫికెట్ కోసం ఆన్ లైన్ దరఖాస్తు చేయగా, వరుసగా రెండు సార్లు దరఖాస్తు రిజెక్ట్ అయిందని, ఇదేమిటనీ సర్కిల్ అధికారులను ప్రశ్నిస్తే సర్టిఫికెట్ల జారీ వ్యవస్థ మొత్తం రీ మ్యాపింగ్ జరుగుతుందని దురుసుగా సమాధానం చెబుతున్నట్లు తెలిసింది. బర్త్ సర్టిఫికెట్లకు సంబంధించి కూడా ఇదే పరిస్థితి కొనసాగుతున్నట్లు ఖైరతాబాద్, ముషీరాబాద్ సర్కిల్లకు చెందిన కొందరు దరఖాస్తుదారులు వాపోతున్నారు.

ఇష్టారాజ్యంగా విచారణలు

జీహెచ్ఎంసీతో పాటు మిగిలిన రెండు మున్సిపల్ కార్పొరేషన్లలో ప్రతి సర్కిల్ కు వచ్చే బర్త్, డెత్ సర్టిఫికెట్ల దరఖాస్తులను ఫీల్డు లెవెల్‌లో శాస్త్రీయంగా విచారించేందుకు ప్రత్యేకమైన స్టాఫ్ అంటూ ఏమీ లేదు. కొన్ని సర్కిళ్లలో అటెండర్లు ఈ విచారణలను చేస్తూ, ఇష్టారాజ్యంగా నివేదికలిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. నిబంధనల ప్రకారం డెత్ గానీ బర్త్ గానీ జరిగిన చిరునామాపై విచారణ చేపట్టి, ఓ ఇద్దరితో పంచనామా నిర్వహించి నివేదికను సిద్దం చేసి, సర్టిఫికెట్ కోసం రికమెండ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఫీల్డు లెవెల్ లో విచారణ ప్రక్రియ మొత్తం ఇష్టారాజ్యంగా కొనసాగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మెహిదీపట్నం సర్కిల్ లో కూడా ఇటీవలే జీహెచ్ఎంసీ రిటైర్డు ఉద్యోగి చనిపోతే డెత్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే దరఖాస్తుపై ఫీల్డు విచారణకు వచ్చిన సదరు అటెండర్ నేరుగా ఓ వ్యక్తిని ఆ డెత్ గురించి విచారించి వెళ్లిపోయారు. ఆ తర్వాత దరఖాస్తును తిరస్కరించారు.

ఉద్దేశపూర్వకంగానే..

డెత్ సర్టిఫికెట్ కోసం కావల్సిన అన్ని రకాల సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లు సమర్పించిన తర్వాత ఎందుకు రిజెక్ట్ చేశారని ప్రశ్నించగా, తమ విచారణలో ఆ డెత్ తమ సర్కిల్ పరిధిలో జరగలేదని స్థానికులు చెప్పినట్లు సదరు అటెండర్ తెలిపినట్లు దరఖాస్తుదారుడు వాపోయారు. తీరా గమనిస్తే దరఖాస్తుదారుడితో పడని వ్యక్తి ఉద్దేశపూర్వకంగానే అలా చెప్పినట్లు తర్వాత తేలింది. ఆ సర్టిఫికెట్ కూడా ఇంకా పెండింగ్ లోనే ఉంది. భారత రాజ్యాంగా పౌరులకు కల్పించిన ప్రాథమిక హక్కులో భాగంగా స్థానిక సంస్థలు జారీ చేయాల్సిన బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ కి సంబంధించిన ప్రక్రియను వీలైనంత త్వరగా రీ మ్యాపింగ్ చేసి, సర్టిఫికెట్లు సకాలంలో జారీ అయ్యేలా చర్యలు చేపట్టాలని దరఖాస్తుదారులు మూడు కార్పొరేషన్ల అధికారులను కోరుతున్నారు.

Also Read: గుడ్‌న్యూస్.. వలస కూలీలకు కేంద్రం భారీ ఊరట.. ఇక రెట్టింపు వేగంతో గ్యాస్ సరఫరా!

Related News

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

Big Stories

×