E-Paper
Advertisement

Slippers: ఇంటి ముందు చెప్పులు చిందరవందరగా పడేస్తున్నారా? అయితే జరిగేది ఇదే

Slippers: ఇంటి ముందు చెప్పులు చిందరవందరగా పడేస్తున్నారా? అయితే జరిగేది ఇదే
Advertisement

ఇంటి ప్రధాన ద్వారం అనేది కేవలం లోపలికి వెళ్లే తలుపు మాత్రమే కాదు.. అది ఇంటి శక్తి ప్రవాహానికి ప్రధాన మార్గం. ఈ ద్వారం ద్వారా శుభ శక్తి, ధనం ఇంట్లోకి వస్తాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. అయితే చాలా మంది అదే ప్రదేశంలో చెప్పులు, చెత్త, పాడైన వస్తువులు గుట్టలా ఉంచితే ఆ శుభశక్తి ప్రవాహానికి అడ్డు తగులుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

చెప్పుల వల్ల కలిగే ఫలితాలు
వాస్తు నిపుణులు చెప్పిన ప్రకారం ఇంటి ముందు చెప్పులు చిందర వందరగా, గుట్టలుగా పడేయడం వల్ల నెగటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ముఖ్యంగా తలుపు దగ్గర చెప్పులు చిందరవందరగా ఉంటే అది ఆర్థిక పరిస్థితులపై ప్రభావం చూపుతుందని నమ్మకం. అందుకే చాలా మంది ఇంటి ముందు పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తున్నారు. చెప్పులను తలుపు ముందు గుట్టలా పడేయకూడదు. ఇలా చేయడం వల్ల ఇంట్లోకి వచ్చే సానుకూల శక్తి తగ్గిపోతుంది.అలాగే చెప్పులు దుమ్ముతో, మురికి‌తో ఉంటే అది ఇంటి వాతావరణాన్ని కూడా ప్రతికూలంగా మార్చుతాయి.

Advertisement

Also read: Okra Water: బెండకాయ నీరు పరగడపున తాగితే వచ్చే ప్రయోజనాలు మీరు ఊహించలేరు

ఇలాంటి వస్తువులు వద్దు
ప్రధాన ద్వారం దగ్గర చెత్త, పాడైన వస్తువులు లేదా ఉపయోగం లేని వస్తువులు పెట్టడం కూడా మంచిది కాదు. ఇవి నెగటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయని భావిస్తారు. దీని వల్ల ఇంట్లో శాంతి తగ్గి, ఆర్థిక సమస్యలు పెరిగే అవకాశం ఉందని నమ్మకం. అలాగే తలుపు దగ్గర సరైన లైటింగ్ లేకపోవడం కూడా ఒక సమస్యగా భావిస్తారు. చీకటి ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో నెగటివ్ శక్తి పెరుగుతుందని వాస్తు చెబుతుంది. అందుకే ఇంటి ముందు ఎప్పుడూ తగినంత వెలుతురు ఉండేలా చూసుకోవాలి.

Advertisement

ఇంటి ముందు ఇలా
తలుపు సరిగా పనిచేయకపోవడం కూడా మంచిది కాదు. తలుపు తెరవగానే శబ్దం రావడం, సరిగా మూయకపోవడం వంటి సమస్యలు ఉంటే అది జీవితం లో అడ్డంకులకు సంకేతంగా భావిస్తారు. అందుకే తలుపు ఎప్పుడూ సరిగా ఉండేలా చూసుకోవడం మంచిది. మొదటగా ఇంటి ముందు ప్రదేశాన్ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలి. చెప్పులను ఒక క్రమంలో పెట్టేలా షూ ర్యాక్ వాడటం మంచిది. వీలైతే చెప్పులను తలుపు పక్కన లేదా మూలలో ఉంచాలి. అలాగే చిన్న మొక్కలు, నేమ్ ప్లేట్ పెట్టడం ద్వారా ప్రదేశం ఆకర్షణీయంగా మారుతుంది.

Also read: Motichoor Laddu: మోతీచూర్ లడ్డూ నోరూరేలా ఇలా ఇంట్లో సులువుగా చేసేయండి, రెసిపీ ఇదిగో

ఈ నియమాలను పాటిస్తే వాస్తు నమ్మకాల ప్రకారం మనసుకు ప్రశాంతత కలుగుతుంది. ముఖ్యంగా ఇంటి ముందు శుభ్రత, క్రమబద్ధత ఉంటే సానుకూల వాతావరణం పెరుగుతుంది. ఇంటి ముందు చెప్పులు గుట్టగా పెట్టడం వంటి చిన్న అలవాట్లు కూడా మన జీవనశైలిపై ప్రభావం చూపుతాయి.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×