BigTV English
Advertisement

Poco C61 @ Rs 7,000: పోకో కొత్త ఫోన్ లాంచ్.. తాజా ఆఫర్‌తో రూ.7 వేల లోపే కొనేయొచ్చు.. ఎలాగంటే..?

Poco C61 @ Rs 7,000: పోకో కొత్త ఫోన్ లాంచ్.. తాజా ఆఫర్‌తో రూ.7 వేల లోపే కొనేయొచ్చు.. ఎలాగంటే..?
poco c61 mobile
poco c61 mobile

Buy Poco C61 at Just Below Rs 7,000: పోకో స్మార్ట్‌ఫోన్లకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఈ కంపెనీ నుంచి ఇదివరకు రిలీజ్ అయిన ఫోన్‌లు అందరినీ బాగా అట్రాక్ట్ చేశాయి. సామాన్యుల దృష్టిని ఆకర్షిస్తూ కంపెనీ బడ్జెట్ ధరలో కొత్త కొత్త మోడళ్లను పరిచయం చేసింది. అయితే తాజాగా చౌక ధరలో మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ రిలీజ్ చేసింది.


Poco తన కొత్త స్మార్ట్‌ఫోన్ ‘Poco C61’ ను భారతదేశంలో విడుదల చేసింది. ఈ మొబైల్ గత సంవత్సరం ప్రారంభించిన Poco C51కి సక్సెసర్. శక్తివంతమైన పనితీరు, మంచి డిజైన్, డిస్‌ప్లేతో బడ్జెట్ ధరలో కొత్త ఫోన్‌ను కోరుకునే వినియోగదారుల కోసం రూపొందించబడింది.

ఇది రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. 4 GB ర్యామ్ + 64 GB స్టోరేజ్, అలాగే 6 GB ర్యామ్ + 128 GB స్టోరేజ్ వంటి వేరియంట్లలో రిలీజ్ అయింది. ఇక దీని ధర విషయానికొస్తే.. ఈ ఫోన్ 4/64GB వేరియంట్ ధర రూ.7,499గా కంపెనీ నిర్ణయించింది. అదే సమయంలో దాని 6/128 GB వేరియంట్‌ను రూ 8,499తో కొనుక్కోవచ్చని కంపెనీ తెలిపింది.


దీనిపై బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ యూపీఐ ద్వారా ఫస్ట్ ఆర్డర్ చేస్తే రూ. 250కి పైగా ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది. అలాగే ఫ్లిప్‌కార్ట్ యాక్సస్ బ్యాంక్ కార్డుపై 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందొచ్చు.

Also Read: ఏప్రిల్ నెలలో లాంచ్ కానున్న స్మార్ట్‌ఫోన్ల లిస్ట్ వచ్చేసింది..!

ఆసక్తిగల వినియోగదారులు మార్చి 28 మధ్యాహ్నం 12 గంటల నుండి ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో కొనుక్కోవచ్చు. ఇది డైమండ్ డస్ట్ బ్లాక్, ఎథెరియల్ బ్లూ, మిస్టికల్ గ్రీన్ వంటి కలర్ ఆప్షన్‌లలో వచ్చింది.

పోకో సి 61 స్మార్ట్‌ఫోన్ 6.71-అంగుళాల LCD HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్, 180Hz టచ్ శాంప్లింగ్ రేట్ ఉన్నాయి. డిస్‌ప్లే రక్షణ కోసం ఈ ఫోన్‌లో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ని కూడా అందిస్తుంది. దీని గరిష్ట బ్రైట్‌నెస్ లెవెల్ 500 నిట్‌లు.

Also Read: రీఛార్జ్ ప్యాక్ ధరకే 8/128 జీబీల స్మార్ట్‌ఫోన్.. ఇది చాలా హాట్ డీల్ గురూ..!

ఫోన్ గరిష్టంగా 6 GB LPDDR4x RAM, 128 GB వరకు eMMC 5.1 నిల్వతో అమర్చబడింది. MediaTek Helio G36 ప్రాసెసర్‌ని కలిగి ఉంది. అలాగే మెరుగైన సేఫ్టీ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. అలాగే ఫొటోల కోసం ఫోన్ వెనుక భాగంలో 8మెగా పిక్సెల్ కెమెరాను అందించారు. అదే సమయంలో సెల్ఫీల కోసం ఫోన్ ముందు భాగంలో 5మెగా పిక్సెల్ కెమెరాను అమర్చారు.

ఇందులో బలమైన బ్యాటరీ సామర్థ్యం ఉంది. ఈ ఫోన్ 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 10W ఛార్జర్‌కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14లో పనిచేస్తుంది.

Related News

iPhone 16 Offers: ఇదే మంచి తరుణం.. ఐఫోన్ 16 కొనాలనుకునేవారికి ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్ ఉందిగా!

Vivo V30e 5G Mobile: రూ.27 వేలలో ప్రీమియమ్ లుక్‌తో వివో వి30ఈ 5జి. ఈ ఫోన్‌ మీ కోసమే

Resume Free AI Tools: ఉద్యోగం కోసం మంచి రెజ్యూం కావాలా.. ఈ ఫ్రీ ఏఐ టూల్స్‌తో తయారు చేయడం ఈజీ

Best Gaming Mobiles: రూ.20వేల లోపు బెస్ట్ గేమింగ్ ఫోన్లు.. పర్‌ఫెక్ట్ పవర్‌ఫుల్ ఫోన్లు ఇవే..

India Top Selling Phone: శాంసంగ్, ఆపిల్‌ను వెనక్కునెట్టి.. భారత్‌లో అత్యధికంగా అమ్ముడుపోయే స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఇదే

Snapchat AI Search: ఏఐ ప్రపంచంలో కీలక ఒప్పందం.. స్నాప్‌చాట్‌లోకి పర్‌ప్లెక్సిటీ ఏఐ సెర్చ్‌!

Vivo 16GB RAM Phone Discount: వివో 16GB ర్యామ్, ట్రిపుల్ కెమెరా గల పవర్‌ఫుల్ ఫోన్‌పై షాకింగ్ రూ.34,000 డిస్కౌంట్.. ఎలా పొందాలంటే..

Smartwatch At Rs 1799: తక్కువ ధరలో టాప్‌ క్లాస్‌ లుక్‌.. రూ.8వేల స్మార్ట్‌వాచ్‌ జస్ట్ రూ1,799లకే

Big Stories

×