E-Paper
Advertisement

Kakinada Explosion: వేటపాలెం పేలుడు ఘటనలో గుండె పగిలే.. లైవ్ విజువల్స్!

Kakinada Explosion: వేటపాలెం పేలుడు ఘటనలో గుండె పగిలే.. లైవ్ విజువల్స్!
Advertisement

Kakinada Explosion: కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం సమీపంలో జరిగిన భారీ పేలుడు ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. గోదావరి కెనాల్ గట్టున ఉన్న ‘సూర్యశ్రీ ఫైర్ వర్క్స్’ బాణాసంచా తయారీ కేంద్రంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘోర ప్రమాదంలో మంటలు భారీగా ఎగిసిపడటంతో సుమారు 20 మంది కార్మికులు అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. అదే విధంగా మృతల సంఖ్య ఇప్పుడు 23 కు చేరుకుంది. మృతుల్లో అత్యధికంగా మహిళలే ఉండటం కలచివేసే అంశం.

ప్రమాద సమయంలో తయారీ కేంద్రంలో సుమారు 50 మంది కార్మికులు పని చేస్తున్నట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయి, ఘటనాస్థలి అత్యంత భయానకంగా మారింది. ఈ పేలుడు శబ్దం ఎంత తీవ్రంగా ఉందంటే, దాదాపు సామర్లకోట వరకు వినిపించిందని స్థానిక మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మృతులంతా సామర్లకోట, వేట్లపాలెం, హుస్సేన్‌పురం గ్రామాలకు చెందినవారు. వీరంతా గత పదేళ్లుగా ఇదే కేంద్రంలో నమ్మకంగా పని చేస్తున్నారని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Advertisement

క్షతగాత్రులను వెంటనే సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే.. ఇంకా కొంతమంది కార్మికుల ఆచూకీ లభించకపోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన ఎఐ వీడియో ఇప్పుడు చూద్దాం..

Related News

చిన్నారితో కలిసి బతుకమ్మ పాట పాడిన బిగ్ టీవీ రిపోర్టర్

కర్నూల్ మున్సిపాలిటీలో గెలుపెవరిది?.. బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్

లైవ్‌లో నకిలీ లెక్చరర్ల బాగోతం బట్టబయలు

ఛీ.. తూ మీ బ‌తుకు.. ఫేక్ అకౌంట్స్‌తో మ‌హిళ‌ల‌పై నింద‌లా!!

BRICS మాస్టర్ ప్లాన్.. ట్రంప్‌కు బిగ్ షాక్..?

డేంజర్ స్థాయికి AI.. ఆంథ్రోపిక్ సంచలన రిపోర్ట్..

తెలంగాణలో అనలాగ్ పన్నీర్ బ్యాన్!

కులగణన వెనుక పొలిటికల్ గేమ్..!

Big Stories

Advertisement
×