Big Stories

Snake Bites Man On Lips : వీడేంటి ఇలా ఉన్నాడు.. పాముతో లిప్‌లాక్!

Snake Bites Man On Lips
Snake Bites Man On Lips

Snake Bites Man On Lips : భూమి ఎన్నో అద్భుతమైన జీవాలతో నిండి ఉంది. వీటిలో అత్యంత విషపూరితమైనది పాములుయ కూడా ఉన్నాయి. ప్రకృతిలో చిన్న పాముల నుంచి భారీ అనకొండల వరకు జీవిస్తున్నాయి. ఈ పాములకు హిందువులు పూజలు కూడా చేస్తారు. అయితే మనలో ప్రతి ఒక్కరికి పామును చూస్తే భయంతో సచ్చిపోతాం. దాని పేరు విన్నా కూడా ఒంటిలో వణుకు పుడుతోంది. పాములు సాధారణంగా అడవిలో నివశిస్తాయి. వాటి ఆహారాన్ని కూడా అక్కడే సమకూర్చుకుంటాయి. కానీ పాములు ఒకేచోట అసలు ఉండవు. అటూ ఇటూ గిర్రునా తిరుగుతూనే ఉంటాయి. ఈ క్రమంలోనే అడవులు నుంచి జనావాసాల్లోకి ప్రవేశిస్తుంటాయి. ఎక్కువగా దట్టమైన చెట్లు, నీళ్లు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నక్కుతాయి.

- Advertisement -

ఈ క్రమంలో పాములు కనిపిస్తే కొందరు భయంతో మందు వెనక చూడకుండా పరుగులు పెడుతుంటారు. మరికొందరైతే ధైర్యంగా వ్యవహరించి చాకచక్యంగా వాటిని పట్టుకుంటారు. అనంతరం పామును సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదిలేస్తారు. మనం చూసినట్లయితే సర్కస్‌, పల్లెటూల్లో పాములను పట్టుకొని ఆడిస్తుంటారు. నాగస్వరంతో నాట్యం చేయిస్తుంటారు. ఇలా పాములతో వారి జీవణాన్ని సాగిస్తుంటారు.

- Advertisement -

Also Read :  తలకెక్కిన ఐపీఎల్ క్రేజ్.. స్టేడియంలో కొట్టుకున్న ఫ్యాన్స్

ఇలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు అనుకొని ఘటనలు సంభవిస్తుంటాయి. పాములను ఆడిస్తున్నప్పుడు అవి పొరపాటున దాడి చేస్తుంటాయి. ఇటువంటి సంఘటనలు మనకు ఇంటర్నెట్‌లో చాలానే కనిపిస్తాయి. పాము కాటు వేయడంతో ఇప్పటికే ఎందరో ప్రాణాలు పోయాయి. తాజాగా ఇటువంటి ఘటనే ఒకటి జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటో చూడండి.

వీడియో చూస్తే.. ఒక వ్యక్తి నాగుపామును పట్టుకొని ఉన్నాడు. అంతేకాకుండా ఆ పామును ఆడించే ప్రయత్నం చేస్తున్నాడు. చుట్టు చాలామంది జనం ఉన్నారు. వారంతా పామును ఆడించడం ఆసక్తిగా చూస్తున్నారు. ఆ పాము చూడటానికి ఎంతో భయంకరంగా ఉంది. అక్కడున్న జనాలు భయంతో దూరంగా ఉండి పామును చూస్తున్నారు. చట్టూతా జనం ఉండే సరికి అతడు కాస్త అతిగా ప్రయత్నించాడు.
పామును ముద్దు పెట్టుకునేందుకు యత్నించాడు. ఇంతలో పాము ఒక్కసారిగా కోపంతో జస్ట్ అలా చూస్తుండగానే అతడి పెదాలపై కాటు వేసింది. దెబ్బకు పామును వదిలేసి పరుగులు తీశాడు. అక్కడున్న వారంతా భయంతో కేకలు వేస్తూ వెళ్లిపోయారు.

Also Read : రోడ్డుపై రీల్స్ చేస్తున్న మహిళ.. ఊహించని షాక్ ఇచ్చిన బైకర్!

ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియలేదు కానీ.. @gharkekalesh అనే యూజర్ ఖాతా నుంచి Xలో అప్‌లోడ్ అయింది. ఈ వీడియో 90వేల వ్యూస్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. నెటిజన్లు కూడా దీనిపై స్పందిస్తున్నారు. రకరకాల కామెంట్లు చేస్తున్నారు. పాముతో పరచకాలు చేస్తే ఇలానే ఉంటుందని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. ఇంతకి అతడు బ్రతికే ఉన్నాడా లేదా అని మరొకరు అన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News