E-Paper
Advertisement

Hansi Productions: హన్సి ప్రొడక్షన్స్ యూత్‌ఫుల్ లవ్ డ్రామా ప్రారంభం.. హీరోహీరోయిన్లు ఎవరంటే?

Hansi Productions: హన్సి ప్రొడక్షన్స్ యూత్‌ఫుల్ లవ్ డ్రామా ప్రారంభం.. హీరోహీరోయిన్లు ఎవరంటే?
Advertisement

Hansi Productions: మంచి ప్రేమకథను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని ఎన్నోసార్లు నిరూపితమైంది. రొటీన్‌గా కాకుండా, కొత్తదనంతో వచ్చే ప్రేమకథలకు ఎప్పుడూ లైఫ్ ఉంటుంది. ఇక లవ్ డ్రామాకు సరిపడా ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఉంటే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించడం ఖాయం. ఇప్పుడలాంటి చిత్రంతోనే రాబోతున్నామని అంటున్నారు హన్సి ప్రొడక్షన్స్ (Hansi Productions) బ్యానర్ నిర్మాత శ్రీ హన్సిక పెద్దిరెడ్డి. హన్సి ప్రొడక్షన్స్ బ్యానర్‌లో ఆమె నిర్మిస్తున్న యూత్‌ఫుల్ లవ్ డ్రామా చిత్రం శనివారం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవానికి చిత్ర యూనిట్‌తో పాటు పలువురు హాజరై యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. రఘువర్ధన్ కోట్ల (Raghu Vardhan Kotla) దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి కో ప్రొడ్యూసర్‌గా తవిటిరాజు తలచింతల వ్యవహరిస్తున్నారు. ప్రారంభోత్సవ వివరాల్లోకి వెళితే..

Also Read- Sree Vishnu: సినిమా ముందే లీకైంది.. ‘విష్ణు విన్యాసం’ హడావుడి రిలీజ్‌కు కారణమిదే!

యంగ్ జంటతో..

Advertisement

ఈ చిత్ర ముహూర్తపు షాట్‌కు శ్రీధర్ పెద్దిరెడ్డి క్లాప్ కొట్టారు. స్రవంతి పెద్దిరెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. శ్రీ హన్సిక పెద్దిరెడ్డి దర్శకుడికి స్క్రిప్ట్ ను అందజేశారు. ఈ చిత్రంలో యువ జంట జగన్ యోగి రాజు, నవ్య చిట్యాల హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ యంగ్ జంటతో పాటు సీనియర్ నటులు దేవీ ప్రసాద్ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. లక్ష్మణ్ మీసాల, పవన్ రమేష్, సునందిని, అంజు వాల్గుమన్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ వేడుకకు హాజరైన వారంతా సినిమా గ్రాండ్ సక్సెస్ కావాలని కోరారు. ఇలాంటి సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నందుకు హీరోహీరోయిన్లు తమ సంతోషాన్ని తెలియజేశారు.

Also Read- Virosh Wedding Pics:: విజయ్, రష్మిక పెళ్లి ఫోటోలు షేర్ చేసిన ఈషా రెబ్బ.. తరుణ్ భాస్కర్ తో కలిసి హీరోయిన్ సందడి..!

ఎంటర్‌టైన్‌మెంట్ లవ్ డ్రామా

Advertisement

అనంతరం నిర్మాత శ్రీ హన్సిక పెద్దిరెడ్డి (Sri Hansika Peddireddy) మాట్లాడుతూ.. సినిమా అనేది నాకు ఒక డ్రీమ్. ఒక ప్యాషన్. ఒక బాధ్యత. ఆ ప్యాషన్‌తోనే చిత్ర నిర్మాణంలోకి అడుగుపెడుతున్నాను. హన్సి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నా తొలి చిత్రాన్ని ఎంతో ప్రెస్టీజీయస్‌గా నిర్మించబోతున్నాం. ఇది ఒక అందమైన ఎంటర్‌టైన్‌మెంట్ లవ్ డ్రామా. ప్రేమ, భావోద్వేగాలు, వినోదం ఈ మూడు ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను అలరించేలా ఈ కథ ఉంటుంది. యూత్‌ని ఆకట్టుకునే అంశాలతో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను మెప్పించే అంశాలు ఇందులో ఉన్నాయి. మంచి కథకు ప్రాధాన్యతనిస్తూ, టెక్నికల్‌గా ఉన్నత ప్రమాణాలతో, నాణ్యమైన నిర్మాణ విలువలతో ఈ సినిమాను నిర్మిస్తున్నాం. ఈ చిత్రం నిర్మాతగా నాకు తొలి అడుగు మాత్రమే కాదు, భవిష్యత్తులో మరెన్నో మంచి, అర్థవంతమైన చిత్రాలకు పునాది అవుతుందని ఎంతగానో నమ్ముతున్నాను. ఈ ప్రయాణంలో అందరి సపోర్ట్ ఉంటుందని విశ్వసిస్తున్నానని తెలిపారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుందని దర్శకుడు రఘువర్ధన్ కోట్ల చెప్పారు.

Also Read- Actress Hari Teja: అల్లు అర్జున్ కోసం 15 రోజులు భోజనం మానేసిన నటి.. ఎందుకంటే?

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×