E-Paper
Advertisement

12000mAh Phone: పవర్ బ్యాంక్ కంటే పవర్‌ఫుల్ ఫోన్.. 12000mAh సింగిల్ సెల్ బ్యాటరీతో కొత్త రికార్డ్

12000mAh Phone: పవర్ బ్యాంక్ కంటే పవర్‌ఫుల్ ఫోన్.. 12000mAh సింగిల్ సెల్ బ్యాటరీతో కొత్త రికార్డ్
Advertisement

12000mAh Phone| స్మార్ట్‌ఫోన్ కంపెనీలు ఇప్పుడు ఎక్కువ బ్యాటరీ కెపాసిటీ గల ఫోన్లతో పోటీ పడాలని చూస్తున్నాయి. ఈ టెక్నాలజీలో చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ వివో ఒక పెద్ద అడుగు వేయబోతోంది. తాజాగా వచ్చిన లీక్స్ ప్రకారం వివో ఒక పవర్‌ఫుల్ ఫోన్‌ టెస్టింగ్ చేస్తోంది. ఈ ఫోన్‌లో ఒకే సెల్ బ్యాటరీ ఉంటుంది. రేటెడ్ కెపాసిటీ 10,000mAh వరకు ఉండవచ్చు. రియల్ యూసేజ్‌లో 11,000 నుంచి 12,000mAh వరకు ఈ బ్యాటరీ కెపాసిటీ ఇస్తుందని అంచనా. ఈ ఫోన్ లాంచ్ అయితే లాంచ్ అయితే చాలా పవర్ బ్యాంకుల కంటే బెటర్ అవుతుంది.

లీక్ వివరాలు, బ్యాటరీ టెక్నాలజీ

డిజిటల్ చాట్ స్టేషన్ వీబోలో ఒక చైనీస్ టిప్‌స్టర్ ఈ భారీ బ్యాటరీ ఫోన్ గురించి సమాచారం షేర్ చేశాడు. వివో 4.53V సింగిల్-సెల్ సిలికాన్ బ్యాటరీ డెవలప్ చేస్తోందని చెప్పాడు. రేటెడ్ కెపాసిటీ 10,000mAh ఉంటుంది. రియల్ యూస్‌లో 11,000 నుంచి 12,000mAh వరకు ఇవ్వవచ్చు. ఎఫిషియెంట్ చిప్‌సెట్ ఉంటే పర్‌ఫామెన్స్ మరింత మెరుగవుతుంది. రెండు నుంచి మూడు రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ ఉండే అవకాశం ఉంది. తరచూ ఛార్జ్ చేయాల్సిన అవసరం తగ్గుతుంది. ఇది ఇండస్ట్రీలో కొత్త రికార్డ్ సృష్టిస్తుంది.

స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో బ్యాటరీ కెపాసిటీ పోటీ

Advertisement

గతంలో 4,000mAh బ్యాటరీలు పెద్దవిగా భావించేవారు. ఇప్పుడు 5,000mAh స్టాండర్డ్ అయిపోయింది. చాలా ఫోన్లలో 7,000-8,000mAh బ్యాటరీలు వస్తున్నాయి. కొన్ని బ్రాండ్లు 10,000mAh బ్యాటరీ ఫోన్లు లాంచ్ చేశాయి. హానర్, రియల్‌మి వంటి కంపెనీలు ఇలాంటి హై-కెపాసిటీ ఫోన్లు తీసుకొచ్చాయి. ఎక్కువ బ్యాటరీ లైఫ్ కోసం యూజర్ల డిమాండ్ పెరిగింది. స్లిమ్ డిజైన్ కంటే ఎండ్యూరెన్స్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారు.

