E-Paper
Advertisement

Mobile Offers @ Rs 2,399: స్మార్ట్ వాచ్ ధరకే vivo T3 5G స్మార్ట్‌ఫోన్.. ఈ ఆఫర్ భలేగుంది బాసు..!

Mobile Offers @ Rs 2,399: స్మార్ట్ వాచ్ ధరకే vivo T3 5G స్మార్ట్‌ఫోన్.. ఈ ఆఫర్ భలేగుంది బాసు..!
Advertisement
Vivo T3 5G
Vivo T3 5G

vivo T3 5G @ Rs 2,399: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో ఇటీవల తన టి సిరీస్‌లో మరో మోడల్‌ను తీసుకువచ్చింది. ఇప్పటి వరకు తన టి సిరీస్‌లో టి1, టి2, టి2 ఎక్స్ వంటి ఫోన్లను మార్కెట్‌లో రిలీజ్ చేసింది. అయితే తాజాగా మరొక మోడల్‌ను ఫోన్ ప్రియులకు పరియం చేసింది.

వివో భారతీయ మార్కెట్‌లో మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ వివో టి3 5జీ (Vivo T3 5G)ని విడుదల చేసింది. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ 6.67-అంగుళాల AMOLED డిస్‌ప్లేతో వచ్చింది. ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి.

Advertisement

అయితే ఈ ఫోన్‌‌కి సంబంధించిన ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు, ధర వివరాలు మొదలైన వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

వివో టీ3 5జీ స్మార్ట్‌ఫోన్ మొత్తం రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్, అలాగే 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ ఆప్షన్లలో ఇది వచ్చింది. వీటి ధరల విషయానికొస్తే.. 8GB + 128GB వేరియంట్ ధర రూ.22,999 ఉండగా.. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో రూ.19,999గా లిస్ట్ అయింది.

Advertisement

Also Read: 5జీ ఫోన్ ధరకే ఐఫోన్ 13, 14, 15.. మంత్ ఎండ్ సేల్ అదిరిపోయింది!

అలాగే 8GB + 256GB వేరియంట్ ధర రూ.24,999 ఉండగా ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో రూ.21,999గా ఉంది. అయితే దీనిపై పలు బ్యాంక్ ఆఫర్‌లు కూడా ఉన్నాయి. SBI, HDFC బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్‌లను ఉపయోగించి కస్టమర్‌లు రూ.2,000 వరకు తక్షణ తగ్గింపును పొందవచ్చు.

ఇది కాకుండా ఈ ఫోన్లపై భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. 8GB ర్యామ్ + 128GB వేరియంట్‌పై ఏకంగా రూ.17,600 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందవచ్చు. ఈ డిస్కౌంట్‌తో వివో టీ3ని కేవలం రూ.2,399లకే కొనుక్కోవచ్చు.

అలాగే 8GB + 256GB వేరియంట్‌పై రూ.19,300 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందవచ్చు. ఈ డిస్కౌంట్‌తో దీనిని రూ.2,699లకే సొంతం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఈ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ మొత్తం పొందాలంటే.. పాత ఫోన్ మంచి కండీషన్‌లో ఉండాలి. ఎలాంటి హ్యాంగింగ్, డ్యామేజ్ ఉండకూడదు. అప్పుడు మాత్రమే పూర్తి ఎక్స్చేంజ్ డిస్కౌంట్ పొందుతారు.

ఫీచర్లు, స్పెసిఫికేషన్లు:

Also Read: పోకో కొత్త ఫోన్ లాంచ్.. తాజా ఆఫర్‌తో రూ.7 వేల లోపే కొనేయొచ్చు.. ఎలాగంటే..?

వివో టీ3 5జీ మొబైల్ 6.67 అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. దీని రిజల్యూషన్ 2400 x 1080 పిక్సెల్‌లు, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో MediaTek Dimensity 7200 చిప్‌ని అమర్చారు. ఇది 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. 44W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. Android 14 ఆధారిత Funtouch OS 14 పై రన్ అవుతుంది.

OIS సపోర్ట్‌తో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సోనీ IMX882 కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా, ఫ్లికర్ సెన్సార్ ఉన్నాయి. ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. అలాగే ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది.

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×