Big Stories

IPhone Offers @ Rs 8999: 5జీ ఫోన్ ధరకే ఐఫోన్ 13, 14, 15.. మంత్ ఎండ్ సేల్ అదిరిపోయింది..!

IPhone
Offers on iPhone

iPhone Offers @ Rs 8999: ప్రస్తుతం మార్కెట్‌లో స్మార్ట్‌ఫోన్లకు అద్భుతమైన డిమాండ్ ఉంది. మరీ ముఖ్యంగా ఐఫోన్లకు. ఈ ఐఫోన్లు అంటే కొందరు పడి చచ్చిపోతారు. ధర ఎంత ఎక్కువగా ఉన్నా.. కొనేందుకు వెనక్కి తగ్గరు. అయితే మరికొందరు మాత్రం లైఫ్‌లో ఒక్కసారి అయినా ఐఫోన్ కొనుక్కోవాలని అనుకుంటారు. కానీ, అధిక ధర కారణంగా తమ ప్లాన్‌ను మార్చుకుంటుంటారు.

- Advertisement -

అయితే ఇప్పుడు అలాంటి అవసరం లేదు. ఐఫోన్‌ను అత్యంత తక్కువ ధరలోనే కొనుక్కోవచ్చు. అదెలా అనుకుంటున్నారా.. అయితే రండి తెలుసుకుందాం.

- Advertisement -

ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం మార్చి 31తో ముగుస్తుంది. కొత్త ఫైనాన్సియల్ ఇయర్ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమవుతుంది. కావున ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సమీపిస్తున్నందున ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తాజాగా ఓ అద్భుతమైన సేల్‌ను ప్రకటించింది.

ఈ మేరకు ‘మంత్ ఎండ్ మొబైల్ ఫెస్ట్ సేల్‌’ను నిర్వహిస్తోంది. ఈ సేల్‌లో పలు రకాల మొబైల్ ఫోన్లపై మంచి డిస్కౌంట్లు పొందొచ్చు. మరీ ముఖ్యంగా యాపిల్ ఐఫోన్లపై భారీ తగ్గింపులను ఫ్లిప్‌కార్ట్ అందిస్తుంది.

Also Read: రీఛార్జ్ ప్యాక్ ధరకే 8/128 జీబీల స్మార్ట్‌ఫోన్.. ఇది చాలా హాట్ గురూ!

ఈ సేల్‌లో ఐఫోన్ 13, ఐఫోన్ 14తో పాటు ఇటీవలే మార్కెట్‌లోకి వచ్చిన ఐఫోన్ 15 వంటి మోడల్‌పై భారీ తగ్గింపులు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ డీల్‌కి సంబంధించిన పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం.

ఐఫోన్ 13:

ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్‌ 13పై సూపర్ డూపర్ డిస్కౌంట్ ఆఫర్ ఉంది. ఈ ఫోన్ అసలు ధర రూ.59,900 ఉండగా.. ఇప్పుడు 11 శాతం తగ్గింపుతో రూ.52,999కి కొనుక్కోవచ్చు. అంటే దీనిపై ఏకంగా రూ.6,901 డిస్కౌంట్ లభిస్తుంది అన్నమాట.

అలాగే బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంక్ కార్డుపై 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. అంతేకాకుండా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్‌కార్డు ఈఎంఐ – నాన్ ఈఎంఐ ట్రాన్షక్షన్‌పై రూ.1000 వరకు తగ్గింపు లభిస్తుంది.

ఇవికాకుండా దీనిపై భారీ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందొచ్చు. ఏకంగా రూ.44,000 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ పూర్తి డిస్కౌంట్ వర్తిస్తే.. కేవలం రూ.8,999లకే ఐఫోన్ 13ను కొనుక్కోవచ్చు. అయితే పాత మొబైల్ మంచి కండీషన్‌లో ఉండాలి. లేకపోతే ఇంతమొత్తంలో ఆఫర్ వర్తించకపోవచ్చు.

Also Read: అమెజాన్ హోలీ ఆఫర్.. రూ. 20,000 లోపే ఐఫోన్ 15, 14 plus, 13, 12

ఐఫోన్ 14:

ఐఫోన్ 14పై కూడా అద్భుతమైన ఆఫర్స్ ఉన్నాయి. దీని అసలు ధర రూ. 69,900 ఉండగా.. ఇప్పుడు 18 శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ.56,999లకే కొనుక్కోవచ్చు. అంటే ఏకంగా రూ.12,901 డిస్కౌంట్ లభిస్తుందన్నమాట. అలాగే యూపిఐ ట్రాన్షక్షన్‌పై రూ.750 వరకు తగ్గింపు పొందొచ్చు. అప్పుడు మరింత తక్కువ ధరకే లభిస్తుంది.

అలాగే దీనిపై కూడా భారీ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ ఉంది. ఏకంగా రూ.48,000 వరకు భారీ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందొచ్చు. ఈ డిస్కౌంట్‌తో ఐఫోన్ 14ను కేవలం రూ.8,999లకే సొంతం చేసుకోవచ్చు.

అయితే ఇంత మొత్తంలో ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందాలంటే.. పాత ఫోన్ అద్భుతమైన పనితీరును కలిగి ఉండాలి. ఎలాంటి హ్యాంగింగ్, డ్యామేజ్ ఉండకూడదు. అప్పుడు మాత్రమే ఇంతమొత్తంలో డిస్కౌంట్‌ను పొందుతారు.

Also Read: పోకో కొత్త ఫోన్ లాంచ్.. తాజా ఆఫర్‌తో రూ.7 వేల లోపే కొనేయొచ్చు.. ఎలాగంటే..?

ఐఫోన్ 15: 

ఐఫోన్‌ 15పై కూడా సూపర్ డూపర్ డిస్కౌంట్ ఆఫర్ ఉంది. దీని అసలు ధర రూ.79,900గా ఉంది. అయితే ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో 16శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ.66,999కి కొనుక్కోవచ్చు. అంటే రూ.12,901 డిస్కౌంట్ పొందొచ్చు.

అంతేకాకుండా పలు బ్యాంక్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ డిబిట్ కార్ట్ ఈఎంఐ ట్రాన్షక్షన్స్ పై రూ.1250 వరకు తగ్గింపు పొందొచ్చు. హెచ్‌ఎస్‌బీసీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ట్రాన్షక్షన్‌పై రూ.1500 వరకు తగ్గింపు పొందొచ్చు.

అప్పుడు మరింత తక్కువ ధరకే దీన్ని కొనుక్కోవచ్చు. అలాగే భారీ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ కూడా ఉంది. ఏకంగా రూ.50,000 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందొచ్చు. ఈ డిస్కౌంట్ ఆఫర్ వర్తిస్తే ఐఫోన్ 15ను కేవలం రూ.16,999లకే సొంతం చేసుకోవచ్చు. అయితే పాత మోడల్ మంచి కండీషన్‌లో ఉండాలి. అప్పుడు మాత్రమే ఇంతపెద్ద మొత్తంలో డిస్కౌంట్ పొందుతారు. ఒకరకంగా చూస్తే ఈ మూడు మోడల్స్‌ను కేవలం బడ్జెట్ 5జీ ఫోన్ ధరకే కొనుక్కోవచ్చు అన్నమాట.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News