ఇతర బ్రాండ్ల నుంచి పోటీ అవకాశం

లీక్ ప్రకారం షావోమీ కూడా ఇలాంటి పెద్ద బ్యాటరీ ఫోన్ ప్లాన్ చేస్తోంది. కానీ ఇది ఇంకా ప్రారంభ దశలో ఉంది. ఏ కంపెనీ కూడా అధికారికంగా ధృవీకరించలేదు. కానీ ఇండస్ట్రీలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. 10,000mAh బ్యాటరీ ఫోన్లు సాధారణం అవుతాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ భారీ బ్యాటరీ ఫోన్లు యూజర్ల అంచనాలను మార్చేస్తుంది.

వివో ఫ్లాగ్‌షిప్, iQOO స్ట్రాటజీ

Advertisement

టిప్‌స్టర్ ప్రకారం వివో ఫ్లాగ్‌షిప్ మోడల్స్‌లో 9,000mAh బ్యాటరీ ఉండకపోవచ్చు. ప్రీమియం ఫోన్లను స్లిమ్‌గా ఉంచాలని వివో భావిస్తోంది. పెద్ద బ్యాటరీలు ఫోన్ మందం, బరువు పెంచుతాయి. కానీ వివో సబ్-బ్రాండ్ iQOO వేరే విధంగా వ్యవహరించవచ్చు. iQOOలో 9,000mAh బ్యాటరీ ఫోన్ లాంచ్ చేసే అవకాశాలున్నాయి. పెర్ఫామెన్స్-ఫోకస్డ్ యూజర్లను టార్గెట్ చేస్తుంది.

Also Read: మనుషులపై జోకులు వేసే ఏఐలు.. మానవులకు నో ఎంట్రీ ప్లాట్‌ఫామ్.. చాలా ప్రమాదకరం

సిలికాన్ బ్యాటరీ టెక్నాలజీ

ఈ ఫోన్‌లో సిలికాన్ బ్యాటరీ టెక్నాలజీ హైలైట్. సాధారణ లిథియం-ఐఆన్ బ్యాటరీలలో గ్రాఫైట్ యానోడ్ ఉంటుంది. సిలికాన్ యానోడ్ ఎక్కువ ఎనర్జీ డెన్సిటీ ఇస్తుంది. తక్కువ స్పేస్‌లో ఎక్కువ పవర్ నిల్వ చేయవచ్చు. పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ పూర్తిగా స్లిమ్‌గా ఉండవచ్చు. ఈ ఇన్నోవేషన్ సైజు, పర్‌ఫామెన్స్ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తుంది.

Related News

రూ.15,799లకే 43ఇంచుల టీవీ..ఆఫర్ అంటే ఇలా ఉండాలి

చైనా ఫోన్లకు చెక్ పెడుతూ.. హైదరాబాద్‌లోనే తయారైన తొలి Mivi 5G ఫోన్ వచ్చేస్తోంది!

రూ.వెయ్యిలోపు బెస్ట్ గేమింగ్ ఇయర్ బడ్స్..వెంటనే కొనేయండి

డెల్ నుంచి సూపర్ AI ల్యాప్‌టాప్‌లు లాంచ్.. 5G, Wi-Fi 7 ఫీచర్లతో కిరాక్ లుక్!

ట్రెండీ కలర్, టెర్రిఫిక్ ఫీచర్స్.. పాకెట్ ఫ్రెండ్లీ ధరలో బోల్ట్ Z60 పింక్ ఇయర్‌బడ్స్!

పాత లాప్‌టాప్ ఉందా? రిలయన్స్ జియో తెచ్చిన అప్డేట్‌తో సూపర్ స్పీడ్ PCగా మార్చేయండి!

యాంకర్ ప్రైమ్ గాడ్జెట్స్‌పై భారీ డిస్కౌంట్లు.. ఈ సెప్టెంబర్ బెస్ట్ డీల్స్ ఇవే!

బడ్జెట్ ధరలో బెస్ట్ ఫ్రిజ్ కావాలా ? మీ కోసమే టాప్-5 లిస్ట్

Big Stories

Advertisement
×